వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళనాడులో చిన్నమ్మ శశికళ ఫ్యామిలీ కొత్త పార్టీ, అన్నాడీఎంకే పార్టీ చెయ్యి జారితే అదే సీన్!

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులో మరో కొత్త రాజకీయ పార్టీ వస్తోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు గత సంవత్సరం వరకు నీడలా వెంటాడి ఉన్న చిన్నమ్మ శశికళ కుటుంబ సభ్యులు తమిళనాడులో కొత్త పార్టీ పెట్టడానికి సిద్దం అవుతున్నారని సమాచారం.

జయలలిత ఇంటి కోసం హైకోర్టుకు మేనకోడలు దీపా: ప్రభుత్వానికి నోటీసులు జారీ, వారసులు!జయలలిత ఇంటి కోసం హైకోర్టుకు మేనకోడలు దీపా: ప్రభుత్వానికి నోటీసులు జారీ, వారసులు!

అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నం కోసం ఎన్నికల కమిషన్ ముందు తమిళనాడు ప్రభుత్వంతో పోటీ పడుతున్న శశికళ త్వరలో తన కుటుంబ సభ్యులతో కలిసి కొత్త పార్టీ పెట్టించడానికి సిద్దం అయ్యారని వెలుగు చూసింది. మంగళవారం ఇదే విషయంపై శశికళ తన కుటుంబ సభ్యులతో చర్చించారని తమిళ మీడియా తెలిపింది.

VK Sasikala Natarajan family float new Political Party

అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నం పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గానికి వెళ్లిన వెంటనే శశికళ కుటుంబ సభ్యులు కొత్త పార్టీని తెరమీదకు తీసుకురావడానికి సిద్దం అయ్యారని సమాచారం. చివరి వరకు అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నం దక్కించుకోవడానికి ప్రయత్నించాలని శశికళ టీటీవీ దినకరన్ కు సూచించారని తెలిసింది.

తమిళనాడు సీఎం మీద తిరుబాటు; 18 మంది ఎమ్మెల్యేల కేసు విచారణ వాయిదా, టెన్షన్!తమిళనాడు సీఎం మీద తిరుబాటు; 18 మంది ఎమ్మెల్యేల కేసు విచారణ వాయిదా, టెన్షన్!

మంగళవారం చెన్నైలోని టీ నగర్ లోని ఇళవరసి కుమార్తె క్రిష్ణ ప్రియ ఇంటిలో శశికళతో ఆమె కుటుంబ సభ్యులు భేటీ అయ్యారు. టీటీవీ దినకరన్, శశికళ సోదరుడు దివాకరన్, అతని కుమారుడు జయ్ ఆనంద్ తోపాటు మన్నార్ గుడి సభ్యులు అనేక మంది భేటీ అయ్యి కొత్త పార్టీ పెట్టే విషయంలో సుదీర్ఘంగా చర్చించారని సమాచారం. రాజకీయంగా ఎదగాలంటే కొత్త పార్టీ పెట్టాలని శశికళ నిర్ణయించారని సమాచారం.

English summary
Sources said that Sasikala family will float a new political party after the Elecection Commission verdict on AIADMK and Two leave Symbol row.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X