బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డీకే అరెస్టు, ఒక్కలిగ కులం టచ్, ముల్లును ముల్లుతో తీయాలి, బీజేపీ హైకమాండ్ ప్లాన్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ ను అరెస్టు చెయ్యడంతో ఇది ఒక్కలిగ కులం మీద కుట్ర అనే నినాదం తెరమీదకు వచ్చింది. కక్షరాజకీయాలు, ప్రభుత్వ సంస్థల అధికారాలను దుర్వినియోగం చేస్తున్న బీజేపీ డీకే. శివకుమార్ ను అరెస్టు చేసిందని కాంగ్రెస్, జేడీఎస్ ప్రచారం చెయ్యడంలో సక్సస్ అయ్యాయని చెప్పవచ్చు. అయితే ఒక్కలిగులు తమ మీద చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టాలని, ముల్లును ముల్లుతోనే తీయాలి అని కర్ణాటక బీజేపీ నాయకులకు ఆ పార్టీ హైకమాండ్ సూచించింది.

ఐశ్వర్యకు రూ. 100 కోట్ల ఆస్తి ఎలా వచ్చింది ?, ఈడీకి అనుమానం, అరెస్టు చేస్తారా, అయితే ?!ఐశ్వర్యకు రూ. 100 కోట్ల ఆస్తి ఎలా వచ్చింది ?, ఈడీకి అనుమానం, అరెస్టు చేస్తారా, అయితే ?!

 బీజేపీ ఎదురుదాడి

బీజేపీ ఎదురుదాడి

కర్ణాటకలో ఒక్కలిగుల ప్రభావం ఎక్కువగా ఉంది. ఒక్కలిగులను ఎదిరించడం మంచిది కాదని బీజేపీ భావిస్తోంది. ఒక్కలిగులు తమ మీద చేస్తున్న ఆరోపణలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని బీజేపీ భావించింది. తమ పార్టీలోని అదే ఒక్కలిగ కులం నాయకులతో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల మీద ఆరోపణలు చేయించాలని బీజేపీ హైకమాండ్ ఆ పార్టీ నాయకులకు సూచించింది.

మాజీ ప్రధాని ఫ్యామిలీ

మాజీ ప్రధాని ఫ్యామిలీ

ఒక్కలిగ కులం నాయకులు అంటే మొదట చెప్పుకునే పేర్లు మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ, మాజీ సీఎం హెచ్.డీ. కుమారస్వామి కుటుంబ సభ్యులు. తరువాత మాజీ మంత్రి డీకే. శివకుమార్. ఆ తరువాత బీజేపీ మంత్రి ఆర్. అశోక్. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డాక్టర్ అశ్వథ్ నారాయణ తదితరులు అదే ఒక్కలిగ కులంకు చెందిన వారే. అయితే ఉప ముఖ్యమంత్రి అశ్వథ్ నారాయణ ఒక్కలిగ కులంకు చెందిన వారు అనే విషయం చాల మందికి తెలీదు.

ఒక్కలిగులతో పెట్టుకుంటే !

ఒక్కలిగులతో పెట్టుకుంటే !

మాజీ మంత్రి డీకే. శివకుమార్ ను అరెస్టు చెయ్యడాన్ని నిరసిస్తూ బుధవారం బెంగళూరులో ఒక్కలిగులు పెద్ద ఎత్తున ర్యాలీ. ధర్నా నిర్వహించారు. వేల సంఖ్యలో రోడ్ల మీదకు వచ్చిన ఒక్కలిగులు బీజేపీ మీద విమర్శలు చేశారు. గత మంగళవారం ఒక్కలిగులు నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాజీ సీఎం హెచ్.డీ. కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రి డాక్టర్ అశ్వథ్ నారాయణ పాల్గొన్నారు. అదే వేదిక మీద మాజీ సీఎం కుమారస్వామి మాట్లాడుతూ ఒక్కలిగులతో పెట్టుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని బీజేపీని హెచ్చరించి అదే వేదిక మీద ఉన్న ఉప ముఖ్యమంత్రి డాక్టర్ అశ్వథ్ నారాయణకు షాక్ ఇచ్చారు.

ఉప ఎన్నికలు

ఉప ఎన్నికలు

17 మంది కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చెయ్యడంతో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వానికి ఈ ఉప ఎన్నికలు సవాలుగా మారింది. ఒక్కలిగులను ఎదిరించి ముందుకు వెళ్లడం మనకు మంచిది కాదని బీజేపీలోని కొందరు నాయకులు అంటున్నారు. తమ పార్టీలోని ఒక్కలిగ నాయకులను ముందు పెట్టుకుని కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు సరైన సమాధానం చెప్పాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది.

అశోక్, అశ్వథ్ నారాయణ, సీటీ రవి

అశోక్, అశ్వథ్ నారాయణ, సీటీ రవి

ఉప ముఖ్యమంత్రి డాక్టర్ అశ్వథ్ నారాయణ, మంత్రులు ఆర్. అశోక్, సీటీ. రవి, ఎంపీలు శోభా కరందాజ్లే, ప్రతాప్ సింహా, బచ్చేగౌడ ఒక్కలిగ కులంకు చెందిన వారే. తమ మీద ఆరోపణలు చేస్తున్న ఒక్కలిగులను హ్యాండిల్ చెయ్యడానికి ఇదే ఒక్కలిగ నాయకులను ముందుకు పెట్టుకుని కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల మీద ఆరోపణలు గుప్పించాలని బీజేపీ ప్లాన్ వేసింది.

బీజేపీ మాస్టర్ ప్లాన్

బీజేపీ మాస్టర్ ప్లాన్

డీకే. శివకుమార్ అరెస్టు విషయంలో బీజేపీలోని ఒక్కలిగ నాయకులు మాత్రమే సమాధానం చెప్పాలని, మిగిలిన నాయకులు ఎలాంటి విమర్శలు చెయ్యరాదని బీజేపీ హైకమాండ్ సూచించింది. ఒక్కలిగులను దూరం చేసుకుంటే మనకే మంచిది కాదని, వారి విమర్శలకు బీజేపీలోని ఒక్కలిగ నాయకులే సరైన సమాధానం ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ సూచించింది. ఇలా చేస్తే ఒక్కలిగులు తమ పార్టీకి దూరం కాకుండా ఉంటారని బీజేపీ నాయకులు అంటున్నారు.

ముల్లును ముల్లుతోనే తీయ్యాలి

ముల్లును ముల్లుతోనే తీయ్యాలి

ముల్లును ముల్లుతోనే తీయాలి అని బీజేపీ హైకమాండ్ అంటోంది. బీజేపీ నాయకుల ప్లాన్ ఎలా ఉందో ముందు ముందు వెలుగు చూడనుంది. డీకే. శివకుమార్ అరెస్టు విషయంలో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నాయి. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల నాయకుల విమర్శలు తిప్పికొట్టాలని బీజేపీలోని ఒక్కలిగ నాయకులు బీజేపీ హైకమాండ్ సూచించింది. డీకే. శివకుమార్ అరెస్టు విషయంలో ఒక్కలిగులు చేస్తున్న పోరాటం ఎంత వరకు వెలుతుందో వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

English summary
Vokkaliga Community Protest Against Senior Congress Leader DK Shivakumar Arrest: What Is BJP Plan To Tackle This?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X