ఇన్పోసిస్ నుండి నారాయణమూర్తి వెదొలగాల్సిందే: ఓంకార్
బెంగుళూరు: ఇన్పోసిస్లో బోర్డు సభ్యులకు వ్యవస్థాపకులకు రగిలిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. ఈ కారణంగానే సిఈఓ పదవికి విశాల్ సిక్కా రాజీనామా చేశారని విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇన్పోసిస్ వ్యవస్థాపక సభ్యుడైన నారాయణమూర్తిపై మాజీ బోర్డు సభ్యుడు విమర్శలు చేస్తూ బహిరంగంగా లేఖ రాయడం సంచలనం కల్గించింది.
ఇన్పోసిస్ రెండు దశాబ్దాలుగా సంస్థకు నారాయణమూర్తి అందించిన సేవలు ఆకట్టుకొన్నాయని చెబుతూనే మూర్తిపై విమర్శలను ఎక్కుపెట్టారు. స్వతంత్ర డైరెక్టర్గా ఉన్న ఓంకార్గోస్వామి ఈ లేఖ రాశారు.

సంస్థలో పరిస్థితి మరింత చెడకముందే మీ గౌరవం మరింత నాశనం కాకముందే సంస్థ నుండి వైదొలగాలని ఆయన ఆ లేఖలో కోరారు.సిఈఓ విశాల్ సిక్కా స్పందించకపోవడం, ఇతరత్రా పరిణామాలపై ఆయన తీవ్రంగా స్పంందించారు. పనయా వ్యవహరం, కార్పోరేట్ గవర్నెర్స్, వేతన ప్యాకేజీ వ్యవహారాలను ప్రస్తావించిన ఆయన బోర్డు అసమర్థతపై ఓంకార్ విమర్శలు గుప్పించారు.
ఒకవైపు యూబీ ప్రవీణ్రావును ప్రశంసిస్తూనే ఆయన వేతనంపై విమర్శలు గుప్పిస్తున్నారని చెప్పారు. వాస్తవానికి విశాల్ బాధ్యతలు స్వీకరించినప్పుడు పరిశ్రమ వెనుకబడి ఉందన్నారు.