వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐడియా, వోడాఫోన్ ల విలీనం?లాభాల కోసమేనా?

దేశీయ టెలికాం కంపెనీలు ఐడియా, వోడాఫోన్ లు ఒకటికానున్నాయి . జియో నుండి ఎదురుకానున్న సవాల్ ను ఎదుర్కొనేందుకుగాను ఈ రెండు కంపెనీలు ఒక్కటి కానున్నాయి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశీయ టెలికాం కంపెనీలు ఐడియా, వోడాఫోన్ లు ఒకటికానున్నాయి . జియో నుండి ఎదురుకానున్న సవాల్ ను ఎదుర్కొనేందుకుగాను ఈ రెండు కంపెనీలు ఒక్కటి కానున్నాయి.

రిలయన్స్ కంపెనీ మార్కెట్ లోకి తెచ్చిన జియో ఇతర టెలికాం కంపెనీలకు పెద్ద సవాల్ ను విసిరాయి.జియో తట్టుకొనేందుకు ఇతర టెలికాం కంపెనీలు కూడ వినియోగదారులకు కొత్త ఆఫర్లను ప్రకటించాయి.

అయితే జియో ను తట్టుకొనేందుకుగాను టెలికాం కంపెనీలు ఒక్కటి కావాలన నిర్ణయానికి వచ్చాయి. వొడాఫోన్ ను ఆదిత్య బిర్లా గ్రూప్ లో విలీనం చేసే దిశగా చర్చలు సాగుతున్నాయి.

ఈ రెండు టెలికాం కంపెనీలు ఒక్కటి అయ్యే అవకాశం ఉంది. బ్రిటిష్ దిగ్గజం క్లారిటీ ఇచ్చింది. గత కొన్నిరోజులుగా ఈ రెండు కంపెనీలు చేతులు కలిపే అవకాశం ఉంది.

 ఐడియా, వోడాఫోన్ లు విలీనం

ఐడియా, వోడాఫోన్ లు విలీనం

ఐడియా, వోడాఫోన్ లు విలీనమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ మేరకు ఈ రెండు కంపెనీల మద్య చర్చలు సాగుతున్నాయి.ఆదిత్య బిర్లా గ్రూప్ లో విలీనమయ్యేందుకుగాను వోడాఫోన్ విలీనమయ్యేందుకు చర్చలు జరుపుతోంది. ఈ వార్తలను ధృవీకరిస్తూ వోడాఫోన్ ఓ ప్రకటన విడుదల చేసింది.

ఎయిర్ టెల్ కు జియో నుండి సవాళ్ళు

ఎయిర్ టెల్ కు జియో నుండి సవాళ్ళు

దేశీయ మార్కెట్ లో అగ్రగామిగా ఉన్న ఎయిర్ టెల్ జియ్ నుండి తీవ్ర సవాళ్ళను ఎదుర్కొంటుంది.జియో సెల్ పోన్ వినియోగదారులకు ఉచితంగా ఇంటర్నెట్ ను కాల్స్ ను ఇచ్చింది. దీంతో ఇతర టెలికాం కంపెనీలు కూడ తమ టారిఫ్ లను మార్చుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి.

 టెలికాం కంపెనీల మధ్య త్రిముఖ పోటీ

టెలికాం కంపెనీల మధ్య త్రిముఖ పోటీ


దేశీయ మార్కెట్ లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న ఎయిర్ టెల్ మార్కెట్లోకి వచ్చిన జియోతో పోటీపడుతోంది. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఎయిర్ టెల్ లాభాలకు జియో ఏ మేరకు గండికొడుతోందో అర్థమైంది. ఐడియాలో వోడాఫోన్ విలీనమైతే నెంబర్ వన్ స్థానం కోసం మూడు టెలికం కంపెనీల మధ్య పోటీ నెలకొంటుంది.

 లాభాలను ఇలా పంచుకొంటాయి

లాభాలను ఇలా పంచుకొంటాయి


బ్రిటిష్ కు చెందిన వోడాఫోన్ ఆదిత్య బిర్లా గ్రూప్ లో విలీనం కానుంది. అయితే ఈ రెండు కంపెనీలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. లాభాలను సమానంగా పంచుకొనేలా డీల్ కుదుర్చుకోవాలని ఈ రెండు కంపెనీలు భావిస్తున్నాయి.వొడాఫోన్ కు ఐడియా కొత్తగా షేర్లు జారీచేస్తే ఈ విలీనం జరుగుతోంది.అయితే ఈ విలీనం ఎప్పుడనేది ఇంకా స్పష్టత రాలేదు.

English summary
london based vodafone group has confirmed that it is in discussions with adithya birla group for an all share merger of vodafone india with idea celluar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X