బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిన్నమ్మ శశికళకు షాక్, 2021లో విడుదల, బాంబు పేల్చిన డీజీపీ, సత్ర్పవర్తనా, తొక్క!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న వీకే శశికళ అలియాస్ చిన్నమ్మ ఆశలు అడియాశలు అయ్యాయి. సత్ర్పవర్తన కింద వీకే. శశికళ ముందస్తుగా విడుదల అవుతారని ఇంత కాలం ఎదురు చూసిన మన్నార్ గుడి ఫ్యామిలీకి చుక్కెదురు అయ్యింది. సత్ర్పవర్తన కింద వీకే. శశికళ ముందస్తుగా విడుదల చెయ్యడం సాధ్యం కాదని, ఆమె శిక్షాకాలన్ని పూర్తిగా అనుభవించాలని కర్ణాటక జైళ్ల శాఖ డైరెక్టర్ (డీజీపీ) ఎస్ఎస్. మెక్రిన్ తేల్చి చెప్పారు. ఈ దెబ్బతో మన్నార్ గుడి ఫ్యామిలీతో పాటు అమ్మ మక్కల్ మున్నేట్ర కలగం పార్టీ శ్రేణులు దిగాలు పడిపోయారు.

రాసలీలల దెబ్బతో భర్తను రూ. 5 లక్షలకు అమ్మేసిన భార్య, కొనుక్కున్న ప్రియురాలు!రాసలీలల దెబ్బతో భర్తను రూ. 5 లక్షలకు అమ్మేసిన భార్య, కొనుక్కున్న ప్రియురాలు!

జయలలిత నెచ్చలి

జయలలిత నెచ్చలి

అన్నాడీఎంకే పార్టీ అధినేత్రి, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జే. జయలలిత నెచ్చెలి వీకే. శశికళ అలియాస్ చిన్నమ్మ ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో 2017 ఫిబ్రవరి నెలలో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు వెళ్లారు. శశికళకు నాలుగేళ్ల జైలు శిక్షపడింది. ఇదే కేసులో శశికళ సమీప బంధువులు ఇళవరసి, సుధాకరన్ కూడా బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.

రెండున్నరేళ్లు పూర్తి

రెండున్నరేళ్లు పూర్తి

వీకే శశికళ అలియాస్ చిన్నమ్మ, ఆమె సమీప బంధువులు ఇలవరసి, సుధాకరన్ సైతం ఇప్పటికి రెండున్నరేళ్లు జైల్లో శిక్ష అనుభవించారు. అయితే వీకే. శశికళ అలియాస్ చిన్నమ్మ సత్ర్పవర్తన కింద ముందుగానే జైలు నుంచి విడుదల అవుతారని జోరుగా ప్రచారం జరిగింది. శశికళ జైలు నుంచి ముందుగానే విడుదల అవుతారని ఆమెతో పాటు ఆమె అక్క కుమారుడు, చెన్నైలోని ఆర్ కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్తం ఎదురు చూశారు.

బాంబు పేల్చిన జైళ్ల శాఖ డీజీపీ

బాంబు పేల్చిన జైళ్ల శాఖ డీజీపీ

శశికళ జైలు నుంచి తర్వగా విడుదల అవుతరానే విషయంలో కర్ణాటక జైళ్ల శాఖ డైరెక్టర్ ఎస్ఎస్. మెక్రిన్ బాంబు పేల్చారు. శశికళను ముందస్తుగా జైలు నుంచి విడుదల చెయ్యడం సాధ్యం కాదని, ఆమె నాలుగేళ్లు పూర్తిగా జైలు శిక్ష అనుభవించాలని, సత్ర్పవర్తన కింద ఆమెను పరిగణించలేమని కర్ణాటక జైళ్ల శాఖ డ్రైరెక్టర్ ఎస్ఎస్. మెక్రిన్ తేల్చి చెప్పారు.

2021 ఫిబ్రవరి

2021 ఫిబ్రవరి

శశికళ పూర్తి కాలం శిక్ష అనుభవించి బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుంచి విడుదల కావాలంటే 2021 ఫిబ్రవరి వరకు వేచి చూడాలి. ముందుగా చిన్నమ్మ విడుదల అవుతరాని ఇంతకాలం వేచి చూసిన మన్నార్ గుడి ఫ్యామిలీ, అమ్మ మక్కల్ మున్నేట్ర కలగం శ్రేణులు నిరాశకు గురైనారు.

 పళని, పన్నీర్ వర్గీయులకు పండగ

పళని, పన్నీర్ వర్గీయులకు పండగ

శశికళ జైలు నుంచి ముందస్తుగా విడుదల కావడం లేదని వెలుగు చూడటంతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గీయులు పండగ చేసుకుంటున్నారు. 2021 ఫిబ్రవరి శశికళ విడుదల అవుతరాని, అంత వరకు తాము వేచి చూడాలని తెలుసుకున్న ఆమె వర్గీయులు ఆలోచనలో పడిపోయారు.

English summary
Bengaluru: karnataka dgp said good behavior release cannot be applicable to VK Sasikala . VK Sasikala should serve her entire jail sentence till 2021 february.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X