వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యాపం స్కాంలో బెయిల్ ఇవ్వొద్దు: సుప్రీంలో ఆర్జీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ ను కుదిపేసిన వ్యాపం కిల్లింగ్ స్కాం కేసులో నిందితులకు బెయిల్ ఇవ్వరాదని సీబీఐ అధికారులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే తన దర్యాప్తునకు ఇబ్బంది కలుగుతుందని సీబీఐ అధికారులు సుప్రీం కోర్టుకు మనవి చేశారు.

అదే విధంగా దర్యాప్తు పూర్తి అయ్యే వరకు ఎఫ్ఐఆర్ లు భద్రంగా ఉంచాలని సిట్ కు ఆదేశాలు జారీ చెయ్యాలని సీబీఐ అధికారులు సుప్రీం కోర్టులో మనవి చేశారు. వ్యాపం స్కాం కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలో ఎఫ్ఐఆర్ లు బయటకు రాకూడదని అర్జీలో మనవి చేశారు.

Vyapam scam: Supreme Court to hear CBI plea on Monday

వ్యాపం స్కాం కు సంబంధించి ఇప్పటి వరకు 185 కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల బదిలీకి సమయం పడుతుందని, అంత వరకు నిందితులకు బెయిల్ ఇవ్వరాదని సీబీఐ అధికారులు సుప్రీం కోర్టులో అర్జీ సమర్పించారు.

సీబీఐ సమర్పించిన అర్జీని సోమవారం విచారణ చెయ్యడానికి సుప్రీం కోర్టు అంగీకరించింది. వ్యాపం కుంభకోణం కేసు దర్యాప్తును సీబీఐకి స్వయంగా సుప్రీం కోర్టు అప్పగించింది. సుప్రీం కోర్టు పర్యవేక్షణలోనే వ్యాపం స్కాం కేసు దర్యాప్తు జరుగుతున్నది.

English summary
Vyapam scam:Suprrem Court to hear CBI plea on July 20
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X