వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

VIVO: వీవో కంపెనీ డైరెక్టర్లు దేశం వదిలి చైనాకు జంప్,ఈడీ దెబ్బతో జింగ్ జాంగ్,జస్ట్ రూ. 10 వేల కోట్లు గోల్ మాల్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ హిమాచల్ ప్రదేశ్: చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్లు తయారు చేస్తున్న వీవో కంపెనీ డైరెక్టర్లు రాత్రికి రాత్రి భారత్ వదిలి చైనాకు పారిపోయారని వెలుగు చూసింది. ఈడీ అధికారులు బుధవారం వీవో కంపెనీకి చెందిన 44 ప్రాంతాల్లో దాడులు చేశారు. ఈడీ అధికారులు దాడులు చేసిన సమయంలో వీవో కంపెనీ డైరెక్టర్లు దేశం వదిలి చైనా పారిపోవడం హాట్ టాపిక్ అయ్యింది. ఈడీ అధికారుల సోదాల్లో వీవో కంపెనీ యాజమాన్యం రూ. 10,000 కోట్ల అక్రమ లావాదేవీలకు పాల్పడ్డారని వెలుగు చూసిందని సమాచారం. హిమాచల్ ప్రదేశ్ కు చెందిన సోలాన్ కంపెనీ డైరెక్టర్ అయిన చైనా జాతీయులు ఇద్దరు దేశం వదిలి చైనాకు పారిపోయారని ఈడీ అధికారుల విచారణలో వెలుగు చూసిందని ప్రముఖ జాతీయ మీడియా అంటోంది. చైనా జాతీయులు భారత్ లో అక్రమంగా వ్యాపారలావాదేవీలు నిర్వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

Actress: మామ మీద లైంగిక వేధింపుల కేసు పెట్టిన ప్రముఖ నటి, ముఖం పచ్చడి, రజనీ, సూర్యతో !Actress: మామ మీద లైంగిక వేధింపుల కేసు పెట్టిన ప్రముఖ నటి, ముఖం పచ్చడి, రజనీ, సూర్యతో !

చైనా వీవో మొబైల్ ఫోన్ కంపెనీ

చైనా వీవో మొబైల్ ఫోన్ కంపెనీ

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్లు తయారు చేస్తున్న వీవో కంపెనీ భారత్ లో జోరుగా వ్యాపారం చేస్తున్న విషయం తెలిసిందే. భారత ప్రభుత్వ నియమాలు ఉల్లంఘించి వీవో కంపెనీ నిర్వహకులు అక్రమ వ్యాపారలావాదేవీలు నిర్వహిస్తున్నారని ఆరోపలు ఉన్నాయి. చాలాకాలంగా వీవో కంపెనీ మీద సీబీఐ, ఈడీ అధికారులు కన్ను వేశారు.

44 ప్రాంతాల్లో ఈడీ అధికారుల దాడులు

44 ప్రాంతాల్లో ఈడీ అధికారుల దాడులు

ఈడీ అధికారులు బుధవారం వీవో కంపెనీకి చెందిన 44 ప్రాంతాల్లో దాడులు చేశారు. వీవో కంపెనీ ఆర్థికలావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించిన ఈడీ అధికారులు ఆ కంపెనీకి చెందిన కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. ఈడీ అధికారులు దాడులు చేసిన సమయంలో వీవో కంపెనీ డైరెక్టర్లు దేశం వదిలి చైనా పారిపోవడం హాట్ టాపిక్ అయ్యింది.

రూ. 10 వేల కోట్ల అక్రమ లావాదేవీలు. చైనాకు జంప్

రూ. 10 వేల కోట్ల అక్రమ లావాదేవీలు. చైనాకు జంప్

ఈడీ అధికారుల సోదాల్లో వీవో కంపెనీ యాజమాన్యం రూ. 10,000 కోట్ల అక్రమ లావాదేవీలకు పాల్పడ్డారని వెలుగు చూసిందని సమాచారం. హిమాచల్ ప్రదేశ్ కు చెందిన సోలాన్ కంపెనీ డైరెక్టర్ అయిన చైనా జాతీయులు ఇద్దరు దేశం వదిలి చైనాకు పారిపోయారని ఈడీ అధికారుల విచారణలో వెలుగు చూసిందని ప్రముఖ జాతీయ మీడియా అంటోంది.

కేసు నమోదు చేసిన సీబీఐ

కేసు నమోదు చేసిన సీబీఐ

వీవో కంపెనీ, దాని అనుబంధ సంస్థలు అక్రమంగా చైనాకు చెందిన కొందరిని డైరెక్టర్లుగా నియమించుకుందని ఆరోపణలు ఉన్నాయి. భారత్ లో వీవో కంపెనీ అక్రమ మార్గంలో వ్యాపారాలు చేస్తోందని ఇప్పటికే సీబీఐ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. వీవో కంపెనీ మీద సీబీఐతో పాటు ఈడీ అధికారులు పంజా విసిరారు.

విచారణకు సహకరిస్తాం: వీవో కంపెనీ అధికారులు

విచారణకు సహకరిస్తాం: వీవో కంపెనీ అధికారులు

అయితే ఈడీ అధికారుల విచారణకు పూర్తిగా సహకరిస్తామని, అధికారులు ఏ సమాచారం అడిగినా ఇవ్వడానికి మేము సిద్దంగా ఉన్నామని వీవో కంపెనీకి చెందిన అధికారులు అంటున్నారని ప్రముఖ జాతీయ మీడియా ఏఎన్ఐ తెలిపింది. మొత్తం మీద భారత్ కు పంగనామాలు పెట్టడానికి అక్రమ మార్గంలో వ్యాపారం చేస్తున్న వీవో కంపెనీ డైరెక్టర్లు ఈడీ అధికారుల దెబ్బకు చైనాకు పారిపోయారని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

English summary
VIVO: China based directors of VIVO India fled away from country after ED raids.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X