• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పోలీసుల వర్క్ ఫ్రం హోం స్కీం... క్రిమినల్స్ సమాచారం అందిస్తే నజరాన....!

|

మీరు ఇంట్లో ఉండే వేల రుపాయలు సంపాదించాలని భావిస్తున్నారా..? గృహిణిలు, రిటైర్ అయిన వారితోపాటు ఉద్యోగం లేని యువతకు మంచి అవకాశం ...ఇంట్లో ఉండే డబ్బులు సంపాదించండి...ఇది సాధరణంగా వర్క్ ఫ్రం హోం ఉద్యోగాల్లో వెలువడే ప్రకటనలు ...కాని ఇప్పుడు ఇది పోలీసు శాఖకు పాకింది...ఇంటి నుండే సంపాదించండి...కాని పని చేసి కాదు...పోలీసులకు క్రిమినల్స్ సమాచారం అందిస్తే చాలు డబ్బులు మీ ఇంటికే వస్తాయి..ఇలా నెలకు అయిదు వేల రపాయల వరకు సంపాదించుకునే అవకాశాన్ని కల్పించారు యూపి పోలీసులు..

క్రిమినల్స్ సమాచారం ఇస్తే డబ్బులు

క్రిమినల్స్ సమాచారం ఇస్తే డబ్బులు

క్రిమినల్స్‌ను పట్టుకునేందుకు సమాచారమే ముఖ్యం... సమాచారం అందించేందుకు ఎన్ని వ్యవస్థలు , టెక్నాలజీ ఉన్నా...మన చుట్టుపక్కల తిరుగుతున్న క్రిమినల్స్,చట్టవ్యతిరేక కార్యాకలాపాలను చేస్తున్న వారిని పట్టుకోవడం కష్టంగానే ఉంటుంది.. ఇక చిన్న చిన్న నేరాలు, దొంగతనాలు చేసేవాళ్లను పోలీసులు అసలు పట్టించుకునే పరిస్థితి కూడ ఉండదు..దీంతో చాల రాష్ట్రాల్లో చిల్లర ,దొంగలతోపాటు క్రిమినల్స్, చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేసేవాళ్లు యధేశ్ఛగా తిరుగుతున్నారు... వారిని పట్టుకునేందుకు పోలీసులకు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది.గ్రామాలు, పట్టణల్లో వైట్ కాలర్ నేరగాళ్లు ప్రజల మధ్యనే తిరుగుతారు.. దీంతో క్రిమినల్స్‌ను పట్టుకోవడానికి యూపి పోలీసులు విన్నూత్న ఆలోచన చేశారు.

ఉత్తర ప్రదేశ్ బలరాంపూర్ జిల్లా పోలీసుల ప్రయోగం

ఉత్తర ప్రదేశ్ బలరాంపూర్ జిల్లా పోలీసుల ప్రయోగం

ఉత్తర ప్రదేశ్‌లోని బలరాంపూర్ జిల్లా పోలీసు అధికారులు ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. పలు కేసుల్లో క్రిమినల్స్ పట్టించేవారికి న వారికి డబ్బులు ప్రకటించారు. దొంగిలించిన కారును కనిపెట్టడానికి సహాచం చేస్తే 1000 రుపాయాలు, లైసెన్స్ లేని తుపాకులు తదితర సమాచారం అందిస్తే 5000 రుపాయాలను ప్రకటిస్తూ గ్రామంలో పోలీస్ స్టేషన్ పరిధిలో కరపత్రాలను పంచారు. కాగా దీనికి సాక్ష్యాలు ఇచ్చే ఉద్యోగిత పథకంగా నామకరణం చేశారు. ఇక సమాచారం ఇచ్చిన వ్యక్తుల సమాచారాన్ని కాన్ఫిడెన్షియల్ గా ఉంచడంతో పాటు, సమాచారం ఇచ్చేందుకు జిల్లా ఎస్పి నంబర్‌ను ప్రకటించారు.కాగా సమాచారం చెప్పిన వారికి డబ్బులు నేరుగా ఇవ్వడం లేదా వారు తెలిపిన అకౌంట్‌లో వేస్తున్నారు.

ఫలితాలు ఇస్తున్న ప్రయోగం

ఫలితాలు ఇస్తున్న ప్రయోగం

కాగా పోలీసుల ప్రయోగాలు ఫలితాలను ఇస్తున్నాయి. పోలీసులు నజరానాలు ప్రకటించిన ఇన్‌ఫార్మర్స్‌ ఇచ్చే సమాచారంతో పన్నేండు కేసులను పరిష్కరించినట్టు జిల్లా ఎస్పి దేవ్ రంజన్ వర్మ ప్రకటించారు..కాగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ స్కీం తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు..ఇందుకోసం పోలీసు అధికారులకు ఫండ్ కూడ ఇస్తున్నట్టు ఆయన తెలిపారు..కాగా ఇలాంటీ నజరానాలు పలు రాష్ట్రాల్లో ఉన్న బహిరంగా ప్రకటనలు చేసి ప్రజల సహాకారాన్నితీసుకోవడం మాత్రం యూపి పోలీసులకే చెల్లింది..అయితే ఈ వ్యవస్థ కోద్ది మంది పోలీసు ఇన్మార్లకు మాత్రమే ఉండేది. పలు రాష్ట్రాల్లో నక్సల్స్, ఉగ్రవాదుల సమాచారాన్ని తెలుసుకునేందుకు ఇలాంటీ వ్యవస్థను పోలీసులు సృష్టించారు..కాని నేరాలను అదుపు చేసేందుకు ఇలాంటీ ప్రయోగాలు చేయడంతో ఎలాంటీ ఫలితాలు వస్తాయో వేచి చూడాలి.

English summary
want to earn thousands of rupees sitting at home? The Balrampur police in Uttar Pradesh have an offer for you.the cops have launched a 'Mukhbir Rozgar Yojana" (witness employment scheme) under which those giving information about criminals and their activities will be given monetary rewards
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more