వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యుత్ బిల్లు రూ. 30వేలు: తక్కువ రావాలంటే బీజేపీని దింపేసి.. కాంగ్రెస్‌కు పట్టం కట్టండి!

|
Google Oneindia TeluguNews

భోపాల్: తాను వినియోగించినదానికంటే విద్యుత్ బిల్లు భారీగా రావడంతో దిగ్భ్రాంతికి గురైన ఓ వినియోగదారుడు విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేసిన అతడికి విద్యుత్ శాఖ ఇచ్చిన సమాధానం చూసి దిమ్మదిరిగిపోయింది. కరెంటు బిల్లు తక్కువగా రావాలంటే బీజేపీని దింపేసి.. కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోండి అంటూ విద్యుత్ శాఖ నుంచి సమాధానం రావడం గమనార్హం. దీంతో అతడు మరింత ఆశ్చర్యానికి గురయ్యాడు.

కాంగ్రెస్ పెద్దలకు షాక్: మోడీ ప్యాకేజీపై కోమటిరెడ్డి ప్రశంస, ప్రధానికి లేఖకాంగ్రెస్ పెద్దలకు షాక్: మోడీ ప్యాకేజీపై కోమటిరెడ్డి ప్రశంస, ప్రధానికి లేఖ

రూ. 30 బిల్లు రావడంతో..

రూ. 30 బిల్లు రావడంతో..

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. అఘర్ మాల్వా జిల్లాకు చెందిన హరీష్ జాదవ్ అనే వినియోగదారుడికి తాజాగా కరెంటు బిల్లు కింద రూ. 30వేలు వచ్చింది. దీంతో మధ్యప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో వారు ఓ కాంప్లైంట్ ఐడీ ఇచ్చారు. తర్వాతి రోజు ఫిర్యాదు గురించి తెలుసుకునేందుకు తనిఖీ చేయగా.. క్లోజ్ అయినట్లు సందేశం కనిపించింది.

బీజేపీని దింపేస్తే.. రూ. 100 బిల్లు..

బీజేపీని దింపేస్తే.. రూ. 100 బిల్లు..

అంతేగాక, అందుకు గల కారణం గురించి చూడగా.. ‘మీకు తక్కువ మొత్తం కరెంటు కావాలా? అయితే అధికారంలో ఉన్న బీజేపీని దింపేసి.. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురండి. అప్పుడు మీ బిల్లు రూ. 100 వస్తుంది' అని రాసివుంది.

బాధ్యుడైన అధికారి సస్పెన్షన్..

బాధ్యుడైన అధికారి సస్పెన్షన్..

అది చూసిన జాదవ దిమ్మదిరిగిపోయింది. దీంతో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతోపాటు కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపారు. బాధ్యుడైన అసిస్టెంట్ ఇంజినీర్‌ను సస్పెండ్ చేశారు. దీనిపై పూర్తి విచారణ జరుపుతామని అధికారులు తెలిపారు.

English summary
Want reduced bill? Remove BJP, elect Congress: MP electricity dept's response to a complaint.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X