వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యే ఫిర్యాదుతో కేంద్రమంత్రికి అరెస్టు వారంట్ జారీ

కేంద్రమంత్రి బాబుల్ సుప్రియోకు అరెస్టు వారంట్ జారీ అయింది. ఓ టీవి ఛానల్ కార్యక్రమంలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులో ఆయన కోర్టుకు గైరాజరయ్యారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

కోల్ కతా: కేంద్రమంత్రి బాబుల్ సుప్రియోకు అరెస్టు వారంట్ జారీ అయింది. ఓ టీవీ ఛానల్ కార్యక్రమంలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులో ఆయన కోర్టుకు గైరాజరయ్యారు.దీంతో ఆయనకు అరెస్టు వారంట్ జారీ అయింది.

ఈ ఏడాది జనవరి మాసంలో నిర్వహించిన ఓ టీవీ చర్చా కార్యక్రమంలో మహిళల మనోభావాలను కించపర్చేలా బాబుల్ సుప్రియో వ్యాఖ్యలు చేశారంటూ తృణమూలు కాంగ్రెస్ ఎమ్మెల్యే మహువా మైత్రా ఫిర్యాదు చేశారు.

Warrant against Babul Supriyo for not appearing in court

అయితే తన పట్ల కేంద్ర మంత్రి అసభ్యంగా ప్రవర్తించారని ఆమె జనవరి 4వ, తేదిన పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేంద్రమంత్రిపై కేసు నమోదు చేశారు.అంతేకాదు అలిపోరి కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు.

ఈ టీవీ చర్చ కార్యక్రమం పుటేజ్ ను కూడ కోర్టుకు సమర్పించారు.అయితే అంతకుముందు దీనిపై కేంద్రమంత్రి పోలీసులు మూడుసార్లు వివరణ కోరితే ఆయన నుండి ఎలాంటి సమాధానం లేదని సమాచారం ఇచ్చారు. దీనిపై కేంద్ర మంత్రి స్పందిస్తూ వాళ్ళు ఏం చేసుకొంటారో అది చేసుకోనివ్వండి దీనిపై నేను చెప్పేది ఏమీ లేదని చెబుతున్నారు మంత్రి . ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

English summary
An warrant has been issued against Union Minister and singer Babul Supriyo today for not appearing in court in a case connected to comments he had made in a television show, NDTV has said. Earlier, the Kolkata Police had filed chargesheet against him on the basis of a complaint filed by TrinamoolCongress MLA Mohua Moitra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X