వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

10 రాష్ట్రాల్లో 54 అసెంబ్లీ స్థానాలకు ముగిసిన ఉపఎన్నికలు -మధ్యప్రదేశ్‌లో 66శాతం పోలింగ్

|
Google Oneindia TeluguNews

బీహార్ అసెంబ్లీ సాధారణ ఎన్నికల రెండో దశతోపాటే దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లోని 54 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం ఉప ఎన్నికలు జరిగాయి. తెలంగాణలోని దుబ్బాక, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, హర్యానా, ఝార్ఖండ్‌, కర్ణాటక, ఒడిశా, నాగాలాండ్‌ రాష్ట్రాల్లో వివిధ కారణాల వల్ల పలు స్థానాలు ఖాళీ కాగా.. కేంద్ర ఎన్నికల సంఘం ఆయా స్థానాలకు పోలింగ్ నిర్వహించింది. దాదాపు అన్ని చోట్లా ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా ముగిసింది.

 బీహార్:రెండో దశ కూడా ప్రశాంతం -53.51శాతం పోలింగ్ - టర్నౌట్‌పై పార్టీల్లో గుబులు బీహార్:రెండో దశ కూడా ప్రశాంతం -53.51శాతం పోలింగ్ - టర్నౌట్‌పై పార్టీల్లో గుబులు

అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 28 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా గుజరాత్‌లో ఎనిమిది, యూపీలో ఏడు, కర్ణాటక, ఒడిశా, జార్ఖండ్‌, నాగాలాండ్‌లో రెండు చొప్పున, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, హర్యానాలో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరిగాయి. మధ్యప్రదేశ్ లోని 28 స్థానాల్లో 66.09 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

Voting for by-elections to 54 seats in 10 states ends, 66.09% turnout in madhyapradesh

జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన సమయంలో 25 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం, అందకు ముందే ఖాళీగా ఉన్న మూడ సీట్లు కలిపి మధ్యప్రదేశ్ లో 28 స్థనాలకు మంగళవారం పోలింగ్ జరిగింది. వీటిలో కనీసం తొమ్మిదింటిలో బీజేపీ గెలిస్తేనే శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రభుత్వం మనగలుగుతుంది. మెజార్టీ అటుఇటు అయితే అధికారం మళ్లీ కాంగ్రెస్ హస్తగతం అయ్యే అవకాశాలున్నాయి. మొత్తం..

బీజేపీలోకి విజయశాంతి ఎంట్రీ ఖాయమా? చేరికపై బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలుబీజేపీలోకి విజయశాంతి ఎంట్రీ ఖాయమా? చేరికపై బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

10 రాష్ట్రాల్లోని 54 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఈవీఎంలను స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించారు. బీహార్ అసెంబ్లీ సహా 54 బై పోల్ ఫలితాలు నవంబర్ 10న వెలువడనున్నాయి.

English summary
Along with the second phase of polling in the Bihar assembly elections, voting for 54 other assembly seats in 10 states also took place on Tuesday in the first electoral test for their political parties in the post-Covid-19 era. Voter turnout of 66.09 per cent recorded till 5:30 pm in Madhya Pradesh by-elections. Polling is being held for 28 seats in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X