వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సైనికుడ్ని కావాలనుకుని క్రికెటరయ్యా: ఎంఎస్ ధోనీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Mahendra Singh Dhoni
న్యూఢిల్లీ: తాను సైనికుడ్ని కావాలని అనుకున్నానని, అయితే దైవం జోక్యం చేసుకుని తనను క్రికెటర్‌ను చేసిందని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. సైన్యంలో చేరాలని చిన్నప్పటి నుంచీ అనుకుంటూ ఉండేవాడినని, సైనికులను చూసే ఏదో ఒక రోజు తాను కూడా అలా అవుతానని కలలు కంటుండేవాడినని ఆయన అన్నారు.

రాంచీలోని పారాచూట్ రెజిమెంట్‌లో ఓ రోజు గడుపుతూ ఆయన ఆజ్ తక్‌తో మాట్లాడాడు. యూనిఫాం తన ఎత్తు భయాన్ని తొలగించిందని చెప్పాడు. యూనిఫాం ప్రత్యేకమైందని, బహుశా ఈ యూనిఫాంకే తాను భయపడలేదని అన్నాడు.

సైనికాధికారులతో ధోనీ సరదాగా గడిపాడు. ఒత్తిడిలో కూడా కూల్‌గా ఉండడం ఎలా సాధ్యమవుతోందని వారు ఆయనను అడిగారు. మీడియా సమావేశానికి ముందు రోజు తాను వెళ్లి ఫ్రిడ్జ్‌లో కూర్చుంటానిని, ఆ రకంగా తాను కూల్‌గా ఉంటానని ధోనీ హాస్యమాడాడు.

ధోనీ జవాన్లతో సరదాగా గడపడమే కాకుండా వారి కుటుంబ సభ్యులను కూడా కలిశాడు. వారితో ఫొటోలకు ఫోజులు ఇచ్చాడు. వారి పిల్లలకు ఆటోగ్రాఫ్‌లు ఇచ్చాడు.

English summary

 Indian captain Mahendra Singh Dhoni aspired to be a soldier but says, destiny intervened to make him a cricketer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X