వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికల కోడ్ వర్తిస్తుందే బాలా..! వెడ్డింగ్ కార్డులో మోడీ ప్రస్తావనకు నోటీసులు

|
Google Oneindia TeluguNews

డెహ్రాడూన్‌ : పెళ్లిళ్లకు, ఎన్నికల కోడ్ కు సంబంధమేంటి అనుకుంటున్నారా? అవును సంబంధముంది. ఉత్తరాఖండ్ లో జరిగిన ఓ సంఘటన కారణంగా పెళ్లి కొడుకు తండ్రికి ఎన్నికల సంఘం తాఖీదులు జారీచేసింది. ప్రధాని మోడీపై చూపిన అభిమానం ఆయన్ని ఇబ్బందులకు గురిచేసింది.

జగదీశ్ చంద్ర జోషి అనే వ్యక్తి తన కుమారుడికి పెళ్లి నిశ్చయించారు. అయితే వెడ్డింగ్ కార్డుల్లో పెళ్లికి సంబంధించిన వివరాలతో పాటు మోడీకి ఓటు వేయండనే అంశం ముద్రించడం వివాదస్పదమైంది. కట్నకానుకలు తీసుకురావొద్దని.. రానున్న లోక్ సభ ఎన్నికల్లో మోడీకి ఓటు వేయాలని ప్రింట్ వేయించారు. అదే తమకు పెద్ద బహుమానమని పేర్కొన్నారు.

బీజేపీ భవితవ్యం ఆ మూడు సామాజిక వర్గాల చేతుల్లో..! వారి ఓటుబ్యాంకును కొల్లగొడితేనే మళ్లీ ఛాన్స్!బీజేపీ భవితవ్యం ఆ మూడు సామాజిక వర్గాల చేతుల్లో..! వారి ఓటుబ్యాంకును కొల్లగొడితేనే మళ్లీ ఛాన్స్!

vote for modi in wedding cards election commission issued notices

మోడీపై ఉన్న అభిమానంతో చంద్ర జోషి ఆ పని చేసినా.. ఎన్నికల సంఘం అధికారుల కనుసన్నల్లోంచి తప్పించుకోలేకపోయారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున ఈ అంశం కూడా ఉల్లంఘన కిందకు వస్తుందని ఆయనకు నోటీసులు జారీచేశారు. వ్యక్తిగతంగా ఈసీ ముందు హాజరుకావాలని ఆదేశించారు. దీనిపై స్పందించిన చంద్ర జోషి.. తెలియకుండా తప్పు జరిగిందని, క్షమించమని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఏ పార్టీకి తాము మద్దతివ్వడం లేదని, ఎందులోనూ క్రీయాశీలకంగా పనిచేయడం లేదంటున్నారు.

English summary
Jagadish Chandra Joshi from Uttarkhand got notices from election commission. He printed vote for modi in his son's wedding cards. Due to Election Code, The EC issued notices to joshi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X