అసలు 'సీక్రెట్' బయటపడింది: డేరా-హనీప్రీత్ రహస్య ఒప్పందం, కానీ?
చండీగఢ్: పేరుకు మాత్రమే దత్తపుత్రిక అయిన హనీప్రీత్ తో డేరా బాబా ఓ భర్త లాగా మెదిలినట్లు ఆమె మాజీ భర్త పదేపదే ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. డేరా బాబాకు దగ్గరైనప్పటి నుంచి డేరానే లోకంగా బతికినట్లు అతను చెబుతున్నాడు.
'గుర్మీత్'కు ఎందుకింత ఫాలోయింగ్?: ఆ కారణంతోనే బాబా వెనుక లక్షల మంది..
ఇదే క్రమంలో అతనితో విడాకులు.. డేరా బాబాతో ఆమె సంబంధం మరింత బలపడటం జరిగిందంటున్నాడు. తాజాగా హనీప్రీత్ కు సంబంధించి మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. డేరా సచ్చా సౌదాకు గుర్మీత్ తర్వాత తానే చీఫ్ అవుదామని హనీప్రీత్ భావించారా? అన్నదానికి ఇందులో సమాధానం కనిపిస్తోంది.
సంతానం పొంది:
నిజానికి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కు ముగ్గురు సంతానం ఉన్నప్పటికీ.. దత్త పుత్రిక అయిన హనీప్రీత్ తోనే ఎక్కువ సాన్నిహిత్యం ఉండేది. డేరాకు, గుర్మీత్ కు సంబంధించిన ప్రతీ విషయం ఆమెకు మాత్రమే తెలిసేది. అలా గుర్మీత్ వారసురాలిగా ఆమె పేరు మారుమోగింది. హనీప్రీత్ కూడా గుర్మీత్ సామ్రాజ్యంపై కన్నేసిందన్న వాదన ఉంది. గుర్మీత్ ద్వారా సంతానం పొంది, ఆ బిడ్డను భవిష్యత్తులో డేరాకు చీఫ్ చేయాలని ఆమె భావించినట్లు చెబుతున్నారు.
'సీక్రెట్ సన్' ఎత్తు పారలేదు:
నిజానికి, 2007లో తన వారసుడిగా జస్మిత్ని గుర్మీత్ ప్రకటించాడు. ఆ నిర్ణయాన్ని మార్చుకొనేలా హనీప్రీత్ అతనిపై ఒత్తిడి తీసుకురాగలిగింది. గుర్మీత్ ద్వారా కలిగే బిడ్డను మాజీ భర్త విశ్వాస్ గుప్తా సంతానంగా రికార్డుల్లో చూపించాలని భావించింది. అందుకు గుర్మీత్ కూడా ఒప్పుకున్నాడు. కానీ గుప్తా అప్పటికే విడాకులు ఇవ్వడంతో ఆమె ఎత్తు పారలేదు. ఇంతలోనే గుర్మీత్ జైలు పాలవడంతో కథ మొత్తం అడ్డం తిరిగింది.
బయటపెట్టిన డ్రైవర్స్:
గుర్మీత్ తో హనీప్రీత్ సంతానం పొందాలని చూసినట్లు గుర్మీత్ వద్ద డ్రైవర్లుగా పనిచేసిన కట్టాసింగ్, గురుదాస్ సింగ్ లు బయటపెట్టారు. గురుదాస్ సింగ్ కుమారుడు గురుదాస్ సింగ్ తోర్ కూడా కీలక సీబీఐకి కీలక వివరాలు అందిస్తున్నట్లు తెలుస్తోంది.
హనీప్రీత్ బాధితురాలే:
నిజానికి గుర్మీత్ చేతిలో హనీప్రీత్ కూడా ఓ అత్యాచార బాధితురాలేనని చెబుతున్నారు. తొలుత ఆమెపై గుర్మీత్ అత్యాచారం చేశాడని, ఆ తర్వాతే వారి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని తెలుస్తోంది. ఇక గుర్మీత్ ద్వారా సంతానం పొందాలని చూసిన హనీప్రీత్ కోరిక ఆయనకు కూడా తెలుసునని, అందుకు ఆయన కూడా అంగీకరించాడని అంటున్నారు.
అయితే గుర్మీత్ తో కలిగే సంతానాన్ని గుప్తా బిడ్డగా చూపించాలని చూసిన హనీప్రీత్ కు గట్టి దెబ్బ తగిలింది. గుప్తా ఆమెకు విడాకులు ఇవ్వడంతో అందుకు అవకాశం లేకుండా పోయింది. ఇంతలోనే డేరా లీలలన్ని బయటకు రావడంతో.. హనీప్రీత్కు తప్పించుకు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.