• search
 • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

షాకింగ్: క్షీణించిన శశికళ ఆరోగ్యం -విషమంగా వెంటిలేటర్‌పై చికిత్స -మణిపాల్‌కు తరలింపు

|

అన్నాడీఎంకే బహిష్కృత నేత, దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ కరోనా వైరస్ బారినపడి తీవ్ర అస్వస్థతకు గురికాగా.. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఇంకాస్త విషమంగా మారింది. బెంగళూరులోని పరప్పణ అగ్రహారం జైలులో ఉంటోన్న ఆమె.. 10 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో నగరంలోని బౌరింగ్ ఆస్పత్రికి, అక్కడి నుంచి విక్టోరియా ఆస్పత్రికి తరలించగా, గురువారం చిన్నమ్మకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. శుక్రవారం ఉదయం హెల్త్ బులిటెన్ విడుదలైనప్పుడు కూడా ఆమె పరిస్థితి ఆశాజనకంగానే ఉన్నట్లు తెలిసినా, మధ్యాహ్నంలోపే అంతా తారుమారైంది..

  VK Sasikala Health Update: Doctors said that the condition of V.K. Sasikala is Stable For Now

  ముగ్గురు ఎమ్మెల్యేల పద్ధతి మారాలి -ఉమ్మడి ఖమ్మం నేతలతో గులాబీ బాస్ కేటీఆర్ -జమిలికి సిద్ధంగా..ముగ్గురు ఎమ్మెల్యేల పద్ధతి మారాలి -ఉమ్మడి ఖమ్మం నేతలతో గులాబీ బాస్ కేటీఆర్ -జమిలికి సిద్ధంగా..

  వెంటిలేటర్‌పై చికిత్స

  వెంటిలేటర్‌పై చికిత్స

  ప్రస్తుతం విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శశికళ ఆరోగ్యం విషమించినట్టు వైద్యులు తెలిపారు. ఆమెకు మధుమేహం, రక్తపోటు సమస్యలు ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. శశికళకు ఐసీయూలోనే వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని,ఆమె ఆరోగ్యం మరింత క్షీణించిందని పేర్కొన్నారు. జ్వరం, వెన్నునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న శశికళకు గురువారం నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు తెలిపారు. జైలు శిక్ష పూర్తయి, మరో వారంలో విడుదల కావాల్సి ఉండగా, ఈలోపే శశికళకు ఇలా జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతోన్న వేళ..

  మణిపాల్ ఆస్పత్రికి తరలింపు..

  మణిపాల్ ఆస్పత్రికి తరలింపు..

  జైలు అధికారుల ఆధీనంలో ఉన్న శశికళను బెంగళూరులోని ప్రభుత్వ ఆస్పత్రులకు అటు ఇటూ తిప్పుతూ, సరైన వైద్యం అందించడంలేదని ఆమె కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. చిన్నమ్మను ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించాలని డిమాండ్ చేశారు. కుటుంబీకుల వాదనకుతోడు శశికళ ఆరోగ్యం గంటగంటకూ క్షీణిస్తుండటంతో ఆమెను బెంగళూరులోని టాప్ ఆస్పత్రిగా పేరుపొందిన మణిపాల్ ఆస్పత్రిలో చేర్పించేందుకు అధికారులు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇంకాసేపట్లో తరలింపు ఉండొచ్చని సమాచారం. మరోవైపు..

  ఏపీ సీఎంగా అంజాద్‌బాషా -డీజీపీ సవాంగ్ తొలగింపు -టీడీపీ సంచలన డిమాండ్లు -నిమ్మగడ్డకు మొరఏపీ సీఎంగా అంజాద్‌బాషా -డీజీపీ సవాంగ్ తొలగింపు -టీడీపీ సంచలన డిమాండ్లు -నిమ్మగడ్డకు మొర

  జయకు జరిగినట్లే శశికి..

  జయకు జరిగినట్లే శశికి..

  జయలలిత అక్రమాస్తుల కేసులో దోషిగా తేలి ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ జనవరి 27న విడుదల కావాల్సి ఉంది. ఇంకొద్ది రోజుల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, శశికళ పునరాగమనం రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయనుంది. జైలు నుంచి రాగానే చిన్నమ్మ తిరిగి అన్నాడీఎంకే పగ్గాలు చేపడతారని ఆమె వర్గీయులు ఘంటాపథంగా చెబుతున్నారు.

  ఒకవేళ అన్నాడీఎంకేలో చేరకున్నా, దినకరన్ నేతృత్వంలోని ఏఎంఎంకే పార్టీ ద్వారా అన్నాడీఎంకే ఓట్లను భారీగా చీల్చడం ఖాయమని జాతీయ సర్వేలు చెబుతున్నాయి. ప్రస్తుతం అన్నాడీఎంకే-బీజేపీల మధ్య పొత్తు కొనసాగుతోన్న దరిమిలా శశికళను బయటికి రానీయకుండా కుట్ర జరుగుతోందనే వాదనలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అంతేకాదు, నాడు జయలలిత ట్రీట్మెంట్ తరహాలోనే నేడు శశికళ పరిస్థితి ఉందనే కామెంట్లు వస్తున్నాయి.

  English summary
  Following hospitalisation in Bengaluru after testing positive for Coronavirus, doctors said that the condition of V.K. Sasikala, the close aide of Tamil Nadu former chief minister late J. Jayalalithaa, is deteriorating. According Sasikala’s family has requested.. she is likely be shifted to Manipal Hospital in bengaluru
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X