వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి వీకే సింగ్ అనుచిత వ్యాఖ్యలు, సంబంధం లేదన్న ప్రభుత్వం, బీజేపీ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర విదేశీ వ్వవహారాల శాఖ సహాయమంత్రి వీకే సింగ్ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని లేపాయి. ట్విట్టర్‌లో presstitutes కు prosstitutes కు తేడా ఏంటీ ? O స్థానంలో E తప్ప అంటూ మీడియాని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు.

ఈ వ్యాఖ్యలపై పలు రాజకీయ పార్టీలు తీవ్రస్ధాయిలో ఆయనపై ధ్వజమెత్తాయి. మంత్రి స్ధానంలో ఉండి నిర్లక్ష్యపు ట్వీట్స్ చేసిన వీకే సింగ్‌పై ప్రధాని మోడీ చర్యలు తీసుకోగలరా అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది.

ఇక, ప్రభుత్వ నైతికతను ముంచేదిగా వీకే సింగ్ వ్యాఖ్యలు ఉన్నయని ఎన్‌సీపీ, ప్రజాస్వామ్యపు విలువను కనీసం అర్థచేసుకోలేని వ్యక్తి అని సమాజ్‌వాదీ పార్టీ, బాధ్యతారహితమైన వ్యాఖ్యలని జేడీయూ పార్టీలు పేర్కొన్నాయి.

వీకే సింగ్ చేసిన వ్యాఖ్యలను బ్రాడ్ కాస్ట్ ఎడిటర్స్ అసోసియేషన్, మీడియా ప్రతినిధులు ఖండించారు. సింగ్ వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం, బీజేపీ... మంత్రి వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని తెలిపాయి. ఆ మాటలు మంత్రి వ్యక్తిగతమని పేర్కొన్నాయి.

VK Singh in new row, calls media 'presstitutes'

యెమెన్‌లో చిక్కుకున్న భారతీయులను తరలించడానికి జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించడానికి వీకే సింగ్ జిబౌటీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఏర్పాట్లపై జిబౌటీలోని ఓ టీవీ ఛానెల్ మంగళవారం ఆయన్ని సంప్రదిస్తే, ప్రవాస భారతీయల తరలింపు ప్రక్రియ కంటే పాక్ ఎంబసీ సందర్శనే ఉత్తేజకరంగా ఉందంటూ వ్యాఖ్యానించారు.

పాకిస్ధానీ డే సెలబ్రేషన్స్‌కు హాజరవడంపై మీడియాలో పలు కథనాలు రావడంతో మీడియాను ఉద్దేశించి వీకే సింగ్ పైవ్యాఖ్యలు చేశారు. ఇక యెమెన్‌లోని ప్రవాస భారతీయుల తరలింపుకు చేపట్టిన 'ఆపరేషన్ రాహత్' బుధవారంతో ముగిసింది.

English summary
Union minister General V K Singh ran into a fresh row on Tuesday as he was criticized by several political parties for describing the media as 'presstitutes'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X