వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాయల్ టాడ్వీది హత్య ? మెడపై నులిమిన గుర్తులు .. మర్డరేనంటున్న టాడ్వీ ఫ్యామిలీ

|
Google Oneindia TeluguNews

ముంబై : సీనియర్ల వేధింపులు భరించలేక బలవన్మరణానికి పాల్పడ్డ డాక్టర్ పాయల్ టాడ్వి ఆత్మహత్య ? హత్య ? ఆమె ఉరేసుకొని చనిపోయిందా ? లేక ఎవరి ప్రమేయం ఉందా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ దీనికి పోస్టుమార్టం రిపోర్ట ఊతమిస్తూ .. టాడ్వీ మెడపై గొంతునులిమిన గుర్తులు ఉండటం ఆమెను హత్యచేసి ఉరేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

వేధింపులు భరించలేక ..

వేధింపులు భరించలేక ..

మహారాష్ట్రకు చెందిన టాడ్వీ ఎస్సీ సామాజిక వర్గానకి చెందినవారు. మెడిసన్‌లో పీజీ చేస్తూ ఓ ఆస్పత్రిలో విధుల్లో చేరారు. అయితే ముగ్గురు సీనియర్లు ఆమెను కులం పేరుతో వేధించడం మొదలుపెట్టారు. మొదట్లో ఊరుకున్నా .. తర్వాత పేరెంట్స్‌కు చెపితే వారు సర్దిచెప్పారు. తమ పీజీ కాలేజీలో కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదని మనోవ్యధతో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడింది. తర్వాత విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టడంతో .. ముగ్గురు సీనియర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. టాడ్వీ కేసుకు సంబంధించి నిన్న వారిని మూడురోజుల కస్టడీకి కూడా తీసుకున్నారు.

హత్య చేశారు ..?

హత్య చేశారు ..?

టాడ్వీ మరణానికి వేధింపులే కారణం కాదు .. సీనియర్లే హత్య చేశారని కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ విషయాన్ని కోర్టులో టాడ్వీ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు. టాడ్వీ మృతదేహం పరిశీలిస్తే ఆత్మహత్య కాదు హత్య జరిగినట్టే ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఆమెను గొంతునులిమి చంపి ఉంటారని సస్పెక్ట్ చేస్తున్నారు. ఈ కోణంలో పోలీసులు విచారణ జరుపాలని కోరుతున్నారు. అంతేకాదు టాడ్వీ మృతదేహనికి మరో ప్రాంతానికి తీసుకెళ్లి .. చివరికి ఆస్పత్రికి తరలించి ఉంటారని తెలిపారు.

మరొకరికి జరగొద్దు ...

మరొకరికి జరగొద్దు ...

టాడ్వీని హతమార్చి ఉంటారని ప్రాసిక్యూటర్ దేశాయ్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దళితులపై జరగుతున్న ఘటనలతో భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి ఏర్పడిందని వివరించారు. ఇలాంటి కేసుల వల్ల సమాజంలో అశాంతి నెలకొనే ప్రమాదం ఉందని వివరించారు. అంతేకాదు టాడ్వీ, సీనియర్ల వాట్సాప్‌లో తొలగించిన సమాచారాన్ని తిరిగి పునరుద్ధించాలని కోరారు. దీంతో నిజనిజాలు ప్రపంచానికి తెలుస్తాయని తెలిపారు. ప్రాసిక్యూషన్ వాదనపై డిఫెన్స్ న్యాయవాది విభేదించారు. టాడ్వీ మృతికి సంబంధించి పూర్తిస్థాయి పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాకే ఆధారాలతో ఆరోపణలు చేయాలని సూచించారు. అంతే తప్ప తమ క్లైంట్లపై నిందులు మోపొద్దని సూచించారు. టాడ్వీ హత్యకు గురైందని ఆమె తల్లిదండ్రులు ఏ ఆధారాలతో ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు.

English summary
the post-mortem report of postgraduate medical student doctor Payal Tadvi, who was found dead in her hostel room recently, has revealed evidence of a ligature mark on her neck. Under 'provisional cause of death', the post-mortem report stated 'evidence of ligature mark over the neck.'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X