వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Viral video:డ్రోన్లకు బదులు ఆలుగడ్డ: మీషో నిర్వాకం ఇదీ..? షాక్ తిన్న కస్టమర్

|
Google Oneindia TeluguNews

ఇప్పుడు పండగ సీజన్.. ఈ కామర్స్ సైట్లలో బోలెడు ఆఫర్లు ఉన్నాయి. దీంతో తమకు నచ్చిన వస్తువును కొనుగోలు చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం షాక్ తింటున్నారు. తాము బుక్ చేసిన ఐటెమ్ రాకపోవడంతో ఆ తిప్పలు తప్పడం లేదు. నిన్న ల్యాపీకి బదులు.. డిటర్జెంట్ సోప్స్ వచ్చాయనే వార్త చదివాం కదా.. ఇప్పుడు అలాంటి ఘటన మరొటి వెలుగులోకి వచ్చింది. బీహర్ యువకుడు బాక్స్ ఓపెన్ చేసి ఒక్కసారిగా షాక్ తిన్నాడు.

 తప్పిదాలు ఇలా..

తప్పిదాలు ఇలా..


పండగ సందర్భంగా అంతా బుక్ చేసుకుంటున్నారు. ఆఫర్ భారీగానే ఉండటంతో బుక్సింగ్ జోరుగా సాగుతున్నాయి. అలా తప్పిదాలు జరుగుతున్నాయి. బీహర్‌కు చెందిన ఒక యువకుడు మీషో లో డ్రోన్ బుక్ చేశాడు. దాని కోసం అతను ఆతృతగా ఎదురుచూశాడు. కానీ అతనికి మాత్రం పొటాటోలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా షాక్ తిన్నాడు.

సందేహాం కలిగి.. వీడియో తీసి

సందేహాం కలిగి.. వీడియో తీసి


ఇటీవల జరుగుతున్న ఘటనల దృష్ట్యా అతను ఆన్ బాక్స్ చేసే సమయంలో వీడియో తీశాడు. అప్పటికే అతనికి అనుమానం కలిగింది. డెలివరీ బాయ్‌నే ఓపెన్ చేయాలని అడిగాడు. ఇంకేముంది తెరచి చూశాక.. అందులో బంగాళాదుంపలు ఉన్నాయి. తనను కంపెనీ మోసం చేసిందని సదరు వ్యక్తి ఆందోళన చెందాడు. అతని పేరు చేతన్ కుమార్.. నలందా పర్వాల్‌పూర్‌కు చెందిన వ్యాపార వేత్త.

మీ షో రియాక్ట్

మీ షో రియాక్ట్


ఘటన దుమారం చెలరేగడంతో.. మీ షో స్పందించింది. అతనికి డబ్బులు రీఫండ్ చేస్తామని చెబుతుంది. అలాగే ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని కూడా తెలిపింది. వీడియో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతుంది. నెటిజన్లు చాలా కామెంట్స్ చేస్తున్నారు. మిగతా వారు కూడా తాము ఎలా మోసపోయామో చెబుతున్నారు. కొందరు అతనిపై సందేహాం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ డ్రోన్లకు బదులు ఆలుగడ్డ ఉన్నాయని అతనికేం తెలుసు అని మరొకరు అన్నారు. మెజార్టీ నెటిజన్లు మాత్రం మీ షో అండ్, కంపెనీ తీరును తప్పు పడుతున్నారు.

English summary
a man ordered a drone camera from Meesho, but received potatoes. incident happened at bihar. video goes viral on social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X