వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జర్నలిస్టులకు రష్యా అధ్యక్షుడు పుతిన్ వార్నింగ్

|
Google Oneindia TeluguNews

బెనాలిమ్ (గోవా): అమెరికన్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు మనల్నే చూస్తున్నాయని, జాగ్రత్తగా ఉండాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ అన్నారు. గోవాలో రెండు రోజుల బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు వచ్చిన ఆయన అనంతరం క్రెమ్లిన్ జర్నలిస్టులతో మాట్లాడారు.

రష్యన్ ప్రెస్ కాన్పరెన్స్ లో క్రెమ్లిన్ జర్నలిస్టులతో మాట్లాడుతూ తన భారత పర్యటనపై అమెరికా ఎక్కువగా దృష్టి పెట్టిందని అన్నారు. అమెరికా ప్రతి విషయం సునితంగా పరిశీలిస్తుందని, జర్నలిస్టులు చేసే కామెంట్లను గమనిస్తుందని చెప్పారు.

Vladimir Putin warns Kremlin journalists: US is watching you

స్పెషల్ సర్వీసుల కోసం తమ అబ్జెట్స్ ను అమెరికా ఇంటిలిజెన్స్ దోపిడీ చేస్తుందని వ్లాదిమిర్ పుతిన్ ఆరోపించారు. సిరియా సంక్షోభం నేపథ్యంలో అమెరికా, రష్యా సంబంధాలు తెగిపోతున్న సంగతి మీకు తెలిసిందే అని పుతిన్ అన్నారు.

మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ జర్నలిస్టులను హెచ్చరించారు. త్వరలో మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందని అనుమానం తలెత్తుతూ ఇటీవల దేశాధ్యక్షులు సంచలన ప్రకటనలు చేస్తున్నారు.

ఇదే సమయంలో అమెరికా కార్యకలాపాలను రష్యా, రష్యా కదలికలను అమెరికా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. బ్రిక్స్ సమావేశాల మీద అమెరికా ఇంటిలిజెన్స్ అధికారులు ఓ కన్ను వేశారని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ అనుమానాలు వ్యక్తం చేస్తూ జర్నలిస్టులను హెచ్చరించారు.

English summary
Russian President Vladimir Putin made the comments Sunday in Benaulim, India, where he was attending the summit of the BRICS group of emerging economies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X