గుజరాత్లో ప్లాస్టిక్ తయారీ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
గుజరాత్‌లోని వల్సాడ్‌లోని ప్లాస్టిక్ తయారీ పరిశ్రమలో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ తయారీ పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక కార్యకలాపాలు జరుగుతున్నాయి.
అధికారులు చెప్పిన వివరాల ప్రకారం మధ్యాహ్నం ముందు ప్లాస్టిక్ ఫ్యాక్టరీ వద్ద మంటలు చెలరేగాయి. ఈ సంఘటన జరిగిన వెంటనే, అగ్నిమాపక యంత్రాలు మరియు అంబులెన్స్‌లను అక్కడికి తరలించారు.
ఘోర రోడ్డు ప్రమాదం .. రక్తమోడిన ఓఆర్ఆర్ .. ఆరుగురు మృతి
భారీగా మంటలు ఎగిసిపడడంతో ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించాయి. ప్లాస్టిక్ కావడంతో పొగతో స్థానికులకు ఊపిరి ఆడని పరిస్థితి ఏర్పడింది. భారీగా ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఫ్యాక్టరీలో మంటలు చెలరేగి నప్పుడు అందులో ఎవరూ లేరని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు ధ్రువీకరించారు. గుజరాత్‌లోని వల్సాద్‌లోని కర్మాగారంలో అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

దాదాపు ఎనిమిది ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయి . దీపావళి పండుగ సెలవు దినం కావడంతో, సంఘటన జరిగినప్పుడు కర్మాగారం మూసివేయబడి ఉంది. ఎలాంటి ప్రాణనష్టం జరగకున్నా, ప్లాస్టిక్ కాలటం వల్ల దట్టమైన పొగ ఆ ప్రాంతంలో వ్యాపించటంతో స్థానికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.