వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్జేడీ, జేడీయూ మధ్య మాటల తూటాలు.. బీహార్‌లో రంజుగా మారిన రాజకీయాలు

|
Google Oneindia TeluguNews

పాట్నా : బీహార్‌లో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. ఆర్జేడీ, జేడీఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన రెండు పార్టీలు ఆ తర్వాతి పరిణామాలతో పొత్తుకు స్వస్తి పలికాయి. అప్పట్లో కూటమి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్‌పై తాజాగా ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ సతీమణి రబ్రీదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. రబ్రీ వ్యాఖ్యలపై స్పందించిన ప్రశాంత్ కిషోర్.. ఈ విషయంలో లాలూ బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు.

సైనికుల సామర్థ్యంపైనే సందేహాలు : విపక్షాలపై మోదీ విసుర్లుసైనికుల సామర్థ్యంపైనే సందేహాలు : విపక్షాలపై మోదీ విసుర్లు

జేడీయూ - ఆర్జేడీ విలీన ప్రతిపాదన

జేడీయూ - ఆర్జేడీ విలీన ప్రతిపాదన

ఆర్జేడీ పార్టీని సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూలో విలీనం చేయాలని ప్రశాంత్ కిశోర్ ప్రతిపాదించారని రబ్రీదేవి ఆరోపించారు. ఇలా చేస్తే మహాకూటమి ప్రధాని అభ్యర్థిగా నితీశ్ కుమార్ పేరు ప్రకటించవచ్చని, అందుకు ప్రతిఫలంగా లాలూ కొడుకు తేజస్విని బీహార్ సీఎంను చేస్తామని ఆఫర్ ఇచ్చినట్లు చెప్పారు. ప్రశాంత్ ప్రతిపాదనపై ఆగ్రహం వ్యక్తంచేసిన రబ్రీదేవి, ఆయనను బయటకు వెళ్లిపొమ్మని చెప్పినని అన్నారు. మరోవైపు లాలూ తన ఆటో బయోగ్రఫీలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ప్రశాంత్ రెండు పార్టీల విలీనం అంశాన్ని ప్రతిపాదించినట్లు జీవిత చరిత్రలో రాసుకున్నారు.

స్పందించిన ప్రశాంత్ కిశోర్

స్పందించిన ప్రశాంత్ కిశోర్

ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ ఆయన భార్య రబ్రీదేవి చేసిన వ్యాఖ్యలపై జేడీయూ వైస్ ప్రెసిడెంట్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఘాటుగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఓపెన్ చాలెంజ్ చేశారు. జేడీయూలో చేరక ముందు పలుమార్లు లాలూను కలిసిన విషయం వాస్తవమేనని ప్రశాంత్ అంగీకరించారు. అయితే అప్పట్లో తమ మధ్య చర్చకు వచ్చిన విషయాలు బయటపెడితే లాలూ మరిన్ని ఇబ్బందుల్లో పడతారని ట్వీట్ చేశారు. ఈ అంశంపై లాలూ మీడియా ముందుకు వచ్చి ఎప్పడైనా తనతో చర్చ జరపవచ్చని ఛాలెంజ్ చేశారు. బహిరంగ రచ్చలో ఆ రోజు ఏం జరిగిందో ఎవరు ఎవరికి ఏం ఆఫర్ చేశారో ప్రజలకు తెలుస్తుందని అన్నారు.

సైనికుల సామర్థ్యంపైనే సందేహాలు : విపక్షాలపై మోదీ విసుర్లుసైనికుల సామర్థ్యంపైనే సందేహాలు : విపక్షాలపై మోదీ విసుర్లు

ప్రశాంత్‌పై ఆర్జేడీ ఆగ్రహం

ప్రశాంత్‌పై ఆర్జేడీ ఆగ్రహం

ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలను ఆర్జేడీ తీవ్రంగా ఖండించింది. ప్రశాంత్ వయసు లాలూ అనుభవమంతలేదని సటైర్ వేసింది. ఆయన లాంటి రాజకీయ నాయకులు చాలామంది వచ్చి వెళ్లారని, మోడీ, నితీశ్‌ వద్దకు వెళ్లి మీ స్టోరీలు అమ్ముకొమ్మంటూ కౌంటర్ ఇచ్చింది. తాము నిజాలు బయటపెడితే ప్రశాంత్ పరువు, మర్యాదలు పోతాయని ట్వీట్ చేసింది.

English summary
Election strategist-turned-politician Prashant Kishor this morning took a sharp dig at Rashtriya Janata Dal chief Lalu Yadav and invited him for a "joint media interaction" to clear the air about Rabri Devi's claim about a pre-poll alliance offer to the RJD.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X