బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఐటీ దాడులు: మౌనవ్రతం చేస్తున్నా, విచారణ కుదరదు, ఐటీ శాఖకు షాక్ ఇచ్చిన శశికళ!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురై బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న చిన్నమ్మ శశికళ ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ) అధికారులకు పెద్ద షాక్ ఇచ్చారు. విచారణ చెయ్యాలని ఆదాయపన్ను శాఖ అధికారులు సమన్లు జారీ చేస్తే ఇప్పుడు తనకు వీలుకాదని, మౌనవ్రతం చేస్తున్నానని, విచారణ వాయిదా వేసుకోవాలని సమాధానం ఇచ్చారు.

అధికారులకు షాక్

అధికారులకు షాక్

2017 నవంబర్ లో చెన్నై నగరంతో సహ తమిళనాడు, బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో శశికళ కుటుంబ సభ్యులను లక్షంగా చేసుకుని 187 ప్రాంతాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. ఆదాయపన్ను శాఖ సోదాల్లో శశికళ కుటుంబ సభ్యుల అక్రమాస్తులు చూసిన అధికారులు షాక్ కు గురైనారు.

మన్నార్ గుడి ఫ్యామిలీ

మన్నార్ గుడి ఫ్యామిలీ

శశికళ కుటుంబ సభ్యులను లక్షంగా చేసుకుని ఆదాయపన్ను శాఖ అధికారులు మన్నార్ గుడి ఫ్యామిలీలో ఒక్కరినీ వదిలిపెట్టకుండా సోదాలు చేశారు. శశికళ కుటుంబ సభ్యులు ఆదాయపన్ను చెల్లించకుండా అక్రమంగా ఆస్తులు సంపాధించారని అధికారులు గుర్తించారు.

రూ. 4,500 కోట్ల ఆస్తులు

రూ. 4,500 కోట్ల ఆస్తులు


శశికళ కుటుంబ సభ్యులు దాదాపు రూ. 4,500 కోట్ల విలువైన అక్రమాస్తులు సంపాధించారని ఆదాయపన్ను శాఖ అధికారులు గుర్తించారు. జయలలిత అధికారంలో ఉన్న సమయంలో ఆమెను అడ్డంపెట్టుకుని శశికళ కుటుంబ సభ్యులు అక్రమాస్తులు సంపాధించారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పోయెస్ గార్డెన్

పోయెస్ గార్డెన్

జయలలితకు చెందిన పోయెస్ గార్డెన్ లోని వేదనిలయంలో శశికళకు చెందిన రెండు గదుల్లో సోదాలు చేసిన అధికారులు విలువైన పత్రాలు, పెన్ డ్రైవ్ లు, ల్యాప్ టాప్, హార్డ్ డిస్క్ లు, కంప్యూటర్ స్వాధీనం చేసుకున్నారు. శశికళకు చెందిన రెండు గదులు సీజ్ చేసిన ఆదాయపన్ను శాఖ అధికారులు వాటి తాళాలు తీసుకెళ్లారు.

మిడాస్ లిక్కర్ కంపెనీ

మిడాస్ లిక్కర్ కంపెనీ

శశికళ యాజమాన్యంలో ఉన్న మిడాస్ మద్యం కంపెనీ, జయా టీవీ, జాజ్ సినిమాస్ సీఇవో వివేక్ ఇల్లు, అతని సోదరి క్రిష్ణప్రియ, టీటీవీ దినకరన్, దివాకరన్, జయలలిత వ్యక్తిగత వైద్యుడు శ్రీనివాసన్ తదితరుల నివాసాలు, కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేసి విలువైన డాక్యూమెంట్లు సీజ్ చేశారు.

శశికళకు సమన్లు

శశికళకు సమన్లు


శశికళ కుటుంబ సభ్యులకు చెందిన రూ. 4, 500 కోట్ల అక్రమాస్తులకు సంబంధించి ఆదాయపన్ను శాఖ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. ఈ అక్రమాస్తులకు సంబంధించిన విషయంలో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళను విచారణ చెయ్యాలని జనవరి మొదటి వారంలో సమన్లు జారీ చేశారు.

ఫిబ్రవరి రెండో వారం

ఫిబ్రవరి రెండో వారం

తాను ఫిబ్రవరి రెండో వారం వరకూ మౌనవ్రతం చేస్తున్నానని, అంత వరకూ మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం వీలుకాదని బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళ ఆదాయపన్ను శాఖ అధికారులకు లేఖ రాశారు.

English summary
V.K. Sasikala, has claimed that she is on moun vrat till the second week of February, and sought time to give her oral statement to the Income Tax Department, which had conducted searches on her premises late last year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X