వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేరళలో కమ్యూనిజం బతికే ఉంది: వాషింగ్టన్ పోస్ట్ కథనం

కేరళలో ఇంకా కమ్యూనిజం బతికే ఉందని, దేశంలో తొలిసారిగా ఎన్నికల ద్వారా ఇదే రాష్ట్రంలో అధికారాన్ని కమ్యూనిష్టు పార్టీ అధికారాన్ని సాధించిన విషయాన్ని వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌ :కేరళలో ఇంకా కమ్యూనిజం బతికే ఉందని, దేశంలో తొలిసారిగా ఎన్నికల ద్వారా ఇదే రాష్ట్రంలో అధికారాన్ని కమ్యూనిష్టు పార్టీ అధికారాన్ని సాధించిన విషయాన్ని వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించింది.

ఇండియాలో కేరళ రాష్ట్రంలో కమ్యూనిష్టు పార్టీ ఏ రకంగా పాలన సాగిస్తుంది. ఆ రాష్ట్రంలో కమ్యూనిష్టు పాలన సాగడానికి గల కారణాలను ఆ పత్రిక ప్రముఖంగా ప్రచురించింది.

Washington Post’s take on communism in Kerala

కేరళలో ప్రస్తుతం సిపిఎం నేతృత్వంలో లెఫ్ట్‌ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ గుర్తింపు ఉన్న పత్రిక వాషింగ్టన్‌ పోస్ట్‌ ఆదివారం తమ సంచికలో కేరళ రాష్ట్రంలో కమ్యూనిష్టు ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయమై ఓ వ్యాసాన్ని ప్రచురించింది. ఏ కమ్యూనిస్ట్‌ సక్సెస్‌ పేరుతో భారతదేశంలో ఓ చిన్న రాష్ట్రంలో కమ్యూనిజం ఇంకా బతికే ఉందని.. కలలు సాకారం చేసుకునేందుకు అక్కడ కృషి జరుగుతోందంటూ కథనాన్ని ప్రచురించింది.

ప్రముఖ పాత్రికేయులు గ్రెగ్‌ జఫ్ఫె, విది దోషి.. ఈ ప్రత్యేక కథనాన్ని రచించారు. కేరళ ఆర్థిక మంత్రి థామస్‌ ఐసాక్‌ ఇంటర్వ్యూతోపాటు పలు అంశాలను కూడా అందులో ప్రస్తావించారు. వామపక్ష సిద్ధాంతాలను ప్రజలు విస్తృతంగా ఆదరించటం మూలంగానే కేరళలో ఇంకా కమ్యూనిస్ట్‌ పార్టీ విరజిల్లుతోందంటూ థామస్‌ అందులో వివరించారు. కేరళలో వామపక్ష ప్రభుత్వ హయాంలో సాధించిన ఘనతలను కూడా ఆ కథనం విపులంగా వివరించింది.

అమెరికా ప్రధాన వార్తలను సైతం పక్కన పడేసిన ఈ స్టోరీపై పాఠకులు దృష్టిసారించటం విశేషం. ఇదిలా ఉంటే కేరళ పర్యటన సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కూడా అన్ని రంగాల్లో కేరళ అభివృద్ధి చెందిందని.. గ్లోబల్‌ ఫేస్‌ అంటూ ప్రశంసలు కురిపించారు.

English summary
“We are happy and proud to note that even the Washington Post has admitted the relevance and permanence of the communist dream and the creative interventions carried out by the communist-led government in Kerala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X