వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పథకాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు బంద్: సార్వత్రిక ఎన్నికలు, అమల్లోకి కోడ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం అధికారి ప్రకటించారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో ప్రభుత్వాలు కొత్త పథకాలు ప్రకటించడంతో పాటు ప్రారంభోత్సవాలు, శంకుస్ధాపనల కార్యక్రమాలు చేపట్టే అవకాశముండదు.

Voting from April 11 to May 19, result on May 23, Model Code of conduct comes into effect

ఇక లోకసభతో పాటు త్వరలోనే పదవీ కాలం ముగుస్తున్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూలును విడుదల చేసింది. గత ఎన్నికల తరహాలోనే ఈసారి కూడా దేశవ్యాప్తంగా పలు విడతల్లో ఎన్నికల ప్రక్రియ ముగించనుంది.

చీఫ్ ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా, కమిషనర్లు అశోక్ లావాసా, సుశీల్ చంద్ర ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు ప్రకటించారు. దేశవ్యాప్తంగా 543 లోకసభ స్థానాలకు, అలాగే, ఏపీ (175), ఒడిశా (147), సిక్కిం (32), అరుణాచల్ ప్రదేశ్ (60) రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

నియోజకవర్గాల వారీగా షెడ్యూల్

English summary
Lok Sabha election schedule. Voting from April 11 to May 19, result on May 23, Model Code of conduct comes into effect.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X