వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోవా సీఎం రేసులో విశ్వజిత్ రాణే, ప్రమోద్ సావంత్

|
Google Oneindia TeluguNews

పనాజీ : గోవా సీఎం అభ్యర్థి ఎంపిక బీజేపీకి అగ్నిపరీక్షగా మారింది. భాగస్వామ్య పక్షం ఎంజీపీ నేత సుదీన్ సీఎం అభ్యర్థిగా తన పేరు పరిశీలించాలని కోరడంతో పీఠముడి నెలకొంది. ఎంజీపీ అభ్యర్థికి సీఎం పదవీ ఇచ్చేందుకు బీజేపీ సుతారము ఇష్టంగా లేదు. దీంతో సీఎం అభ్యర్థి ఎంపిక నిర్ణయంలో జాప్యం జరుగుతోంది. దీంతో తమ ఎమ్మెల్యేలు, గోవా ఫార్వార్డ్ పార్టీ నేతలతో పలు దఫాలుగా చర్చలు జరుపుతోంది. రేపటికల్లా సీఎం అభ్యర్థి పై స్పష్టత వస్తోందని గోావా బీజేపీ నేత లోబో తెలిపారు.

రేసులో విశ్వజిత్ రాణే, ప్రమోద్ సావంత్
గోవా సీఎం రేసులో విశ్వజిత్ రాణే, ప్రమోద్ సావంత్ పేర్లను ఎమ్మెల్యేలు సూచించారని లోబో పేర్కొన్నారు. భాగస్వామ్య పక్షాల అభిప్రాయం తీసుకుని .. సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారు. భాగస్వామ్య పక్షాలకు సీఎం పదవీ ఇచ్చేందుకు ససేమిరా అంటోన్న బీజేపీ .. విశ్వజిత్ రాణే, ప్రమోద్ సావంత్ పేర్లను పరిశీలిస్తోంది. సామాజిక సమీకరణాలు, భాగస్వామ్య పార్టీల అభిప్రాయం తీసుకొని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Vishwajit Rane, Pramod Sawant Among Frontrunners for Goa CMs Post But No Consensus Yet

కుదరని ఏకాభిప్రాయం
సీఎం అభ్యర్థిపై బీజేపీ అధిష్టానం చర్చలు జరిపిందని, కానీ పార్టీలు ఏకాభిప్రాయానికి రాలేకపోయామని గోవా ఫార్వార్డ్ పార్టీ తెలిపింది. సమావేశం అస్పష్టంగా ముగిసిందని, మరో రోజు సమావేశంలో నిర్ణయం తీసుకుందని బీజేపీ నేతలు తెలిపారని ఆ పార్టీ అధినేత విజయ్ సర్దేశాయ్ పేర్కొన్నారు. పారికర్ లేని నోటును ఎలా పూడుస్తామని సమావేశంలో ప్రశ్న తలెత్తిందని, ఆయన స్థానాన్ని త్వరలోనే భర్తీ చేస్తామనే అభిప్రాయం వ్యక్తమైంది. తాము బీజేపీతో కలిసి ముందుకెళ్తామని, మరో పార్టీ వైపు చూడటం లేదని స్పష్టంచేశారు.

కిస్సా కుర్చీకా : గోవా సీఎం క్యాండెట్ పై బీజేపీ మంతనాలు, తెరపైకి ఎంజీపీ నేత సుదీన్ అభ్యర్థితం ?కిస్సా కుర్చీకా : గోవా సీఎం క్యాండెట్ పై బీజేపీ మంతనాలు, తెరపైకి ఎంజీపీ నేత సుదీన్ అభ్యర్థితం ?

త్వరలో ఎండ్ కార్డ్ ..

ఎమ్మెల్యేలతో విడివిడిగా సమావేశమవుతోన్న గడ్కరీ .. ఒక్కొక్కరి అభిప్రాయం తీసుకుంటున్నారని ఎంజీపీ అధినేత సుదీన్ పేర్కొన్నారు. సీఎం అభ్యర్థిపై నెలకొన్న స్తబ్ధతకు త్వరలోనే శుభం పడుతోందని విశ్వాసం వ్యక్తం చేశారు.

English summary
The BJP-led alliance in Goa did not reach a consensus over the next chief minister on Monday, a move necessitated by the demise of Manohar Parrikar. Parrikar, 63, died on Sunday evening at his residence near here after battling pancreatic cancer for over a year. Union minister and senior BJP leader Nitin Gadkari, who arrived here in the early hours of the day, could not secure a consensus between the saffron party and its alliance partners in the state, party MLA Michael Lobo said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X