వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గంట మాట్లాడితే 7 రూపాయలే! రూ.5కే అన్ లిమిటెడ్ డేటా!!

ప్రముఖ టెలికాం మొబైల్ ఆపరేటర్ వొడాఫోన్ కొన్ని ఆసక్తికరమైన పథకాలను శనివారం వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ముంబై: ప్రముఖ టెలికాం మొబైల్ ఆపరేటర్ వొడాఫోన్ కొన్ని ఆసక్తికరమైన పథకాలను శనివారం వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ మొదలుపెట్టిన ఉచిత ఆఫర్ల ధాటిని తట్టుకునేందుకు వొడాఫోన్ కూడా తన ప్లాన్ లలో కొన్ని మార్పులు చేసుకుంటూ వస్తోంది.

ఇప్పటికే వొడాఫోన్ రెడ్ లో మార్పులు చేసిన ఈ కంపెనీ శుక్రవారం మరికొన్ని కొత్త ఆఫర్లను ప్రవేశపెట్టింది. ప్రీ పెయిడ్ వినియోగదారులకు 'సూపర్ అవర్' పథకాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.16కే ఒక గంట పాటు ౩జీ లేదా 4జీ డేటా అందించే ప్లాన్ ను ప్రకటించింది.

మరో పథకంలో రూ.7కే అన్ లిమిటెడ్ లోకల్ కాల్స్ ( వొడాఫోన్ టు వొడాఫోన్ ) ఒక గంటసేపు చెల్లుబాటు అయ్యేలా రూపొందించింది. ఈ పథకం కింద 2జీ వినియోగదారులకు రూ.5కే అన్ లిమిటెడ్ డేటా కూడా అందుబాటులో ఉండనుంది.

 Vodafone's Rs 16 recharge gives users unlimited hourly data, like truly unlimited

ఒక రోజులో ఎన్నిసార్లు అయినా ( రోజుకి 24 సార్లు ) ఈ ప్రీ పెయిడ్ ప్లాన్స్ కొనుక్కొని అపరిమిత డేటా పొందవచ్చు. ఈ కొత్త పథకాలన్నీ వొడాఫోన్ జనవరి 7న అంటే ఈరోజు లాంచ్ చేయనుంది.

ఈ కొత్త పథకాలు జమ్మూ-కశ్మీర్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్-జార్ఖండ్, మధ్యప్రదేశ్-ఛత్తీస్గఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ లలో అందుబాటులో లేదని, జనవరి 9 నుంచి అన్ని సెక్టార్లలో అందుబాటులోకి వస్తాయని వొడాఫోన్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సందీప్ కటారియా తెలిపారు.

అయితే సర్కిళ్ళను బట్టి ధరల్లో తేడా ఉండవచ్చని, నామమాత్రపు ధరకు ఒక గంటలో ఇష్టమైనంత ఎక్కువ డేటాను డౌన్లోడ్ చేసుకోవచ్చని, 2017 మార్చి 31 వరకు ఉచితంగా అందుబాటులో ఉన్న వొడాఫోన్ ప్లే సబ్ స్క్రిప్షన్ లో, అపరిమిత డేటా ఆఫర్ తో వీడియోలు, సినిమాలు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయన వివరించారు.

English summary
The new plan offers unlimited 3G or 4G data to prepaid Vodafone consumers at a recharge of Rs 16. Vodafone says in this plan, the unlimited really stands for unlimited.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X