వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ములాయం కు దారేదీ కాంగ్రెస్ తో పొత్తుకు ఇంకా టైముంది,అఖిలేష్ వ్యూహమేమిటి?

కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు ఇంకా సమయం ఉందని ఉత్తర్ ప్రదేశ్ సిఎం అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. పార్టీ, ఎన్నికల గుర్తు దక్కకపోవడంతో ఏం చేయాలనే సందిగ్థ పరిస్థితుల్లో ములాయం సింగ్ ఉన్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో :ఎన్నికల కమీషన్ అఖిలేష్ కే సైకిల్ గుర్తును , పార్టీని కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ములాయం సింగ్ సైలెంట్ అయ్యారు. తనకు పార్టీ గుర్తును కేటాయించడంతో తన సతీమణితో కలిసి వెళ్ళి అఖిలేష్ ములాయం సింగ్ ఆశీర్వాదాలు తీసుకొన్నారు.ములాయం సింగ్ ఏం చేస్తారనే ఆసక్తి సర్కత్రా ఆసక్తి నెలకొంది.తండ్రిపై విజయం సాధించడం సంతోషించే విషయం కాదన్నారు.ఇది జరగకూడని పరిణామని అఖిలేష్ అభిప్రాయపడ్డారు.మరో వైపు కాంగ్రెస్ పాచ్టీతో పొత్తుకు ఇంకా కొంత సమయం ఉందన్నారు అఖిలేష్ యాదవ్.

సమాజ్ వాదీ పార్టీలో నెలకొన్న సంక్షోభానికి తెరపడింది. పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్ ను, పార్టీని అఖిలేష్ కు కేటాయిస్తూ ఎన్నికల కమీషన్ నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయం తో ములాయం వర్గం షాక్ కు గురైంది.

ఎన్నికల కమీషన్ నిర్ణయం వెలువడిన వెంటనే అఖిలేష్ యాదవ్ తన సతీమణితో కలిసి ములాయం సింగ్ ఆశీస్సులు తీసుకొన్నారు. అఖిలేష్ తో ములాయం సింగ్ సుదీర్ఘంగానే మాట్లాడారని సమాచారం.

వీరిద్దరూ మద్య ఏ అంశాలు చర్చకు వచ్చాయనే విషయం మాత్రం ఇంకా బయటకు రాలేదు. ములాయం సింగ్ యాదవ్ వర్గీయులకు అఖిలేష్ వర్గానిది పై చేయి కావడం మింగుడుపడడం లేదు.

ములాయం సింగ్ ఏం చేస్తారు?

ములాయం సింగ్ ఏం చేస్తారు?

పార్టీ పగ్గాలు, ఎన్నికల గుర్తు కూడ అఖిలేష్ కు కేటాయించడంతో ములాయం సింగ్ వర్గానికి ఇబ్బందులు తప్పేలా లేవు. ములాయం వర్గం వైపు తక్కువ మంది మాత్రమే ఉన్నారు. వీరు కూడ ములాయం వైపే ఉంటారా, లేదా అఖిలేష్ వర్గం వైపుకు వస్తారా అనే చర్చ సాగుతోంది.సైకిల్ గుర్తు తనకు దక్కే అవకాశం ఉందని ములాయం వర్గం ఆశతో ఉంది.అయితే ములాయం సింగ్ కు ఎన్నికల కమీషన్ నిర్ణయం తీవ్ర నష్టాన్నే చేసింది.ఎన్నికల వేళ ఈ పరిస్థితి ములాయంసింగ్ ను ఇబ్బందుల పాలు చేసింది.అమర్ సింగ్ కూడ లండన్ వెళ్ళిపోతున్నారు. శివపాల్ యాదవ్ తో పాటు తనకు మద్దతిచ్చే నాయకులు ఏం చేయలేని నిస్సహయ స్థితిలో ఉన్నారు ములాయం వర్గీయులు.

అఖిలేష్ వర్గం చూపుతున్న పదవిని తీసుకొంటాడా?

అఖిలేష్ వర్గం చూపుతున్న పదవిని తీసుకొంటాడా?

పార్టీలో 90 శాతం అఖిలేష్ వైపే నిలిచింది. ఈ పరిణామంతో ములాయం కు ఇబ్బందులు తప్పేలా లేవు. పార్టీ జాతీయ అధ్యక్షుడి పదవిని కొడుకు అఖిలేష్ దక్కించుకొన్నారు. ఈ పరిణామాలను దృస్టిలో ఉంచుకొని అఖిలేష్ వర్గం ములాయం కు మార్గదర్శి అనే పదవిని క్రియేట్ చేసింది. ఈ పదవిని ములాయం సింగ్ తీసుకొంటాడా లేదా అనేది ప్రస్తుతం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.తాను ఏర్పాటుచేసిన పార్టీ కొడుకు చేతుల్లోకి వెళ్ళిపోవడం ములాయం కు రాజకీయంగా తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను తెచ్చిపెట్టింది.

అఖిలేష్ వర్గీయుల్లో ఉత్సాహం

అఖిలేష్ వర్గీయుల్లో ఉత్సాహం

అసెంబ్లీ ఎన్నికల కోసం అఖిలేష్ వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికల బరిలోకి దిగే అభ్యర్థులను ఆయన ఎంపిక చేసుకొన్నారు.ఇక పార్టీ తన చేతుల్లోకి వచ్చినందున టిక్కెట్ల కేటాయింపులో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తనకు నచ్చిన అభ్యర్థులకే అఖిలేష్ టిక్కెట్టను కేటాయించనన్నారు. ఈ మేరకు అఖిలేష్ సన్నిహితులు, మద్దతుదారుల్లో ఎన్నికల కమీషన్ నిర్ణయం ఉత్సాహన్ని నింపింది.లక్నోలో పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద వారు సంబరాల్లో మునిగితేలారు.

కాంగ్రెస్ తో పొత్తుకు ఇంకా సమయం ఉంది

కాంగ్రెస్ తో పొత్తుకు ఇంకా సమయం ఉంది

కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల్లోపొత్తు ఏర్పాటుచేసుకొనేందుకు ఇంకా సమయం ఉందని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చెప్పారు.ఈ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ నాయకులు తాము పొత్తుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు.అయితే ఈ పరిణామాలపై అఖిలేష్ మాత్రం ఇంకా సమయం ఉందని ప్రకటించారు. మంగళవారం నాడు తన నివాసంలో పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. కాంగ్రెస్ తో పొత్తు విషయమై తొందరపడాల్సిన అవసరం లేదన్నారు.

ములాయంతో సంబంధాలు చెడిపోలేదు

ములాయంతో సంబంధాలు చెడిపోలేదు

తన తండ్రితో తన సంబంధాలు ఎప్పుడూ చెడిపోలేదని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చెప్పారు. తన తండ్రితో తనకు అసలు విబేధాలే లేవని అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. తాను ప్రతిపాదిస్తున్న అభ్యర్థుల జాబితా, తన తండ్రి వద్ద ఉన్న అభ్యర్థుల జాబితాలో 90 శాతం పేర్లు ఒకటేనని ఆయన చెప్పారు. తండ్రి మీద విజయం సంతోషించేది కాదన్నారు. అయినా, ఈ పోరాటం తప్పనిసరిగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు.

English summary
wait for some time for alliance with congress party in uttarpradesy elections said akhilesh, he is meeting with party workers on tuesday in his residence .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X