వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ, నితీష్‌ల మధ్య బంధం తెగినట్టేనా...?

|
Google Oneindia TeluguNews

బిహార్‌లో బీజేపీ, అధికార పార్టీ జేడీయుకు మధ్య పోత్తులు తెగినట్టేనా.... ఎన్డీఏ మిత్రపక్షాల్లో శివసేన తర్వాత అత్యధిక స్థానాలు సాధించిన జేడీయు అధినేత నితీష్ కుమార్ ప్రభుత్వంలో చేరకపోవడం దేనికి సంకేతం... తాత్కాలికంగా ప్రభుత్వంలో చేరకున్నా..భవిష్యత్‌లో కూడ చేరాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పిన నితీష్ కుమార్ వ్యాఖ్యలు దేనికి సంకేతం...

మోడీ అధికారం చేపట్టిన తొలిరోజే షాక్ ఇచ్చిన నితీష్

మోడీ అధికారం చేపట్టిన తొలిరోజే షాక్ ఇచ్చిన నితీష్

2014లో మోడీలో మిత్రపక్షాలతో కలిసి మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. కాని మోడీ తీరు నచ్చక, 2019 ఎన్నికల ముందే కొన్ని విపక్షాలు దూరమయ్యాయి.. అయితే రెండవ సారి చేపట్టిన అధికారంలో మాత్రం అధికారం చేపట్టిన తొలి రోజునే జేడీయు దూరంగా వెళ్లింది. దీంతో అత్యధిక మెజారీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రధాని మోడిపై మొదటి క్యాబినెట్ విస్తరణలోనే జేడీయు నుండి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. మిత్రపక్షంగా ఉన్న జేడీయుకు మంత్రివర్గ విస్తరణ సరైన ప్రాతినిధ్యం కేటాయింపులపై అభిప్రాయ భేదాలు రావడంతో నితీష్ కుమార్ ఎన్డీఏకు వ్యతిరేకంగా రివర్స్ గేర్ వేశారు.

భవిష్యత్‌‌లో కూడ ప్రభుత్వంలో చేరబోమని తేల్చి చెప్పిన నితీష్

భవిష్యత్‌‌లో కూడ ప్రభుత్వంలో చేరబోమని తేల్చి చెప్పిన నితీష్

మోడీ ప్రమాణ స్వీకారం తర్వాత బీహార్ చేరుకున్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అక్కడి మీడీయాతో మాట్లాడాడు. ఈనేపథ్యంలోనే భవిష్యత్‌లో కూడ మోడీ ప్రభుత్వంలో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇక బీహార్‌లో వ్యక్తులపై ఆధారపడి ప్రజలు తీర్పు ఇవ్వలేదని మోడీని ఉద్దేశించి పేర్కోన్నాడు. ఇది బిహార్ ప్రజల విజయమని స్పష్టం చేశాడు. బిహార్‌లో ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారని అయితే అది బీజేపీ విజయంగా చెప్పుకుంటు అవాస్తవాన్ని ప్రచారం చేస్తున్నారని నితీష్ విమర్శలు చేశారు. ఇప్పుడు కాకుండా తర్వాతనైన ప్రభుత్వంలో చేరుతారా అనే ప్రశ్నకు బదులిస్తూ బీజేపీ అత్యధిక మెజారీటీ సాధించిందని అలాంటీ ప్రభుత్వంలో చేరాల్సిన అవసరం లేదని స్సష్టం చేశారు.

బీహార్ 39 స్థానాలను స్వీప్ చేసిన ఏన్డీఏ పక్షాుల

బీహార్ 39 స్థానాలను స్వీప్ చేసిన ఏన్డీఏ పక్షాుల

గత ఎన్నికల్లో బీహార్‌లోని మొత్తం నలబై స్థానాలకు గాను బీజేపీ, జేడీయు,తోపాటు ఏల్‌జేపీలు కలిసి మొత్తం నలబై స్థానాలకు గాను 39 స్థానాలను గెలుచుకున్నాయి.కాగా బిహార్‌లో బీజేపీ 17 లోక్‌సభ స్థానాలను, ముఖ్యమంత్రి నితిష్ కుమార్ అధ్యర్యంలోని జనతాదళ్ యూ 16 స్థానాల్లో పోటి చేసి గెలిచాయి. ఇక వీరితోపాటు రాంవిలాస్ పాశ్వన్ నాయకత్వం వహిస్తున్న లోక్ జనశక్తి పార్టీ ఆరు స్థానాలను గెలుచుకున్నాయి. అయితే మోడీ క్యాబినెట్‌లో రాంవిలాస్ పాశ్వాన్ పార్టీ అయిన ఎల్‌జేపీకి ప్రాతినిథ్యం లభించగా ..జనతాదళ్ యూ కు మాత్రం క్యాబినెట్‌లో సరైన ప్రాతినిధ్యం లభించకపోవడంతో ఆయన మంత్రివర్గంలో చేరేందుకు నిరాకరించారు.

English summary
Bihar Chief Minister Nitish Kumar, said today that there was "no question" of joining the government now.He also said, in what seemed to be a pointed message for the BJP and PM Modi, that "votes in Bihar were not polled in the name of any personality"
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X