• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వీవీప్యాట్ స్లిప్ ల లెక్కింపు పిటీషన్.. సుప్రీంకోర్టు సమక్షానికి: శుక్రవారం విచారణ: వాడివేడిగా

|

న్యూఢిల్లీ: దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో.. మరోసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరుపై సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఈవీఎంలను ట్యాంపర్ చేయడం ద్వారా మెజారిటీలో మార్పులు చేర్పులకు అవకాశం ఉంటుందంటూ బీజేపీయేతర ప్రతిపక్ష పార్టీలన్నీ గళమెత్తుతున్నాయి. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలంటూ ఇదివరకే నినదించిన ప్రతిపక్ష పార్టీలు.. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు సమక్షానికి తీసుకెళ్లాయి. ఓటు వేసిన తరువాత ఈవీఎంల నుంచి వెలువడే వీవీప్యాట్ స్లిప్పులను కూడా లెక్కించాలని కోరుతూ కాంగ్రెస్ కూటమిలోని పార్టీలు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశాయి. ఈ పిటీషన్ శుక్రవారం విచారణకు రానుంది. తెలుగుదేశం పార్టీ సహా మొత్తం 21 ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఈ పిటీషన్ పై సంతకాలు చేసి, సుప్రీంకోర్టుకు సమర్పించాయి.

బోయింగ్ 737 రద్దు: ఎవరికి లాభం.. ఎవరికి నష్టం?

ఈవీఎంలు దుర్వినియోగారిని గురవుతున్నాయని ప్రతిపక్షాలు కొన్నాళ్లుగా ఆరోపిస్తోన్న విషయం తెలిసిందే. ఏ బటన్ నొక్కినా.. ఓటు మాత్రం బీజేపీకే పడుతోందంటూ అనుమానాలు వెల్లువెత్తిన సందర్భాలు ఉన్నాయి. ఈవీఎంలను ట్యాంపర్ చేసి, బీజేపీ అన్ని రాష్ట్రాల్లోనూ అధికారంలోకి వచ్చిందంటూ ఇదివరకు విమర్శించిన ప్రతిపక్ష పార్టీలు న్యాయపోరాటానికి సిద్ధపడ్డాయి.

VVPAT pitition filed by opposition parties will come to bench in friday

సార్వత్రిక, అసెంబ్లీ, ఉప ఎన్నికల్లో ఈవీఎంలతో పాటు కనీసం 50 శాతం వీవీప్యాట్‌ పేపర్‌ స్లిప్‌లను లెక్కించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాల్సిందిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో పాటు 21 మంది జాతీయ స్థాయి నేతలు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఏదో ఒక పోలింగ్‌ కేంద్రంలో వీవీప్యాట్‌ పేపర్‌ స్లిప్‌లను లెక్కించాలంటూ ఈసీ జారీ చేసిన మార్గదర్శక సూత్రాలను కొట్టివేయాలని వారు అభ్యర్థించారు.

ఏదో ఒక పోలింగ్ కేంద్రంలో వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించడం వల్ల ఎంత మాత్రమూ ఉపయోగం ఉండదని, ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను కొట్టేయాలని కోరాయి. 50 శాతం మేర వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించేలా మార్గదర్శకాలు జారీ చేయాలని ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటీషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. శుక్రవారం విచారణ చేపట్టనుంది. ఈ పిటీషన్ పై సంతకాలు చేసిన నాయకుల్లో చంద్రబాబు నాయుడు, దేవేగౌడ, అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, స్టాలిన్, అరవింద్ కేజ్రీవాల్, డెరిక్ ఒబ్రెయిన్, సతీష్ మిశ్రా, సురవరం సుధాకర్ రెడ్డి, మనోజ్ ఝా, డానిష్ అలీ, అజిత్ సింగ్, అశోక్ కుమార్ సింగ్, బద్రుద్దీన్, కోదండరామ్ వంటి నాయకులు ఉన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Supreme Court of India will take pitition filed by non BJP and NDA parties on Friday. The Pitition carried regards of VVPAT slips should be count in Polling station along with EVMs. 21 Parties of Along with TDP leaders under signed this pitition. Non BJP Parties alleged that, BJP trying to tamper the EVMs and came to the power in so many states.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more