• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

షాకింగ్ : మంచం కింద ఆరు గంటలు... భార్య ప్రియుడు పడకగదిలోకి రాగానే కత్తితో దాడి,హత్య...

|

వాళ్లిద్దరు భార్యాభర్తలు... ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు... ఎనిమిదేళ్లు కలిసి కాపురం చేశారు. అప్పటిదాకా సాఫీగా సాగిన వాళ్ల కాపురంలో వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది. ప్రియుడి కోసం భార్య కట్టుకున్న భర్తను,పిల్లలను వదిలిపెట్టింది. దీనంటికీ కారణమైన ఆమె ప్రియుడిపై భర్త తీవ్రంగా కక్ష పెంచుకున్నాడు. హత్య చేసేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తూ వచ్చాడు. ఎట్టకేలకు ఆరోజు రానే వచ్చింది... భార్యకు తెలియకుండా ఆమె ఇంట్లోకి దూరాడు. ఆమె మంచం కింద ఆరు గంటల పాటు నిరీక్షించాడు. చివరకు ఆమె ప్రియుడు పడక గదిలోకి ప్రవేశించగానే... మంచం కింద నుంచి బయటకొచ్చి కత్తితో అతనిపై దాడి చేశాడు. ఈ దాడిలో అతను ప్రాణాలు కోల్పోయాడు. బెంగళూరులో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

అసలేం జరిగింది...

అసలేం జరిగింది...

బెంగళూరులోని ఆంధ్రహళ్లి ప్రాంతంలో ఉన్న రోహిత్‌నగర్‌లో భరత్ కుమార్-వినూత అనే దంపతులు నివసిస్తున్నారు. ఎనిమిదేళ్ల క్రితం వీరి పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
భార్యాభర్తలు ఇద్దరూ స్థానికంగా ఉన్న ఓ పరిశ్రమలో పనిచేస్తూ పిల్లలను పోషించుకుంటున్నారు. అలా కొన్నేళ్లుగా వీరి కాపురం సాఫీగా సాగుతూ వచ్చింది. ఇదే క్రమంలో మూడేళ్ల క్రితం ఓరోజు వినూత స్వగ్రామానికి చెందిన శివరాజ్ అనే వ్యక్తి వారి ఇంటికి వెళ్లాడు. బెంగళూరులో ఉద్యోగాన్వేషణ కోసం వెళ్లిన అతను... వినూత కుటుంబం అక్కడే ఉంటుందని తెలుసుకుని పలకరించేందుకు వెళ్లాడు.

వినూతను లొంగదీసుకున్న శివరాజ్...

వినూతను లొంగదీసుకున్న శివరాజ్...

అలా వినూత ఇంటికి వెళ్లిన శివరాజ్... అక్కడే వారం రోజులు మకాం వేశాడు. ఈ క్రమంలో వినూతకు దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. నిన్ను ప్రేమిస్తున్నానంటూ ఆమెకు లవ్ ప్రపోజ్ కూడా చేశాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటానని బ్లాక్‌మెయిల్ చేశాడు. దీంతో భయపడిపోయిన వినూత అతనికి లొంగిపోయింది. అప్పటినుంచి ఇద్దరి మధ్య శారీరక సంబంధం కూడా ఏర్పడింది. భరత్ తరుచూ వినూత ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. అలా కొన్ని రోజులకు వినూత భర్త భరత్‌కు అసలు విషయం తెలిసింది.

ప్రియుడి కోసం భర్తను వదిలేసిన వినూత

ప్రియుడి కోసం భర్తను వదిలేసిన వినూత

శివరాజ్‌తో సంబంధంపై భరత్ భార్య వినూతను గట్టిగా నిలదీశాడు. దీంతో ఆమె భర్తతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయింది. బెంగళూరులోనే మరో ప్రాంతంలో ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటోంది. అప్పటినుంచి వినూత ప్రియుడు శివరాజ్ ఆమెతోనే ఉంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భర్త ఆగ్రహంతో రగిలిపోయాడు. ఎలాగైనా అతన్ని అంతమొందించాలని ఓ పదునైన కత్తిని కొనుగోలు చేశాడు. అతన్ని హత్య చేసేందుకు సరైన సమయం కూడా ఎదురుచూస్తూ వచ్చాడు.

మంచం కింద ఆరు గంటలు....

మంచం కింద ఆరు గంటలు....

ఇదే క్రమంలో భార్య వినూత ఇంటి వద్ద పలుమార్లు రెక్కీ నిర్వహించాడు. ఓరోజు భార్య వినూత కూరగాయాలు కొనేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లడం గమనించాడు. ఇంటికి తాళం వేయకపోవడంతో.. తలుపు తీసుకుని ఇంట్లోకి దూరాడు. పడకగదిలో మంచం కింద దాక్కున్నాడు. అలా ఆరు గంటలు మంచం కిందే ఉన్నాడు. ఎట్టకేలకు రాత్రి 10.30గంటల సమయంలో భార్య వినూత,ఆమె ప్రియుడు శివరాజ్ పడకగదిలోకి వచ్చి మంచంపై వాలారు. కాసేపటికి వినూత వాష్‌రూమ్‌కి వెళ్లడంతో... భరత్ మంచం కింద నుంచి బయటకొచ్చాడు. వినూత వాష్‌రూమ్ నుంచి బయటకు రాకుండా తలుపుకు గొళ్లెం పెట్టాడు. ఆపై కత్తితో శివరాజ్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. అతని పొత్తి కడుపులో కత్తితో పొడిచాడు. దీంతో తీవ్ర రక్తస్రావంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

English summary
In yet another shocking case that took place at Andrahalli, west Bengaluru on Thursday, a 31-year-old man hid under a cot for more than six hours to kill his wife's lover. He was waiting for her partner to turn up, and he later stabbed him to death in the wee hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X