వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జియో ఆఫర్ సిమ్‌‌కార్డ్‌ను పొందడం ఎలా: ఇదే బెస్ట్?

By Pratap
|
Google Oneindia TeluguNews

ముంబై: జియో వినియోగదారులకు ఉచిత వాయిస్‌ కాలింగ్‌, రూ.50కే 1జీబీ డేటాతో ఆఫర్లు ప్రకటించడం ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముకేష్ అంబానీ సంచలనం సృష్టించారు. అయితే, ఆ సౌకర్యాలను పొందడం ఎలా, వాటిలో ఏది ఉత్తమమైందనే ఆసక్తి వినియోగదారుల్లో చోటు చేసుకోవడం సహజం.

అతి తక్కువ ధరకే డేటా ఆఫర్స్‌ను ప్రకటించడం ద్వారా టెలికామ్ రంగంలో రిలయన్స్ జియో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇటీవలి దాకా కొన్ని పరిమిత స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకే లభించిన ఈ సేవలు సెప్టెంబర్ 5 నుంచి అందరికీ అందుబాటులోకి వస్తాయి. 4జీ సపోర్ట్ చేసే ఫోన్ ఉంటే చాలు ఆ సౌకర్యాన్ని పొందవచ్చు. సమీపంలోని రిలయన్స్ స్టోర్‌కెళ్లి సంప్రదించినా వివరాలు చెబుతారు.

Voice is free, data is cheap: The Jio Revolution in 10 Points

రిలయన్స్ స్టోర్‌కు వెళ్లే ముందు ఐడీ ప్రూఫ్ కాపీ, ఫోటో తీసుకెళ్లి ఇస్తే జియో సిమ్‌కు సంబంధించిన అప్లికేషన్‌లో మీ వివరాలు నమోదు చేసుకుంటారు. ఒకటి నుంచి రెండు రోజుల్లో సిమ్‌కార్డ్‌ను పొందవచ్చు. అప్పటికీ సిమ్‌కార్డ్ అందించపోతే ఫిర్యాదు చేయవచ్చు. సెప్టెంబర్ 5 నుంచి మాత్రమే ఈ కొత్తగా ప్రవేశపెట్టిన సిమ్‌కార్డ్స్ అందుబాటులోకి వస్తాయి. రిలయన్స్ స్టోర్స్‌లో మాత్రమే సిమ్‌కార్డ్స్‌ను విక్రయిస్తారని సంస్థ తెలిపింది.

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ముంబైలో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ జియో దేశవ్యాప్త సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. రిలయన్స్ జియో వెల్‌కమ్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ ప్రకారం సెప్టెంబర్ 5 నుంచి డిసెంబర్ 31 వరకూ రిలయన్స్ జియో పొందిన కస్టమర్లు ఫ్రీ డేటా, ఫ్రీ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. అయితే ఆ తరువాత కూడా కేవలం డేటాకు మాత్రమే డబ్బు చెల్లిస్తే సరిపోతుంది. కాలింగ్ సదుపాయం పూర్తిగా ఉచితం.

మరో విషయం ఏమిటంటే, 75 జిబి కంటే ఎవరైతే ఎక్కువ డేటా ఉపయోగించుకుంటారో వారికి 1జిబి డేటాను 25 రూపాయలకే అందిస్తామని ముఖేష్ అంబానీ ప్రకటించారు. రాత్రి పూట ఇంటర్నెట్ ఉపయోగించేవారికి అపరిమిత డేటాను ఉచితంగా అందించనున్నట్లు ఆయన చెప్పారు. జియో రిలయన్స్ ఆఫర్లలో ఇదే బెస్ట్ అనే భావన వ్యక్తమవుతోంది.

డేటా ప్యాక్స్‌పై భారీ ఆఫర్లు ప్రకటించి, ఇతర టెలికామ్ కంపెనీలకు షాకిచ్చిన రిలయన్స్ జియో తన సేవలను మరింత విస్తృతం చేసుకునేందుకు సన్నాహాలు చేసుకుంది.. ఇందులో భాగంగానే గురువారం ఉదయం దేశవ్యాప్తంగా రిలయన్స్ జియో సేవలను ఆ కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ ప్రారంభించారు. ప్రధాని మోదీ కలలు కన్న డిజిటల్ ఇండియాను రిలయన్స్ జియో నెరవేరుస్తుందని ఆయన ఈ సందర్భంగ చెప్పారు. జీవితం డిజిటల్ మయమవుతోందని, రానున్న 20 సంవత్సరాల్లో డిజిటల్ ఇండియా అని పిలుచుకోనున్నామని అన్నారు.

డిజిటల్ ర్యాంకింగ్‌లో భారత్ స్థానాన్ని జియో మెరుగుపరుస్తుందని ఆయన ఆయన అన్నారు. ఈ డిజిటల్ ప్రపంచంలో డేటా అనేది ఆక్సిజన్ లాంటిదని ఆయన తెలిపారు. రిలయన్స్ జియోని కేవలం వ్యాపార దృక్పథంతోనే ప్రారంభించలేదని, ప్రతీ భారతీయడికి టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రారంభించామని ముఖేష్ అంబానీ చెప్పారు

రిలయన్స్ జియో మూడు సూత్రాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్లు తెలిపారు. జియో నెట్‌వర్క్ కస్టమర్లు కేవలం ఒక్క సర్వీస్‌కు మాత్రమే డబ్బులు చెల్లిస్తే సరిపోతుందని ఆయన చెప్పారు. వాయిస్ లేదా డేటా ఏదైనా ఒక సర్వీస్‌కు చెల్లిస్తే మిగిలింది ఉచితంగా లభిస్తుందని ఆయన చెప్పారు.

ఇండియా మొత్తం ఫ్రీ రోమింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. డేటాపై ఒక ఎంబీకి 5 పైసలు వసూలు చేయనున్నట్లు తెలిపారు. అంటే 50 రూపాయలకే 1జిబి 4జీ డేటాను పొందడానికి వీలుంటుంది. పూర్తిగా నెల రోజుల వ్యాలిడిటీతో. ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు అందిస్తున్న డేటా సర్వీస్ తమదేనని ముఖేష్ అంబానీ చెప్పారు.

బ్లాక్ అవుట్ డేట్స్ లాంటివి కూడా రిలయన్స్ జియోలో ఉండవని తెలిపారు. ఆధార్ కార్డ్ ఇచ్చిన 10 నిమిషాల్లోనే కనెక్షన్ అందిస్తామని ఆయన తెలిపారు. ఇండియాలోనే అత్యుత్తమ నెట్‌వర్క్‌గా రిలయన్స్ జియో అవతరించబోతుందని అంబానీ చెప్పారు. రిలయన్స్ జియో కొన్ని స్మార్ట్‌ఫోన్లతో సంయుక్తంగా ఫ్రీ డేటా, ఫ్రీ కాల్స్ మూడు నెలల వ్యాలిడిటీతో అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి నుంచి రిలయన్స్ జియో పొందిన కస్టమర్లు 3నెలల వరకూ అపరిమిత డేటా, అపరిమిత కాల్స్‌ను పొందుతారు.

జియో డేటా టారిఫ్‌లు ఇవే.....

- 1 ఎంబి డేటా 5 పైసలు
- 1జిబి డదేటా 50 రూపాయలు
- 28 రోజులకు 300 ఎంబి 4జీ డేటా టారిఫ్ రూ.149
- రూ.49కి 4జిబీ 4జీ డేటాతో పాటు నైట్ అన్‌లిమిటెడ్ డేటా యూసేజ్
- వైఫై హాట్ స్పాట్లతో రిలయన్స్ జియోపై 8 జిబీ డేటా
- రూ.. 999లకు 10 జిబీ 4 జీ డేటా, 20 జీబీ వైఫై యూసేజ్, నైట్ అన్‌లిమిటెడ్ యూసేజ్
- రూ. 1,499లకు 20 జీబీ 4 జీ డేటా
- రూ. 2,499కి 35జీబీ 4 జీ డేటా
- రూ.3,999కి 75 జీబీ 4జీ యూసేజ్, నైట్ అన్‌లిమిటెడ్, 150 జీబీ వైఫై డేటా

English summary
Reliance Industries Chairman Mukesh Ambani addressed the shareholders at the 42st AGM in Mumbai today. At the AGM, the Mukesh Ambani announced launch of Reliance Jio and other details.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X