వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చవన్‌ప్రాష్‌, ఆయుర్వేదంతో కరోనా మాయం-కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ ఛైర్మన్-విమర్శల వెల్లువ

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం పెరుగుతోంది. పలు రాష్ట్రాల్లో లెక్కకుమిక్కిలిగా నమోదవుతున్న కేసులతో లాక్‌డౌన్‌ పరిస్దితులు పునరావృతం అయ్యేలా ఉన్నాయి. ఇలాంటి సమయంలో కరోనాపై పోరుకు శాస్త్రీయమైన పరిష్కారం చూపాల్సిన కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ ఛైర్మన్ చవన్‌ప్రాష్‌, ఆయుర్వేదం వాడమంటూ ఓ సలహా ఇచ్చారు. ఆయుర్వేదం, ఆయుష్ పద్దతుల్లోనే కరోనాను తగ్గించవచ్చని ఆయన తెలిపారు. దీన్ని కేంద్ర ఆరోగ్యశాఖ కూడా అమలు చేయాలని కోరారు. దీనిపై దుమారం చెలరేగుతోంది.

 కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ ఛైర్మన్ వ్యాఖ్యల దుమారం

కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ ఛైర్మన్ వ్యాఖ్యల దుమారం

దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో స్వల్ప లక్షణాలు ఉన్న వారు, అసలు లక్షణాలే లేని వారు ఆయుర్వేద వైద్యుల్ని సంప్రదించాలని కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ ఛైర్మన్ వీకే పౌల్‌ సంచలన సూచన చేశారు. అలాగే చవన్‌ ప్రాష్‌తో పాటు ఆయుర్వేద మూలికలు తీసుకుని రోగనిరోధకశక్తి పెంచుకోవాలని కోరారు. ప్రస్తుత పరిస్దితుల్లో ఇలాంటి చికిత్సలపై ఆధారపడాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

రోజుకు రెండుసార్లు చవన్‌ప్రాష్‌

రోజుకు రెండుసార్లు చవన్‌ప్రాష్‌

కోవిడ్‌పై పోరాడేందుకు ప్రభుత్వం సూచించిన పద్ధతుల్లో ఆయుర్వేదం, ఆయుష్‌ (ఆయుర్వేద, యోగా, నేచురోపతీ, యునానీ, సిద్ధ, హోమియోపతి) ఉన్నాయని వీకే పౌల్‌ తెలిపారు. మరింత స్పష్టంగా చెప్పాలంటే రోజుకు రెండుసార్లు చవన్ ప్రాష్‌ తీసుకోవాలని సూచించారు. అలాగే పసుపు పాలు రోజుకోసారి తీసుకోవాలన్నారు. ఇలాంటి మరెన్నో పద్ధతులు మన దేశంలోని ప్రజలు ఇప్పటికే అనుసరిస్తున్నారని ఆయన తెలిపారు. ఇవేవీ కొత్తేమీ కాదన్నారు. అలాగే రోజూ యోగా కూడా చేయాలని ఆయన సూచించారు.

కేంద్రానికి వీకే పౌల్‌ సిఫార్సులు

కేంద్రానికి వీకే పౌల్‌ సిఫార్సులు

కేంద్ర ప్రభుత్వం కూడా ఆయుర్వేద, ఆయుష్‌ పద్ధతుల్లో కోవిడ్ చికిత్సా పద్ధతులను అమలు చేసేలా ఆరోగ్యమంత్రిత్వశాఖ చర్యలు తీసుకోవాలని కోవిడ్ టాస్క్‌ఫోర్స్ ఛైర్మన్‌గా ఉన్న వీకే పౌల్‌ సిఫార్సు చేశారు. ప్రభుత్వం తరఫున ఆరోగ్యమంత్రిత్వశాఖకు తాను ఈ సిఫార్సు చేస్తున్నట్లు వీకే పౌల్‌ ప్రకటించారు. దీంతో వీకే పౌల్‌ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. శాస్త్రీయ పద్ధతుల్లో కరోనాకు చికిత్స సూచించాల్సింది పోయి ఆయుర్వేదం, ఆయుష్‌ను నమ్ముకోవాలని చెప్పడమేంటన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

వీకే పౌల్‌ సిఫార్సుపై డాక్టర్ల ఆగ్రహం

వీకే పౌల్‌ సిఫార్సుపై డాక్టర్ల ఆగ్రహం


కోవిడ్‌ టాస్క్‌పోర్స్‌ ఛైర్మన్‌ వీకే పౌల్‌ వ్యాఖ్యలపై డాక్టర్లు మండిపడ్డారు. ఆయన దేశాన్ని మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు కరోనా వస్తే చవన్‌ప్రాష్‌ లేదా ఆయుర్వేద చికిత్స తీసుకోండి ఆస్పత్రికి వెళ్లకండి అని వారు వీకే పౌల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మీరు చెప్తున్నట్లు చవన్‌ప్రాష్‌కో, ఆయుర్వేదానికో కరోనా తగ్గితే ఇక వ్యాక్సిన్లు ఎందుకని ఇండియన్‌ మెడికల్ అసోసియేషన్‌ మాజీ జాతీయ అధ్యక్షుడు రాజన్ శర్మ ప్రశ్నిస్తున్నారు. ఇంట్లో ఉండే వారు మీ మాటలు విని ఆయుర్వేద మూలికలు, పసుపుపాలు తాగడం మొదలుపెడతారన్నారు. చివరికి ప్రాణాలపైకి వస్తే డాక్టర్లను తప్పుబడతారని ఆయన అన్నారు.

English summary
niti aayog member and covid 19 task force chairman vk paul recommendation to consume chyawanprash and kadha (a brew of herbs and spices) to improve immunity against covid 19 triggering criticism from doctors who said such ideas could encourage people to try untested therapies and wait too long to seek medical help.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X