వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కూలిన పాక్ విమానం, భారత్‌దిగా పాకిస్తాన్ ప్రచారం: ఈ ఫోటోతో బట్టబయలైన పాక్ అబద్దం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్ 16 విమానాల చిత్రం బయటకు వచ్చింది. భారత్‌ చేపట్టిన ఎయిర్ ఫోర్స్ దాడులకు ప్రతీకారం తీర్చుకోవడానికి పాకిస్తాన్ బుధవారం విఫలయత్నం చేసింది. ఇది ఉద్రిక్తతలకు దారి తీసింది.

అప్రమత్తంగా ఉన్న భారత బలగాలు పాకిస్తాన్ చర్యను తిప్పికొట్టాయి.ఈ క్రమంలో పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్ 16 యుద్ధవిమానాన్ని కూల్చేశాయి. అదే సమయంలో మన దేశానికి చెందిన మిగ్ 21 విమానాన్ని పాక్‌ బలగాలు నేలకూల్చాయి.

Visuals of cover of AARAM missile fired from Pakistani F 16 aircraft found near the LoC in India.

భారత్‌కు చెందిన మిగ్ 21 బైసన్‌ విమానం పైలట్‌ అభినందన్ పాకిస్తాన్‌కు బందిగా చిక్కడంతో ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదే సమయంలో పాకిస్తాన్‌కు చెందిన విమానం శకలాలను కూడా భారత విమాన శకలాలు అంటూ పాకిస్తాన్ ప్రచారం చేసింది. ఈ క్రమంలో ఆ చిత్రాలను పరిశీలించిన నిపుణులు అవి ఎఫ్ 16 శకలాలుగా గుర్తించారు. ఈ ఫోటోలో పాకిస్తాన్ 7 నార్తర్న్‌ లైట్‌ ఇన్‌ఫ్యాంట్రీ కమాండింగ్‌ ఆఫీసర్‌ చిత్రం కూడా ఉంది.

English summary
Visuals of cover of AARAM missile fired from Pakistani F-16 aircraft found near the LoC in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X