• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చంద్రయాన్ 2 ప్రతి ఒక్కరూ వీక్షించండి.. ఫోటోలు షేర్ చేయండి.. మోడీ పిలుపు

|

హైద‌రాబాద్‌ : శుక్రవారం అర్ధరాత్రి అంతరిక్షంలో మహాద్భుతం జరగనుంది. చంద్రయాన్ 2 కు సంబంధించిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ కానుంది. ఈ అద్భుత ఘట్టం వీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సన్నద్ధమయ్యారు. ఈ సమయం కోసం 130 కోట్ల మంది భారతీయులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ మహాద్భుత ఘట్టాన్ని ప్రతి ఒక్కరూ వీక్షించాలని, సోషల్ మీడియాలో ఫోటోలు విరివిగా షేర్ చేయాలని పిలుపునిచ్చారు. ఆ మేరకు సోషల్ మీడియా వేదిక ట్విట్టర్‌లో పలు ట్వీట్స్ చేశారు.

శుక్రవారం అర్ధరాత్రి మహాద్భుత ఘట్టం

ఇస్రో శాస్త్రవేత్తలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 2 కు సంబంధించి మహాద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. శుక్రవారం నాడు అర్ధరాత్రి 1:30 గంటల నుంచి 2:30 గంటల మధ్య చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతంపై విక్రమ్ ల్యాండర్ దిగనుంది. ఆ అద్భుత ఘ‌ట్టాన్ని బెంగళూరులోని ఇస్రో కేంద్రం నుంచి వీక్షించ‌నున్న‌ట్లు ట్వీట్ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.

130 కోట్ల మంది భారతీయులు ఈ స‌మ‌యం కోసం ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నార‌ని ట్వీట్ చేశారు. ఆ క్రమంలో ఇస్రో శాస్త్రవేత్తల సత్తాను ప్ర‌పంచ దేశాలు చూస్తాయని పేర్కొన్నారు. విక్ర‌మ్ ల్యాండ‌ర్ చంద్రుడిపై దిగే అనిర్వ‌చ‌నీయ క్ష‌ణాల‌ను అంద‌రూ వీక్షించాల‌ని పిలుపునిచ్చారు.

విదేశాలకు వస్తువులు పంపడం ఇప్పుడు చాలా ఈజీ గురూ..!

వరుస ట్వీట్లతో మోడీ ఆనందం.. కొందరు యువకులతో కలిసి..!

చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్‌ను సేఫ్‌గా ల్యాండ్ చేసేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే భారతదేశ అంతరిక్ష ప్రయోగాల్లో అసాధారణమైన క్షణాలు ఆవిష్కృతం అవుతున్నట్లు మోడీ తెలిపారు. ఆ మహాద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు తాను భాగస్వామ్యం అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఆ ప్రత్యేక సందర్భాన్ని చూడటానికి తనతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి కొంతమంది యువకులు కూడా ఉంటారని చెప్పారు. భూటాన్‌కు చెందిన కొందరు యువకులు కూడా ఇందులో భాగస్వామ్యం అవుతున్నట్లు మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలంటూ పిలుపు

అంతరిక్షంలో శుక్రవారం నాడు అర్ధరాత్రి జరగబోయే మహాద్భుత దృశ్య కావ్యాలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో విరివిగా పోస్ట్ చేయాలని పిలుపునిచ్చారు మోడీ. ప్రతి ఒక్కరూ చంద్రయాన్ 2 ల్యాండింగ్ వీక్షించాలని కోరారు. ఆ మధుర క్షణాలను ఆస్వాదిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోల్లో కొన్నింటిని తాను రీట్వీట్ చేస్తానని మరో ట్వీట్ చేశారు.

చంద్రయాన్ 2 మిషన్ అప్పటినుంచి ఫాలో అవుతున్నా.. మోడీ

2019, జులై 22వ తేదీన ప్రారంభమైన చంద్రయాన్ 2 యాత్రకు సంబంధించి అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు ఉత్సాహంగా ఫాలో అవుతున్నట్లు మరో ట్వీట్ చేశారు మోడీ. అప్పటి నుంచి ఇప్పటివరకు ఏం జరుగుతోందనే విషయాలను తెలుసుకుంటున్నానని చెప్పారు. క్రమం తప్పకుండా చంద్రయాన్ 2 వివరాలు ఫాలో అవుతున్నట్లు పేర్కొన్నారు. చంద్రయాన్ 2 విజయం కోట్లాది మంది భారతీయులకు చాలా ఉపయోగకరమన్నారు. అంతేకాదు ఈ మిషన్ భారతీయుల ప్రతిభను ప్రపంచ దేశాలకు చాటి చెప్పడమే గాకుండా స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు.

దుబాయ్ శీనులు మోసపోయారు.. ముంచింది లేడీ.. వామ్మో కిలాడీ..!

సైన్స్ అండ్ స్పేస్‌లో విద్యార్థులకు ఆసక్తి

బెంగళూరు ఇస్రో కేంద్రం నుంచి మోడీతో పాటు ప్రతి రాష్ట్రం నుంచి ఇస్రో ఎంపిక చేసిన ఇద్దరు విద్యార్థులు ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షిస్తారు. ఇస్రో నిర్వహించిన క్విజ్‌లో గెలుపొందిన ప్రతిభ గల విద్యార్థులతో ఆ అద్భుత ఘట్టం వీక్షించనుండటం చాలా గర్వంగా ఉందన్నారు. ఇస్రో నిర్వహించిన ఆ క్విజ్‌లో వేలాదిగా విద్యార్థులు పాల్గొనడం చూస్తుంటే సైన్స్ అండ్ స్పేస్‌లో ఎంతో మందికి ఆసక్తి ఉందనే విషయం తెలుస్తోందన్నారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామమని కితాబిచ్చారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A few hours left for the Chandrayaan-2 to land near the Moon’s south pole, Prime Minister Narendra Modi on Friday urged people to watch the special moments. Saying he was extremely excited to be at the Isro centre in Bengaluru, PM Narendra Modi tweeted, I am extremely excited to be at the Isro centre in Bengaluru to witness the extraordinary moment in the history of India’s space programme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more