వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాస్త ఆగండి: జయ, దాటేసిన ఉమెన్ చాందీ

|
Google Oneindia TeluguNews

చెన్నై/తిరువనంతపురం: దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళలో సోమవారం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 11గంటల వరకు 25శాతం పోలింగ్ నమోదైనట్లు సమాచారం. కాగా, రెండు రాష్ట్రాల ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జయలలిత, డీఎంకే అధినేత కరుణానిధి, కెప్టెన్ విజయకాంత్, ప్రముఖ నటుడు రజినీకాంత్, కమల్ హాసన్, ఖూష్భూలు తమ ఓటు హక్కును సోమవారం ఉదయమే వినియోగించుకున్నారు.

మే 19న కౌంటింగ్ జరగనుంది. కాగా, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జయలలిత, డీఎంకే అధినేత కరుణానిధి, కెప్టెన్ విజయకాంత్, బిజెపి, కాంగ్రెస్ పార్టీల కూటములు ఎన్నికల్లో తమ శక్తి మేరకు ప్రచారాన్ని కొనసాగించాయి.

ఇదే సమయంలో కేరళ రాష్ట్రంలో 30శాతం ఓటింగ్ శాతం నమోదైంది. కేరళలోని 140 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మధ్యాహ్నం వరకు 28.46శాతం ఓటింగ్ నమోదైంది. ఇది ఇలా ఉండగా, పాండిచ్చేరిలో 27.52శాతం ఓటింగ్ నమోదైంది.

విజయంపై చాందీ దాటవేత

కేరళలో సోమవారం ఉదయం ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో బిజెపికి డిపాజిట్లు కూడా దక్కేలా లేవని అన్నారు. అయితే, తమ పార్టీ గెలుపుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమానర్హం. కాగా, రాజకీయ నేతగా మారిన క్రికెటర్ శ్రీశాంత్ ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఓ సెల్పీ దిగి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

కాస్త ఆగండి: జయ

ఇది ఇలా ఉండగా, చెన్నై మేరీస్ కాలేజీలో ఓటు హక్కు వినియోగించుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మాట్లాడుతూ.. 'మరో రెండ్రోజుల్లో ప్రజలు ఏం తీర్పు ఇచ్చారో తెలిసిపోతుంది' అని అన్నారు. అప్పటి వరకు వేచి చూడాలని అన్నారు.

'మేము ఎక్కువ సీట్లు గెలుచుకుంటాం. మాకు అవకాశాలు అలాగే వున్నాయి' అని ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం డీఎంకే అధినేత కరుణానిధి చెప్పారు.

కాగా, తమిళనాడు, కేరళలో జరుగుతున్న ఎన్నికల్లో అత్యధికంగా ప్రజలు పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని మోడీ ట్విట్టర్ ద్వారా కోరారు. ఓటు హక్కు మనందరి బాధ్యత అని ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం సూపర్ స్టార్ రజినీకాంత్ చెప్పారు.

జయలలిత మొత్తం 234 స్థానాల్లో పోటీ చేస్తూ తమ సామర్థ్యాన్ని చాటుకున్నారు. మిగిలిన అన్ని పార్టీలో పొత్తులతో బరిలోకి దిగాయి. ఈసారి ఎన్నికల్లో జయలలితకు మిగితా పార్టీల నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.

మోడీ 'సోమాలియా'వ్యాఖ్యలు తమకు కలిసొస్తాయంటున్న కాంగ్రెస్

ప్రధాని నరేంద్ర మోడీ కేరళను ఉద్దేశించి మాట్లాడుతూ సోమాలియాతో పోల్చిన వ్యాఖ్యలు తమకు కలిసివస్తాయని, బిజెపిపై తీవ్ర ప్రభావం చూపుతాయని కాంగ్రెస్ నేత ఏకే అంటోనీ సోమవారం అన్నారు. సోమిలియాలో ఎక్కువగా సముద్రపు దొంగలుంటారని, కరువులుంటాయని.. అలాంటి ఆ దేశంతో తమ రాష్ట్రాన్ని పోల్చడంపై కేరళ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని అంటోనీ తెలిపారు.

తను చేసిన వ్యాఖ్యలకు మోడీ కేరళ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అంటోనీ డిమాండ్ చేశారు. కేరళలోని కొన్ని ప్రాంతాల్లో శిశు మరణాలు ఎక్కువగా ఉండటంపై స్పందించిన మోడీ.. కేరళను సోమాలియాతో పోల్చి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాగా, మోడీ వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్, ఇతర పార్టీలపై బిజెపి నేతలు మండిపడుతున్నారు.

English summary
Over 25 percent voters came out to cast their votes till 11 am on Monday during the ongoing polling for the Tamil Nadu Assembly elections as Chief Minister Jayalalithaa, DMK’s Karunanidhi, Captain Vijayakanth, actors Rajinikanth, Kamal Haasan and Khushboo showed up during the early hours of the day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X