వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిన్నమ్మ శశికళ ముందస్తు ముచ్చట లేనట్లేనా? జైల్లో లగ్జరీ లైఫ్ నిజమే, నివేదిక !!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జే. జయలలిత నెచ్చెలి వీకే. శశికళ ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో కర్ణాటక రాజధాని బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. సత్పప్రవర్తన కోటా కింద వీకే. శశికళ ముందస్తు విడుదల అవకాశాలు ఆవిరైపోయినట్లు తెలుస్తోంది. సాధారణ ఖైదీలా కాకుండా శశికళ అసాధారణ ఖైదీలా అనేక సౌకర్యాలు పొందారని రుజువు కావడంతో సత్పప్రవర్తన కోటా కింద ఆమెను విడుదల చెయ్యడం సాధ్యం కాదని వెలుగు చూసింది.

కాలేజ్ అమ్మాయిలకు సెక్స్ పాఠాలు, కోర్టులో కుప్పకూలిన ప్రొఫెసర్ నిర్మలా దేవి !కాలేజ్ అమ్మాయిలకు సెక్స్ పాఠాలు, కోర్టులో కుప్పకూలిన ప్రొఫెసర్ నిర్మలా దేవి !

జైల్లో లగ్జరీ లైఫ్

జైల్లో లగ్జరీ లైఫ్

ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న వీకే. శశికళ సాధారణ ఖైదీలా కాకుండా లగ్జరీ లైణ్ గడుపుతున్నారని వెలుగు చూసింది. శశికళ లగ్జరీ లైఫ్ గడపడానికి అప్పటి కర్ణాటక జైళ్ల శాఖ డీజీపీ సత్యనారాయణ రావ్ కు రూ. 2 కోట్లు లంచం ఇచ్చారని 2018లో జైళ్ల శాఖా మాజీ డీఐజీ రూపా ఆరోపించారు.

 మాజీ ఐఏఎస్ విచారణ

మాజీ ఐఏఎస్ విచారణ

డీఐజీ రూపా ఆరోపణలపై మాజీ ఐఏఎస్ అధికారి వినయ్ కుమార్ నేతృత్వంలో విచారణకు కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. విచారణ పూర్తి చేసిన వినయ్ కుమార్ నేతృత్వంలోని కమిటీ ఆ నివేదికను హోం మంత్రిత్వ శాఖకు సమర్పించింది, అయితే వినయ్ కుమార్ నివేదికను బహిరంగ పరచలేదు.

 రూ. 2 కోట్ల లంచం కథ

రూ. 2 కోట్ల లంచం కథ

మాజీ ఐఏఎస్ అధికారి వినయ్ కుమార్ తన నివేదికలో డీఐజీ రూపా చేసిన ఆరోపణలు నిజం అని హో మంత్రిత్వ శాఖకు నివేదిక ఇచ్చారు. అయితే పోలీసు అధికారి సత్యనారాయణ రావ్ కు రూ. 2 కోట్లు ముడుపులు ఇచ్చిన విషయంలో క్లారిటీ ఇవ్వలేదని సమాచారం. సత్యనారాయణ రావ్ కు రూ. 2 కోట్లు లంచం ఇచ్చారని వచ్చిన ఆరోపణలపై ఏసీబీ అధికారులు విచారణ చేశారు. వినయ్ కుమార్ కానీ, ఏసీబీ అధికారుల కానీ రూ. 2 కోట్ల లంచం విషయంలో నివేదిక బహిరంగ పరచలేదు.

ముందస్తు ముచ్చట లేనట్లే !

ముందస్తు ముచ్చట లేనట్లే !

శిక్షా కాలంలో సత్పప్రవర్తన కారణంగా చూపించి వీకే. శశికలను 2020 ఫిబ్రవరి-జూన్ మధ్య కాలంలో ముందుగానే విడుదల చెయ్యాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే శశికళ జైల్లో లగ్జరీ లైఫ్ గడిపారని విచారణలో వెలుగు చూడటంతో ఆమె ముందుస్తు విడుదల ముచ్చటగానే మిగిపోతున్నదని సమాచారం.

వినయ్ కుమార్ విచారణ నివేదిక ముందుగానే మీడియాకు లీక్ కావడంతో ఈ వివాదం ముదిరిపోయింది.

 అంతా నిజమే

అంతా నిజమే

శశికళ జైల్లో అనేక రాయితీలు పొంది లగ్జరీ జీవితం గడుపుతున్నారా అంటూ ఆర్ టీఐ కార్యకర్త నరసింహ మూర్తి సమాచారం చట్టం కింద ప్రభుత్వాన్ని వివరణ కోరారు. అందుకు అంతా నిజమే అంటూ ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ఈ నేపధ్యంలో బెంగళూరులో మీడియాతో మాట్లాడిన ఆర్ టీఐ కార్యకర్త నరసింహమూర్తి జైల్లో ఐదు మంది ఖైదీలను మరోచోటకు పంపించారని, వారు ఉంటున్న గుదులు ఏకం చేసి వీకే. శశికళ, ఇళవరసి విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నారని అన్నారు.

 షాపింగ్ లు, సీసీ కెమెరాల క్లిప్పింగ్ లు

షాపింగ్ లు, సీసీ కెమెరాల క్లిప్పింగ్ లు

శశికళ ఖైదీల దుస్తులు ధరించకుండా వ్యక్తిగత దుస్తులు ధరించారని, జైలు బయటకు వెళ్లి షాపింగ్ లకు వెళ్లి రావడం సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యిందని, ఆ వివరాలు వినయ్ కుమార్ విచారణలో బయటపడిందని నరసింహమూర్తి మీడియాకు చెప్పారు.

 శశికళ విడుదల కష్టమే !

శశికళ విడుదల కష్టమే !

జైళ్ల శాఖ నిబంధనలు అతిక్రమించి శశికళ సేవలో తరించి ధన్యం అయిన అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్ టీఐ కార్యకర్త నరసింహమూర్తి డిమాండ్ చేస్తున్నారు. లగ్జరీ లైఫ్ గడిపిన వీకే. శశికళ సత్పప్రవర్తన

కింద విడుదలకు తావులేకుండా అన్ని తలుపులు మూసుకుపోయాయి. వచ్చే ఏడాది ఆరంబంలో శశికళ విడుదల కావడం అనుమానమే అని వెలుగు చూడటంతో చిన్నమ్మ అభిమానులు నిరాశకు గురైనారు.

English summary
The report submitted by a retired IAS officer who alleged that former Chief Minister Jayalalithaa's aide Sasikala acted in violation of rules at Bangalore Central Prison is now leaking back. This is going to have an important impact on the politics of Tamil Nadu. Though Sasikala bribe to the jail officer saga information has already been leaked to the media in January, there are doubts as to why it has now been re-released.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X