వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాతో యుద్ధం తధ్యమా !! జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ ఆదేశాలతో టెన్షన్.. రీజన్ ఇదే !!

|
Google Oneindia TeluguNews

భారత్ చైనా బోర్డర్ లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా ?అటు చైనా.. ఇటు ఇండియా రెండు దేశాలు యుద్ధానికి సన్నాహాలు చేస్తున్నాయా ? అన్న అనుమానాలు తాజా పరిణామాల నేపధ్యంలో నెలకొన్నాయి.దీంతో దేశంలో ఎక్కడ ఏం జరిగినా దానికి చైనాతో యుద్ధాన్ని లింక్ చేసి ఆలోచిస్తున్నారు భారతీయులు. ఇక తాజాగా జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం రెండు నెలలకు సరిపడినంత వంటగ్యాస్ నిల్వ చేసుకోవాలని చమురు కంపెనీలకు అత్యవసర ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో చైనాతో యుద్ధం జరగబోతుందని పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది.

Recommended Video

Mann Ki Baat : PM Modi Remarks on China దీటుగా బదులివ్వగలం, చైనాకు మోదీ వార్నింగ్ || Oneindia Telugu
వంట గ్యాస్ నిల్వలు పెంచుకోవాలని జమ్మూ కాశ్మీర్ అత్యవసర ఆదేశాలు

వంట గ్యాస్ నిల్వలు పెంచుకోవాలని జమ్మూ కాశ్మీర్ అత్యవసర ఆదేశాలు

జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం ఈ నెల 27వ తేదీన చమురు మార్కెటింగ్ కంపెనీలు అయిన ఎల్జీ, హెచ్.పీ గ్యాస్ కంపెనీలకు రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు, వినియోగ దారుల విభాగం డైరెక్టర్ పేరుతో ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల మేరకు రెండు నెలలపాటు వంటగ్యాస్ నిల్వలు చేసుకోవాలని, దీనిని అత్యవసర ఆదేశాలుగా భావించాలని కూడా పేర్కొనడంతో చైనాతో యుద్ధం తథ్యం అన్న భావన జమ్ము కాశ్మీర్ వాసుల్లో వ్యక్తమవుతోంది. అయితే అలాంటిదేమీ లేదని యుద్ధం గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జమ్ము కాశ్మీర్ సర్కార్ చెబుతున్నప్పటికీ ప్రజల భయ మాత్రం పోవడం లేదు.

యుద్ధం వస్తుందని ప్రచారం ... సర్కార్ కాదన్నా ప్రజల భయం .. రీజన్ ఇదే

యుద్ధం వస్తుందని ప్రచారం ... సర్కార్ కాదన్నా ప్రజల భయం .. రీజన్ ఇదే

వర్షాకాలం కావడంతో కాశ్మీర్ లోయలో కొండచరియలు విరిగి పడే అవకాశం ఎక్కువగా ఉన్నందున,రహదార్లు మూసివేసే పరిస్థితి వస్తుంది కాబట్టి ముందుగానే గ్యాస్ నిల్వలు పెంచుకోవాలని సూచించామని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. కాని ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ, యుద్ధం దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితులు కనిపించడంతో ఏ క్షణమైనా ఏదైనా జరగొచ్చు అని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అందుకు కారణం లేకపోలేదు. చైనా పాక్ వైపు నుండి కూడా యుద్ధం చెయ్యటానికి సన్నాహాలు చేస్తున్న క్రమంలో ఎప్పుడు ఏ ఉపద్రవం ఎదురవుతుందో అని ఆందోళన చెందుతున్నారు.

ఒకపక్క చర్చలు .. మరోపక్క యుద్ధ సన్నాహాలు

ఒకపక్క చర్చలు .. మరోపక్క యుద్ధ సన్నాహాలు

ఇప్పటికే చైనా చేసిన కుట్రలు,దాడికి ముందు రోజు చైనా మార్షల్ ఆర్ట్స్ ఫైటర్స్ ను పర్వతారోహకులను పంపించిందని చైనా అధికార మీడియా ని వెల్లడించిన నేపథ్యంలో చైనా పక్కా ప్లాన్ తో భారత సైనికుల పై దాడి చేసిందని అర్థమవుతుంది. ఇక ప్రస్తుతం కూడా రెండు దేశాలు ఒకపక్క చర్చలు జరుపుతూనే మరోపక్క యుద్ధానికి సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి.

టిబెట్, పీవోకే లకు చైనా యుద్ధ విమానాలు .. ఇండియా కూడా రెడీ

టిబెట్, పీవోకే లకు చైనా యుద్ధ విమానాలు .. ఇండియా కూడా రెడీ

ఇప్పటికే టిబెట్, పీవోకే లకు చైనా తన యుద్ధ విమానాలను పంపించింది. మరోవైపు పాకిస్తాన్ వైపు నుంచి కూడా చైనా యుద్ధం చేయాలని చూస్తుంది. చైనా ఎత్తుగడలను బట్టి ఇండియా కూడా యుద్ధానికి సన్నద్ధం అవుతున్నట్లు గా కనిపిస్తోంది. బోర్డర్ ప్రాంతాలకు వేగంగా సైనిక బలగాలను తరలిస్తున్న ఇండియా,ఇప్పటికే యుద్ధ విమానాలు సరిహద్దులకు తరలించింది. దీంతో ఏ క్షణమైనా యుద్ధం మొదలు కావచ్చు అన్న టెన్షన్ నెలకొంది.

English summary
The government of Jammu and Kashmir issuing emergency orders to the oil companies to store enough cooking gas for two months. This has triggered a large-scale campaign of war with China.People worring about any harm from China from the Pakistani side as it prepares to war.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X