sasikala jayalalithaa rk nagar chennai against aiadmk dmk శశికళ జయలలిత ఆర్ కే నగర్ చెన్నై వ్యతిరేకంగా ఏఐఏడీఎంకే డీఎంకే
శశికళకు చాలెంజ్: ఇక్కడ గెలిచి, అక్కడ పోటీ చెయ్యి !
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిథ్యం వహిస్తున్న చెన్నైలోని ఆర్ కే నగర్ శాసన నియోజక వర్గం నుంచి శశికళను పోటీ చేయించి ఎమ్మోల్యే చెయ్యాలని ఆమె వర్గీయులు ప్రయత్నాలు చేస్తూ నానా తంటాలుపడుతున్న విషయం తెలిసిందే.
అయితే ఆర్ కే నగర్ నియోజక వర్గంలోని అన్నాడీఎంకే కార్యకర్తలు నెచ్చెలి శశికళకు ప్రతి రోజూ షాక్ మీద షాక్ ఇస్తున్నారు. శశికళకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఫ్లక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. మీరు ఇక్కడి నుంచి ఎందుకు పోటీ చెయ్యాలనుకుంటున్నారు? అని బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు.
జయ మేనకోడలు ఎఫెక్ట్: శశికళకు అర్హత లేదు, దీపా పెరవై
అన్నాడీఎంకే కార్యకర్తలు శశికళ బంగారు నగలు వేసుకుని, పట్టుచీర కట్టుకుని ఉన్న ఒక పాత ఫోటోతో పెద్ద ఎత్తున ఫ్లక్సీలు ఏర్పాటు చేశారు. అందులో శశికళకు వ్యతిరేకంగానే తమిళంలో వ్యాఖ్యలు రాశారు.

ఆర్ కే నగర్ నియోజక వర్గం నుంచి అమ్మ జయలలితను రెండు సార్లు గెలిపించాం, ఇక్కడ మాకందరికి ఏ పని కావాలన్నా అమ్మ నిమిషాలలో పనులు చేయించారు. మా గుండెల్లో అమ్మ పదిలంగా ఉన్నారు.
అయితే చిన్నమ్మా (శశికళ) మీరు మాత్రం ఇక్కడి నుంచి పోటీ చెయ్యకూడాదు, ఎందుకంటే అమ్మ మరణించిన తరువాత ఆమె ఆస్తులు, పదవుల మీదే మీరు ఎక్కువ దృష్టి పెట్టారు. అమ్మ ఏలా మరణించారు ? అని చాల మంది అనుమానంతో కోర్టులను ఆశ్రయిస్తున్నారు.
ఏం మాయ చేశారో: జయ కంటే శశికళకు క్రేజ్ పెరిగిందా ?
అయితే జయలలిత మరణించే వరకు ఆమె పక్కనే ఉన్న మీరెందుకు నోరు విప్పడం లేదు ? సమాధానం ఇవ్వడం లేదు ? మీరు సమాధానం చెప్పిన తరువాత ఇక్కడి నుంచి పోటీ చెయ్యాలని ఆర్ కే నగర్ లో పెద్ద ఎత్తున ఫోస్టర్లు, ఫ్లక్సీలు ఏర్పాటు చేస్తున్నారు.
ఇదే సమయంలో స్థానికులు ఓ చాలెంజ్ చేశారు. మీరు ఆర్ కే నగర్ నుంచి పోటీ చేసి విజయం సాధించిన తరువాత అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా భాద్యతలు స్వీకరించాలని సవాలు చేశారు. ఇక్కడ ఓడిపోతో మీరు ఆపదవిలో కుర్చోరాదని సూచించారు.
ఈ దెబ్బతో అన్నాడీఎంకే నాయకులు హడలిపోతున్నారు. స్థానిక నాయకులను బుజ్జగించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఎవరో కావాలని పార్టీ వ్యతిరేకులు ఇలా చేస్తున్నారని అన్నాడీఎంకే నాయకులు చెన్నై నగర పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.