వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కదం తొక్కిన 35 వేల మంది రైతులు.. కాలినడకన ముంబైకి.. ఫడ్నవీస్ ప్రభుత్వంలో ఆందోళన!

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

Recommended Video

రైతుల లాంగ్ మార్చ్: అసెంబ్లీ ముట్టడికి సై ?

ముంబై: తాము ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చాలని డిమాండ్ చేస్తూ దాదాపు 35 వేల మంది రైతులు కదం తొక్కారు. మండుటెండలను సైతం లెక్కచేయకుండా అయిదు రోజులు క్రితం కాలినడకన ముంబైకి బయలుదేరారు.

మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన రైతులు 180 కిలోమీటర్లు నడిచి ముంబైకి చేరుకోవడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే ఆందోళనలో పడింది మహారాష్ట్రలోని ఫడ్నవీస్ ప్రభుత్వం. ముందు జాగ్రత్త చర్యగా ముంబైలో అడుగడుగునా పోలీసులను మోహరించింది.

అఖిల భారత కిసాన్ సభ ఆధ్వర్యంలో పంట రుణాల మాఫీ ప్రధాన డిమాండ్‌గా, గిట్టుబాటు ధర కల్పించాలని, పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, ఎరువులు, పురుగుమందులను సబ్సిడీకి ఇప్పించాలని కోరుతూ వేలాది మంది రైతులు సోమవారం విధానసభ ముట్టడి కోసం నగరానికి చేరుకున్నారు.

Walking 180 km, 35,000 Farmers Reach Mumbai For Debt Waiver, Fair Pay

అయితే రైతుల ఆందోళన నేపథ్యంలో ముంబై మహా నగరాన్ని పోలీసులు ఇప్పటికే తమ అధీనంలోకి తీసుకుని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ వైపు దారితీసే మార్గాల్లో ట్రాఫిక్‌ను నిలిపేశారు.

ఈ రైతుల ఆందోళనకు మహారాష్ట్ర విపక్షాలు, శివసేన తదితర పార్టీలు మద్దతు ప్రకటించడంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. మరోవైపు రైతుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని వారి సమస్యలను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ప్రకటించారు.

English summary
After walking with blistered feet for about 180 km in the blazing sun over the last five days, at least 35,000 farmers from Maharashtra's Nashik district have entered the capital city. They camped at the Thane-Mumbai border this morning before heading for the KJ Somaiya Ground in Sion. The traffic police say they are prepared and have also issued a traffic advisory to avoid jams in the city. Elaborate security arrangements are also in place, police said. The farmer contingent, including tribal cultivators, led by the Left-affiliated All India Kisan Sabha (AIKS), plans to gherao the Vidhan Sabha tomorrow to press their demands for complete loan waiver and transfer of adivasi land to farmers who have been tilling it for years. The adivasis, who have joined the movement in huge numbers, say it is a matter of life and death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X