వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాన్సాస్ ఘటనపై భారత్ ఎందుకిలా?.. హెచ్-1బీ వీసాలే కారణమా?

అమెరికాలో జాత్యహంకారి కాల్పుల్లో తెలుగు ఇంజినీర్ శ్రీనివాస్ కూచిభొట్ల మృతి చెందిన ఘటన మనదేశంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా కలవరానికి గురి చేసింది.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్/న్యూఢిల్లీ: అమెరికాలో జాత్యహంకారి కాల్పుల్లో తెలుగు ఇంజినీర్ శ్రీనివాస్ కూచిభొట్ల మృతి చెందిన ఘటన మనదేశంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా కలవరానికి గురి చేసింది. ఈ విద్వేష కాల్పుల్లో శ్రీనివాస్ తోపాటు అలోక్ రెడ్డి అనే మరో తెలుగు ఇంజినీర్, వీరిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో అమెరికన్ తీవ్రగాయాలపాలయ్యారు. కాగా, ఈ ఘటన భారతదేశంలో ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ఇది అమెరికా ప్రయాణంపై సందిగ్ధత వాతావరణానికి దారితీసింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విద్వేష ప్రసంగాలు, వలస విధానాల వల్లే ఈ దారుణం చోటు చేసుకుందని ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో వైట్ హౌజ్.. శ్రీనివాస్ మృతి పట్ల తన సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఈ హత్య జాతి విద్వేష దాడేనని అంగీకరించింది. చివరకు బుధవారంనాడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ హత్య ఘటనపై స్పందించారు. ఇలాంటి ఘటనలు జరగకూడదని కోరుకుంటున్నట్లు తెలిపాడు.

h1-b visa

ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు భారతీయులు చాలా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తారు. కానీ, ఈసారి మాత్రం నిశ్శబ్దంగా వారి పని వారు చేసుకునేందుకే ఇష్టపడ్డారు. కాగా, ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని భారతదేశానికి హామీ వచ్చింది. కాల్పుల ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించిందని అమెరికాలో భారత రాయబారి ఎస్ జయశంకర్ తెలిపారు. కాగా, కాల్పులకు తెగబడిన నిందితుడ్ని అరెస్ట్ చేసి, విచారిస్తున్నట్లు తమకు సమాచారం అందిందని న్యూఢిల్లీలోని ఓ అధికారి వన్ఇండియాకు తెలిపారు

కాల్పుల ఘటనపై నిశ్శబ్దంగా ఉండటానికి ఇతర కారణాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా జారీ చేసే హెచ్-1బీ వీసాలు భారతదేశానికి చాలా ముఖ్యమైన అంశం. భారతదేశం నుంచి సాఫ్ట‌వేర్ ఉద్యోగాలను తీసుకొస్తానని ఇప్పటికే ట్రంప్ అమెరికా ప్రజలకు చెప్పుకొస్తున్న విషయం తెలిసిందే. దీనిపై పునరాలోచించాలనే విజ్ఞప్తులు కూడా వెల్లువెత్తుతున్నాయి.

భారతదేశానికి చెందిన చాలా సంస్థలు 60శాతం హెచ్-1బీ వీసాలపైనే ఆధారపడుతున్నాయి. వీటి ద్వారా సుమారు 150బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతోందని మన దేశానికి చెందిన ఓ అధికారి తెలిపారు. వీసాల వ్యవహారంపై చర్చించేందుకు జయశంకర్‌ను భారతదేశం పంపింది. అయితే, ఇండియా నుంచి వెళ్లే నిపుణులైన ఉద్యోగులు.. అక్కడి అమెరికా కంపెనీలకు మంచి ప్రయోజనాలనే చేకూరుస్తున్నారు.

జాతీయవాద ఏజెండాను అమలు చేస్తున్న కారణంగా డొనాల్డ్ ట్రంప్‌, అమెరికాతో భారతదేశం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఏర్పడింది. అమెరికన్లకు ఉద్యోగ కల్పన, భద్రత కోసం డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసాపై కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, కాన్సాస్ ఘటన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తన తొలి కాంగ్రెస్ ప్రసంగం కొంత ఊరట కలిగించేలా సాగింది. కాన్సాస్ ఘటన లాంటి విద్వేష దాడులకు అమెరికాలో తావులేదని స్పష్టం చేశారు. అంతేగాక, నిపుణులైన భారత ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది ఉండదనే సంకేతాలను ఇచ్చారు.

English summary
India's response to the Kansas killing was a rather muted one. A selective leak about issuing a demarche and a quick denial by Tuesday evening was how events followed in the aftermath of the killing of Srinivasa Kuchibhotla, the engineer from Hyderabad who was killed at a Kansas bar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X