వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బూతు బొమ్మలు కనిపిస్తున్నాయని ఫిర్యాదు చేస్తే.. దిమ్మదిరిగే రిప్లై ఇచ్చిన రైల్వే శాఖ...

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : రైల్వే టికెట్ల రిజర్వేషన్ చేసుకునే సమయంలో ఐఆర్సీటీసీ యాప్‌లో వివిధ రకాల యాడ్స్ వస్తుంటాయి. ఒక్కోసారి యాజర్లకు చిరాకు తెప్పిస్తుంటాయి. టికెట్ బుక్ చేసుకునేందుకు యాప్ ఓపెన్ చేసిన ఓ వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. దీనిపై రైల్వే శాఖకు ఫిర్యాదు చేయగా.. అక్కడి నుంచి వచ్చిన జవాబు చూసి షాకయ్యాడు. నెటిజన్ల చేతిలో ట్రోల్ అయ్యాడు.

ఐఆర్‌సీటీసీ యాప్‌లో ఆశ్లీల యాడ్స్ కనిపిస్తుండటంతో ఆనంద్ కుమార్ అనే యూజర్ వాటిని స్క్రీన్ షాట్ తీశాడు. ఐఆర్‌సీటీసీ, రైల్వేశాఖ, పీయుష్ గోయెల్‌కు ట్విట్టర్ ఖాతాలకు ట్యాగ్ చేశారు. యాప్‌లోఆశ్లీల, అసభ్య ప్రకటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది చాలా ఇబ్బందికరంగానూ, చిరాకు కలిగిస్తోందని ఫిర్యాదు చేశాడు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని సూచించాడు.

ట్విట్టర్‌లో తాను చేసిన ఫిర్యాదు చూసి ఐఆర్‌సీటీసీ సమస్య పరిష్కరిస్తుందని ఆనంద్ భావించాడు. అయితే ఐఆర్‌సీటీసీ నుంచి వచ్చిన రిప్లై చూసి మనోడి మైండ్ బ్లాంకైంది. "ఐఆర్‌సీటీసీ యాడ్స్ కోసం గూగుల్ యాడ్ సర్వీస్ టూల్ ఏడీఎస్‌ ఉపయోగిస్తుంది. అది యూజర్ల బ్రౌజింగ్ హిస్టరీని, బ్రౌజింగ్ బిహేవియర్‌ను బట్టి యాడ్స్ చూపిస్తుంది. అలాంటి యాడ్స్ చూడకుండా ఉండాలంటే కుకీస్‌ను బ్రౌజింగ్ హిస్టరీని డిలీట్ చేయండి" అని ఐఆర్‌సీటీసీ ట్విట్టర్ నుంచి రిప్లై వచ్చింది.

vulgar ads on Irctc app. savage reply from railway

ఇక ఇదేనుగా ఆనంద్‌ను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు నెటిజన్లు. వెబ్‌సైట్స్‌లో యాడ్స్ గురించి ఎప్పుడూ కంప్లైంట్ చేయద్దు. అవి మన సీకెట్స్‌ను బయటపెడతాని ఒకరంటే... ఏ విత్తనం నాటితే ఆ మొక్కే వస్తుందంటూ మరొకరు సటైర్ వేశారు.

English summary
A Twitter user tweeted to IRCTC’s official Twitter account, tagging along Piyush Goyal, Minister of Railways of India, saying that he was seeing obscene ads on the IRCTC app. The reply that he got from IRCTC, however, is leaving the internet in splits.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X