చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఐటీ శాఖ విచారణకు పూర్తిగా సహకరిస్తాం: భార్య నగలు, అకౌంట్స్, శశికళ మేనల్లుడు వివేక్!

|
Google Oneindia TeluguNews

చెన్నై: ఆదాయపన్ను శాఖ అధికారుల విచారణకు పూర్తిగా సహకరిస్తామని, ఐటీ శాఖ ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరౌతామని శశికళ మేనల్లుడు వివేక్ జయరామ్ అన్నారు. చెన్నైలో మీడియాతో మాట్లాడిన వివేక్ తాము చట్టప్రకారం వ్యాపారం చేస్తున్నామని సమర్థించుకున్నాడు.

జయలలిత వ్యక్తిగత వైద్యుడిని విచారిస్తున్న ఐటీ శాఖ, శశికళ బంధువు, రూ. కోట్ల ఆస్తులు ఎలా!జయలలిత వ్యక్తిగత వైద్యుడిని విచారిస్తున్న ఐటీ శాఖ, శశికళ బంధువు, రూ. కోట్ల ఆస్తులు ఎలా!

జాజ్ సినిమాస్, జయ టీవీ చానల్ అకౌంట్స్ అన్నీ సక్రమంగానే ఉన్నాయని, క్రమం తప్పకుండా ఆదాయపన్ను చెల్లిస్తున్నామని వివేక్ అన్నాడు. సోమవారం ఐటీ శాఖ అధికారుల ముందు విచారణకు హాజరైన వివేక్ మంగళవారం మళ్లీ నుంగంబాక్కంలోని ఐటీ శాఖ అధికారుల ముందు విచారణకు హాజరైనాడు.

జాజ్ సినిమాస్, జయ టీవీ అకౌంట్స్!

జాజ్ సినిమాస్, జయ టీవీ అకౌంట్స్!

ఐటీ శాఖ కార్యాలయంలోకి వెళ్లే ముందు వివేక్ మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే జాజ్ సినిమాస్, జయ టీవీ చానల్ అకౌంట్స్ ఆదాయపన్ను శాఖ అధికారులకు ఇచ్చామని వివేక్ స్పష్టం చేశారు. తన భార్య కీర్తనా బంగారు నగల గురించి ఆదాయపన్ను శాఖ అధికారులు ప్రశ్నించారని వివేక్ అన్నారు.

 నా భార్య బంగారు నగలు!

నా భార్య బంగారు నగలు!

తన భార్య కీర్తనాకు పెళ్లి సమయంలో ఆమె కుటుంబ సభ్యులు బంగారు నగలు ఇచ్చారని, ఆ లెక్కలు ఆదాయపన్ను శాఖ అధికారులకు చెప్పామని వివేక్ వివరించాడు. విదేశాల్లో చదువుకున్న వివేక్ చాల తెలివిగా వ్యవహరిస్తున్నాడని ఆదాయపన్ను శాఖకు చెందిన ఓ అధికారి అంటున్నారు.

చిక్కుల్లో శశికళ మేనకోడలు

చిక్కుల్లో శశికళ మేనకోడలు

వివేక్ సోదరి కృష్ణప్రియ సైతం చిక్కుల్లో పడింది. ఆమెను విచారణకు హాజరుకావాలని ఆదాయపన్ను శాఖ అధికారులు సూచించారని తెలిసింది. మంగళవారం విచారణకు హాజరుకావాలని శశికళ సోదరుడు దివాకరన్ కు ఆదాయపన్ను శాఖ అధికారులు ఇప్పటికే సమన్లు జారీ చేశారు.

అకౌంట్స్ లో తేడా వస్తే ఈడీ ఎంటర్?

అకౌంట్స్ లో తేడా వస్తే ఈడీ ఎంటర్?

శశికళ కుటుంబ సభ్యుల దగ్గర స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాలకు, ఆదాయపన్ను శాఖ లెక్కలకు తేడా వస్తే కేసును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి అప్పగించాలని ఐటీ శాఖ నిర్ణయించిందని సమాచారం. శశికళ చాల తెలివిగా జయలలితకు తెలీకుండా అక్రమాస్తులు సంపాధించారని వెలుగు చూసింది.

దినకరన్ తోడల్లుడు బినామి!

దినకరన్ తోడల్లుడు బినామి!

జయలలిత వ్యక్తిగత వైద్యుడిగా పని చేసిన టీటీవీ దినకరన్ తోడల్లుడు డాక్టర్ శివకుమార్, తోపాటు శశికళ మేనల్లుడు వివేక్, మేనకోడలు కృష్ణప్రియ తదితరుల పేర్లతో అక్రమాస్తులు కూడబెట్టారని తెలిసింది. శశికళకు చెందిన మద్యం కంపెనీ మిడాస్ లో డాక్టర్ శివకుమార్ డైరెక్టర్ హోదాలో ఉన్నారు.

English summary
For the first time after the marathon income tax raids at his office, residence and other places, Vivek Jayaraman, the CEO of Jaya TV and nephew of expelled AIADMK supremo V K Sasikala spoke to the media and said he is offering full cooperation to the IT department.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X