బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భర్త నటరాజన్ అంత్యక్రియలకు శశికళ, 15 రోజులు పెరోల్, చెన్నై కాదు తంజావూరు, కోర్టు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/న్యూఢిల్లీ: అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన వీకే శశికళ తన భర్త చనిపోయాడని, అంత్యక్రియలకు హాజరుకావడానికి పెరోల్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళకు పెరోల్ మంజూరు చెయ్యాలని ఆమె న్యాయవాదులు కోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు.

Recommended Video

V.K. Sasikala's Husband M Natarajan Lost Life
టీటీవీ దినకరన్

టీటీవీ దినకరన్

గ్లోబల్ ఆసుపత్రి నుంచి నటరాజన్ మృతదేహాన్ని చెన్నైలోని బిసెంట్ నగర్ లోని ఆయన నివాసానికి తరలించారు. ఆర్ కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ నటరాజన్ కు నివాళులు అర్పించారు. ప్రజలు సందర్శనం కోసం బిసెంట్ నగర్ లో మంగళవారం సాయంత్రం వరకు నటరాజన్ మృతదేహాన్ని పెడుతున్నామని శశికళ బంధువులు చెప్పారు.

చెన్నై కాదు తంజావూరు

చెన్నై కాదు తంజావూరు

నటరాజన్ సొంత ప్రాంతం అయిన తమిళనాడులోని తంజావూరులో బుధవారం అంత్యక్రియలు నిర్వహిస్తామని శశికళ బంధువులు తెలిపారు. శశికళకు పెరోల్ వచ్చిన తరువాత అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని టీటీవీ దినకరన్ మీడియాకు చెప్పారు.

న్యాయవాది అశోకన్

న్యాయవాది అశోకన్

శశికళకు చట్టపరంగా 15 రోజులు పెరోల్ మంజూరు చేయించడానికి కోర్టును ఆశ్రయించామని శశికళ తరపు న్యాయవాదుల్లో ఒకరైన అశోకన్ మంగళవారం మీడియాకు చెప్పారు. భర్త అంత్యక్రియల్లో పాల్గొనడానికి శశికళకు తప్పకుండా పెరోల్ మంజూరు అవుతోందని అశోకన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

తంజావూరుకు శశికళ

తంజావూరుకు శశికళ

బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుంచి శశికళ నేరుగా తంజావూరు వెలుతారని ఆమె సన్నిహితులు అంటున్నారు. చెన్నై నుంచి నటరాజన్ మృతదేహాన్ని తంజావూరుకు తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కన్నెత్తిచూడని అన్నాడీఎంకే

కన్నెత్తిచూడని అన్నాడీఎంకే

నటరాజన్ మరణించడంతో టీటీవీ దినకరన్ మద్దతుదారులు మాత్రమే ఆయనకు నివాళులు అర్పించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో పాటు అన్నాడీఎంకే పార్టీ నేతలు ఒక్కరు కూడా నటరాజన్ కు నివాళులు అర్పించడానికి వెళ్లలేదు.

English summary
An emergency parole petition is being moved to bring out expelled AIADMK leader V K Sasikala from the Parapana Agrahara jail in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X