వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శశికళ మద్యం వ్యాపారం టర్నోవర్ రూ. 1,800 కోట్లు, డొల్లా కంపెనీల పేరిట !

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ లిక్కర్ రీటైలింగ్ సంస్థ టాస్మాక్ కు దాదాపు రూ. 1,000 కోట్ల విలువైన మద్యాన్ని సరఫరా చేసే మిడాస్ డిస్టలరీస్ లో శశికళ ప్రధాన వాటాదారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: శశికళ మద్యం వ్యాపారాలపై పన్నీర్ సెల్వం వర్గం దృష్టిసారించింది. శశికళ మద్యం వ్యాపారాల పూర్తి వివరాలు సేకరించి గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావుకు ఇవ్వాలని పన్నీర్ వర్గీయులు నిర్ణయించారని సమాచారం. విషయం తెలుసుకున్న మన్నార్ గుడి మాఫియా సభ్యులు ఈ వివరాలు పన్నీర్ తో సహ ప్రతిపక్షలకు అందకుండా చూడాలని శతవిదాలుగా ప్రయత్నాలు చేస్తున్ననారని తెలిసింది.

తమిళనాడు సీఎంగా శశికళ ప్రమాణస్వీకారం చెయ్యక ముందే ఆమె ఆస్తుల చిట్టాను సేకరించి గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావుకు ఇవ్వాలని పన్నీర్ సెల్వం వర్గం, ప్రతిపక్ష పార్టీలు సిద్దం అయ్యాయి. దాదాపు 97 మంది వరకు ఎమ్మెల్యేలు శశికళ వెంట ఉన్నారని తెలిసినా ఇప్పుడు ఆమె సీఎం కావడానికి అనేక అడ్డంకులు ఎదురౌతున్నాయి.

ఎమ్మెల్యేలు గోడ దూకేస్తున్నారు: పన్నీర్, శశికళ ఎత్తులు పై ఎత్తులుఎమ్మెల్యేలు గోడ దూకేస్తున్నారు: పన్నీర్, శశికళ ఎత్తులు పై ఎత్తులు

శశికళ, ఆమె కుటుంబ సభ్యులు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో మద్యం వ్యాపారం చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో శశికళ సీఎం అయితే ఆ కంపెనీలకు లబ్ది కలిగించాలన్న స్వామి భక్తి ప్రభుత్వ అధికారుల్లో సహజంగానే ఉంటుంది కాబట్టి ఆమెకు ఆపదవి అందకుండా పోయే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

VK Sasikala the first CM to won a distillery in Tamil Nadu

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ లిక్కర్ రీటైలింగ్ సంస్థ టాస్మాక్ కు దాదాపు రూ. 1,200 కోట్ల విలువైన మద్యాన్ని సరఫరా చేసే మిడాస్ డిస్టలరీస్ లో శశికళ నటరాజన్ ప్రధాన వాటాదారు. మిగిలిన 50 శాతం శశికళ కుటుంబ సభ్యుల పేరుతో ఉంది. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి.

అమ్మ ఆత్మే మమ్మల్ని నడిపిస్తోంది: పన్నీర్ సెల్వం: త్వరలోనే ?అమ్మ ఆత్మే మమ్మల్ని నడిపిస్తోంది: పన్నీర్ సెల్వం: త్వరలోనే ?

2003లో స్థాపించిన మిడాస్ సంస్థకు 2009-11 సంవత్సరాల మధ్యకాలంలో రూ. 350 కోట్ల టర్నోవర్ మాత్రమే ఉంది. అయితే శశికళకు చెందిన మిడాస్ సంస్థకు 2014-15 నాటికి ఒక్కసారిగా రూ.1,800 కోట్ల వరకు టర్నోవర్ పెరిగిపోయింది. 2016లో జయలలిత సీఎం అయిన తరువాత, అంతకు ముందు ఈ మిడాస్ సంస్థకు అనూహ్యంగా టర్నోవర్ పెరిగిపోవడంతో పలువురు రాజకీయ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అమ్మచాటు చిన్నమ్మగా ఉన్న శశికళ నటరాజన్ గుట్టుచప్పుడు కాకుండా తన వ్యాపారాలు ఇలా చక్కబెట్టారు అంటే ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి అయితే పరిస్థితి ఇంకెలా ఉంటుందో అంటూ తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షం అయిన డీఎంకే, ఆపార్టీ మద్దతుదారులైన వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. ఈ వార్తలు తాజాగా మీడియాలోనూ వచ్చాయి.

శశికళ నటరాజన్ మీద చాలా సీరియస్ కేసులు ఉన్నాయని, ఆమె సన్నిహితు కుటుంబ సభ్యులు తమిళనాడు ప్రభుత్వంతో మద్యం వ్యాపారం చేస్తున్నారని, ఆమె సీఎం అయితే అది ప్రత్యక్షంగానే ప్రయోజన వైరుధ్యం అవుతుందని కేంద్ర మాజీ ఆర్థిక శాఖా మంత్రి చిదంబరం కుమారుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్తీ చిదంబరం ఇప్పటికే అనుమానాలు లేవనెత్తిన విషయం తెలిసిందే.

జయలలిత ఆత్మ శాంతించే వరకు శశికళ సీఎం కాలేరంట !జయలలిత ఆత్మ శాంతించే వరకు శశికళ సీఎం కాలేరంట !

20015లో శశికళ జాజ్ సినిమాస్ సంస్థలో మెజారిటీ వాటాను దక్కించుకున్నారు. ఆ సంస్థను లోగడ శశికళ కుటుంబ సభ్యులు నిర్వహించేవరు. జయలలిత అక్రమాస్తుల కేసు తీర్పు త్వరలో సుప్రీం కోర్టులో వెలువడుతున్న సమయంలో ఆకేసులో ఎ-2 ముద్దాయిగా ఉన్న శశికళను ఎలా సీఎం చేస్తారు ? అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

శశికళ కుటుంబ సభ్యుల వ్యాపారాల కంపెనీలకు సంబంధించిన బ్యాలెన్స్ షీట్లు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దగ్గర ఉన్నాయని, ఆ పత్రాలు మొత్తం పరిశీలించిన తరువాత శశికళ విషయం తేల్చేస్తామని ప్రతిపక్షాలు మీడియాకు చెప్పారు. ఇప్పుడు ఈ వార్తలు మొత్తం మీడియాలో రావడంతో చిన్నమ్మ వర్గీయులు ఆత్మరక్షణలో పడ్డారు. పన్నీర్ సెల్వం వర్గీయులు మాత్రం పండగ చేసుకుంటున్నారు.

English summary
As per records, VK Sasikala Natarajan has stakes in 13 registered companies and one of them is Midas distillery located in Padappai. Now this is good news to the liquor lobby. DMK supporter is owner of SNJ distillery in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X