వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వొడాఫోన్ కస్టమర్లకు బ్యాడ్ న్యూస్: ఏ క్షణమైనా సేవలు బంద్..కారణం ఇదే!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: టెలికాం రంగంలో ఒకప్పుడు కింగ్‌లా వెలిగిన వొడాఫోన్ నెట్‌వర్క్ త్వరలో భారత్‌లో టెలికాం సేవలు నిలిపివేయనుందా అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. భారత్‌లోని ప్రముఖ టెలికాం ఆపరేటర్లకు ప్రధాన పోటీదారుగా ఉన్న వొడాఫోన్ నెట్‌వర్క్ కష్టాల ఊబిలో నెట్టుకొస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే భారత్‌లో సేవలను నిలిపివేయాలనే యోచనలో ఆ సంస్థ ఉన్నట్లు తెలుస్తోంది.

కనెక్షన్ కట్ : ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కనెక్షన్లు వాడుతున్నట్లయితే జర భద్రంకనెక్షన్ కట్ : ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కనెక్షన్లు వాడుతున్నట్లయితే జర భద్రం

భారత్‌లో వొడాఫోన్ సేవలు బంద్...?

భారత్‌లో వొడాఫోన్ సేవలు బంద్...?

రిలయన్స్ సంస్థ జియో నెట్‌వర్క్‌ను ప్రవేశపెట్టి టెలికాం రంగాన్ని శాసించింది. జియో దెబ్బకు అప్పటి వరకు కాస్తో కూస్తో మోసుకొస్తున్న చిన్న టెలికాం సంస్థలు ఏకంగా బిచానా ఎత్తేయగా కొన్ని పెద్ద సంస్థలు మాత్రం ఎలాగో అలాగా తట్టుకుంటూ బండిని నెట్టుకొస్తున్నాయి. తాజాగా ప్రధాన టెలికాం సంస్థ వొడాఫోన్ భారత్‌లో సేవలను నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు టెలికాం రంగాన్ని ఏలిన ఈ సంస్థ ఇప్పుడు నష్టాల బాట పట్టిందని సమాచారం. భారత్ నుంచి ఏ క్షణమైనా వొడాఫోన్ ప్యాకప్ అయ్యేందుకు సిద్ధంగా ఉందట. ఇందుకు కారణం ఆపరేషన్ నిర్వహణ చేయలేకపోవడం, మార్కెట్లో సత్తాచాటలేకపోవడం వల్లే అని తెలుస్తోంది. అంతేకాదు ప్రతి నెల కొన్ని లక్షల మంది వొడాఫోన్ కస్టమర్లు ఈ టెలికాం నెట్‌వర్క్‌కు గుడ్‌బై చెప్పేస్తున్నారు.

నష్టాలే కారణం..?

నష్టాలే కారణం..?


ఇక ఈ ఏడాది చివరి ఆర్థిక త్రైమాసికంలో భారీ నష్టాలను బ్యాలెన్స్ షీట్‌లో చూపించింది వొడాఫోన్. ఐడియా సెల్యులార్‌తో విలీనం జరిగిన తర్వాత వొడాఫోన్ నెట్‌వర్క్ మరింత నష్టాల్లోకి కూరుకుపోయింది. జూన్ 2019 తొలి త్రైమాసికంలో రూ.4,067.01 కోట్లు నష్టాలు రాగా 2018 తొలి త్రైమాసికంలో నష్టాలు రూ.2,757.60 కోట్లుగా ఉన్నింది. అంటే ఈసారి నష్టాలు దాదాపు రెట్టింపు అయ్యాయి. ప్రస్తుతం వొడాఫోన్ తన రుణాలను చెల్లించే ప్రక్రియలో ఉన్నట్లు సంస్థ తెలిపింది. అంతేకాదు కొత్తగా రుణాలు కూడా తీసుకోవడం లేదని సమాచారం.

సుప్రీం తీర్పు మరింత భారం

సుప్రీం తీర్పు మరింత భారం

ఇక మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు అసలే నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న వొడాఫోన్ సంస్థకు ఏజీఆర్ కేసులో రూ.28,309 కోట్లు చెల్లించాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని వొడాఫోన్ సంస్థ వెల్లడించింది. సుప్రీం కోర్టు రివ్యూ పిటిషన్‌ను కొట్టివేస్తే మాత్రం ఇక వొడాఫోన్ తేరుకోవడం కష్టమేనని నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ భారీ మొత్తాన్ని చెల్లించేందుకు సంస్థ మరొక ఈక్విటీపై ఆధారాపడక తప్పదు.

English summary
Telecom industry which is already reeling under the heavy financial pressure may soon suffer another major blow as there are talks of Vodafone's possible exit from India due to the company's mounting losses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X