వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లీడర్‌గా ఎదగాలంటే అధికారుల కాలర్ పట్టుకోండి.. మంత్రి సంచలన వ్యాఖ్యలు (వీడియో)

|
Google Oneindia TeluguNews

రాయ్‌పూర్‌ : చత్తీస్ గఢ్ మంత్రి కవాసీ లఖ్మా సంచలన వ్యాఖ్యలు చేశారు. లీడర్‌గా ఎదగాలంటే అధికారుల కాలర్ పట్టుకోవాలని విద్యార్థులకు హితబోధ చేశారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దుమారం రేగుతోంది. పిల్లలకు మంచి చెప్పాల్సింది పోయి రెచ్చగొట్టడం ఏంటనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

చత్తీస్ గఢ్ సూక్మా జిల్లాలోని పవారాస్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిన మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చానీయాంశమైంది. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా స్కూల్ విద్యార్థులతో మంత్రి ముచ్చటించారు. ఆ క్రమంలో ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ విధంగా స్పందించారు.

want to be big leader grab officials collar says minister

మీరు గొప్ప నేతగా ఎదిగారు కదా.. ఇది మీకు ఎలా సాధ్యమైందంటూ ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు మంత్రి ఇలా జవాబు చెప్పారు. మీలా బడా నేతగా ఎదగాలంటే ఏం చేయాలనే సదరు విద్యార్థి ప్రశ్నకు మంత్రి గారి సమాధానం చూసి అక్కడున్నవారు నివ్వెరపోయారు. పెద్ద నేతగా ఎదగాలంటే అధికారుల కాలర్ పట్టుకోవాలని మంత్రి సమాధానం ఇవ్వడం కలకలం రేపుతోంది. కలెక్టర్, ఎస్పీ కాలర్ పట్టుకుంటే బడా లీడర్లుగా ఎదగొచ్చని ఆయన సూచించిన తీరు వివాదస్పదమైంది.

పవర్‌ ఫుల్ ట్రైబల్ లీడర్‌గా ఎదిగిన సదరు మంత్రి కవాసీ లక్మా ప్రాథమిక విద్య కూడా పూర్తి చేయకపోవడం గమనార్హం. కలిసి వచ్చిన అదృష్టంతో మంత్రిగా కొలువుదీరిన ఆయన ఇలా మాట్లాడటం హాట్ టాపికైంది. అదలావుంటే ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో కూడా సరిగా పదాలను ఉచ్ఛరించలేకపోవడం గమనార్హం.

English summary
A Chhattisgarh minister courted controversy after a video of him, in which he was heard purportedly saying he had advised a boy to "hold the collar of SP and collector to become a big politician". Commercial Tax (Excise) and Industry Minister Kawasi Lakhma had reportedly made the remark during Teachers' Day celebration on September 5 in a government school in Sukma district headquarter of the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X