వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెబల్ ఎమ్మెల్యేల తిరుగుబాటుకు కారణమిదే..? ఏం చెప్పారంటే ..

|
Google Oneindia TeluguNews

ముంబై/ బెంగళూరు : కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేలు మరో బాంబు పేల్చారు. తాము ఏ పదవీ, డబ్బు ఆశించి ముంబైలో క్యాంపు వేయలేదని తేగిసి చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ముంబైలో మకా వేసినట్టు వివరించారు. తమను సంకీర్ణ ప్రభుత్వ పెద్దలు ఎన్నడూ పట్టించుకోలేదని విమర్శించారు. తమ రాజీనామాలతో కుమారస్వామి సర్కార్‌కు ఓ గుణపాఠం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. డబ్బుల కోసం ఇలా చేస్తున్నారనే కొందరి ఆరోపణలను ఎమ్మెల్యేలు తోసిపుచ్చారు.

ముంబైలోనే మకాం ..
మరికొన్ని గంటల్లో కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష జరగనుంది. బల నిరూపణ కోసం కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వం శతవిధలా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ముంబైలో ఉన్న రెబల్ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. తాము ముంబై నుంచి రాబోమని తేల్చిచెప్పారు. తమ రాజీనామాలతో కుమారస్వామి ప్రభుత్వానికి గట్టి గుణపాఠం అవుతుందన్నారు. అయితే మీరు డబ్బుల కోసం ముంబైలో మకాం వేశారనే మీడియా ప్రతినిధుల ప్రశ్నలను ఖండించారు. తమకు ఎవరూ నగదు, ఇతర పదవులు ఇస్తామని ఎవరూ ఇవ్వలేదని పేర్కొన్నారు. బెంగళూరులో అంతా సర్దుకున్నాకే .. వెళతామని అంతకుముందు వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

Want to teach Karnataka Congress-JDS govt a lesson: Rebel MLAs

కారణమిదే ..
సోమవారం జరిగే బలపరీక్షకు ఎట్టి పరిస్థితుల్లో హాజరుకాబోమని తేల్చిచెప్పారు. తమకు సంకీర్ణ ప్రభుత్వంలో అవమానం జరిగిందని మండిపడ్డారు. ఒకసారి, రెండుసార్లు గెలిచిన వారు మంత్రులవుతారు. కానీ ఆరు, ఏడు పర్యాయలు ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు మాత్రం అలానే ఉండాలా అని ప్రశ్నించారు. ఇదేం పద్ధతి అని నిలదీశారు. ఒకరికి న్యాయం, మరొకరిని అన్యాయమా ? అని మండిపడ్డారు. తమకు ఆమాత్య పదవీ ఇక దక్కదనే ధిక్కార స్వరం వినిపించేందుకు ముంబై వచ్చామని పేర్కొన్నారు. తమ లాంటి నేతలకు జరుగుతున్న అన్యాయం .. ఆయా ప్రభుత్వాలకు గుణపాఠం కావాలని తెలిపారు.

English summary
The rebel Karnataka MLAs said on Sunday that they did not come to Mumbai for money but to teach the Congress-Janata Dal (Secular) coalition government a lesson. They also denied the reports that the rebel MLAs from the Congress and the JD(S) were offered money to switch sides. The rebel MLAs are currently camping in a hotel in Mumbai, Maharashtra. The statement of the rebel MLAs has come just a day before the Karnataka assembly floor test on Monday. Speaking to news agency ANI, the Karnataka rebel MLAs said that they all will go back to Bengaluru once everything in Karnataka sorts out.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X