చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాకింగ్: శశికళకు ఏమైంది? -జైలు నుంచి ఆస్పత్రికి -పడిపోయిన ఆక్సిజన్ లెవల్స్ -27న విడుదలనగా

|
Google Oneindia TeluguNews

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి, అన్నాడీఎంకే మాజీ జనరల్ సెక్రటరీ వీకే శశికళ ఆరోగ్యం క్షీణించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమె బుధవారం అస్వస్థతకు గురికావడంతో హుటాహుటిన జైలు నుంచి ఆస్పత్రికి తరలించారు. శిక్ష పూర్తి చేసుకుని వచ్చే వారమే విడుదల కానుండగా అంతలోనే ఇలా జరగడం, జైలులో ఆరోగ్య కేంద్రం ఉన్నప్పటికీ, శశికళను పెద్దాసుపత్రికి తరలించడంతో ఆమె ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల్లో గందరగోళం నెలకొంది.

తమిళనాడు: శశికళ దెబ్బకు జయ పార్టీ బేజారు - అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ప్రభంజనం -సీఎంగా స్టాలిన్తమిళనాడు: శశికళ దెబ్బకు జయ పార్టీ బేజారు - అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ప్రభంజనం -సీఎంగా స్టాలిన్

 పడిపోయిన ఆక్సిజన్ లెవల్స్..

పడిపోయిన ఆక్సిజన్ లెవల్స్..


శశికళను బెంగళూరులోని పరప్పర అగ్రహారం జైలు నుంచి సిటీలోనే బెస్ట్ ప్రభుత్వ ఆస్పత్రిగా పేరుపొందిన బోరింగ్ ఆస్పత్రికి తరలించినట్లు జైలు అధికారులు చెప్పారు. గడిచిన 10 రోజులుగా ఆమె జ్వరం, నీరసంతో బాధపడుతున్నారని మాత్రమే అధికారులు తెలపగా.. జైలులో చికిత్స అందించినప్పటికీ ఆమె కోలుకోలేకపోయారని, శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ బాగా పడిపోవడంతో మరోదారి లేక ఆమెను బోరింగ్ ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. అంతేకాదు, కొవిడ్ నిబంధనల కారణంగా గడిచిన 10 నెలల్లో బంధువులెవరీనీ శశికళతో కలవనీయలేదని, ఆమె ఎలా ఉన్నారన్న సంగతి బయటివాళ్లెవరికీ తెలీదని వెల్లడైంది. కాగా..

 27న శశికళ విడుదల..

27న శశికళ విడుదల..

జయలలిత కూడా దోషిగా తేలి, మరణంతో శిక్ష తొలగిపిన ఆస్తుల కేసులో శశికళ, ఇళవరసి, సుధాకర్ లు 2017, ఫిబ్రవరి నుంచి బెంగళూరులోని పరప్పన జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. శిక్షా కాలం పూర్తికావడంతో ఈనెల 27న శశికళ విడుదలకు రంగం సిద్ధమైంది. బెంగళూరు నుంచి చెన్నై వరకు భారీ ర్యాలీ నిర్వహించాలని శశికళ మేనల్లుడు, ఏఎంఎంకే పార్టీ చీఫ్ టీవీవీ దినకరన్ ప్లాన్ చేసిన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతకు ఇదివరకే ఆదేశాలిచ్చారు. కానీ.. ఇంతలోనే శశికళ ఆరోగ్యం క్షీణించి ఆస్పత్రిలో చేరడం అభిమానుల్ని కలవరపెట్టింది. ఇదిలా ఉంటే..

Recommended Video

Sasikala Natarajan Likely To Be Released From Jail On 14th August 2020 || Oneindia Telugu
చిన్నమ్మ వచ్చాక సీన్ మారుద్ది..

చిన్నమ్మ వచ్చాక సీన్ మారుద్ది..

తమిళనాడులో ఇంకొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. శశికళ జైలు నుంచి విడుదలయ్యాక అన్నాడీఎంకే ఆమె చేతుల్లోకే వెళుతుందని, ఆ పార్టీని కాపాడేది చిన్నమ్మే అని ఏఎంఎంకే అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి వ్యాఖ్యానించారు. శశికళ తిరిగి అన్నాడీఎంకేను టేకోవర్ చేసే పరిస్థితి లేనప్పటికీ, ఏఎంఎంకే పార్టీ ద్వారా అభ్యర్థుల్ని నిలబెట్టి, అన్నాడీఎంకే ఓట్లను భారీగా చీల్చుతారని సర్వేల్లో వెల్లడైంది. ప్రస్తుతం అన్నాడీఎంకే-బీజేపీతో పొత్తుపెట్టుకున్న దరిమిలా శశికళ రాక ఎన్డీఏ కూటమిపై ప్రతికూల ప్రభావం చూపనుంది. అయితే, జైలు నుంచి విడుదల కాకముందే శశికళ అనూహ్యంగా అనారోగ్యానికి గురికావడం చర్చనీయాంశమైంది.

కన్నతండ్రి కామపిశాచిలా -పెద్ద కూతురిపై 7ఏళ్లుగా రేప్ -గర్భం తీయిస్తూ కిరాతకం -11ఏళ్ల చిన్న కూతురిపైనాకన్నతండ్రి కామపిశాచిలా -పెద్ద కూతురిపై 7ఏళ్లుగా రేప్ -గర్భం తీయిస్తూ కిరాతకం -11ఏళ్ల చిన్న కూతురిపైనా

English summary
Just days before her release, VK Sasikala, aide of former Chief Minister J Jayalalithaa, has fallen sick at the Parappana Agrahara prison. Jail authorities confirmed that she is being shifted to the Bowring hospital in Bengaluru. The former AIADMK General Secretary complained of fever and breathing difficulties on Wednesday. She is scheduled to be released from prison on January 27 after serving her four year sentence in the disproportionate assets case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X