వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సముద్రంలో నౌక అంచున సీఎం భార్య అమృత సెల్ఫీ: సెక్యూరిటీకి ముచ్చెమటలు (వీడియో)

|
Google Oneindia TeluguNews

Recommended Video

సముద్రంలో నౌక అంచున సీఎం భార్య అమృత సెల్ఫీ

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ తన భద్రతా సిబ్బందికి ముచ్చెమటలు పట్టించారు. శనివారం ముంబై - గోవా క్రూయిజ్‌షిప్‌లో భద్రతా హెచ్చరికలను ఉల్లంఘించి ఆమె సెల్ఫీ తీసుకున్నారు. దీంతో అక్కడున్న వారికి చెమటలు పట్టాయి.

చదవండి: రిస్క్ కాదు, అలా భావిస్తే క్షమించండి.. ఆ తర్వాత అమృతా ఫడ్నవీస్ సారీ

నౌక అంచుకు వెళ్లి సెల్ఫీ

నౌక అంచుకు వెళ్లి సెల్ఫీ

ముంబై - గోవా మధ్య తొలి క్రూయిజ్‌ నౌక ఆంగ్రియాను శనివారం నాడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ హాజరయ్యారు. జెండా ఊపి నౌక ప్రారంభించారు. ఆ వెంటనే అమృతా ఫడ్నవీస్ నౌక అంచుకు వెళ్లి కూర్చొని సెల్ఫీ తీసుకున్నారు. దీంతో భద్రతా సిబ్బంది ఆందోళనకు గురయ్యారు.

మోడీ దిగ్భ్రాంతి: 'ఆర్గనైజర్ కాంగ్రెస్, జనాలపై నుంచి రైలు వెళ్తుంటే సిద్ధూ భార్య ప్రసంగం', ఆమె ఖండనమోడీ దిగ్భ్రాంతి: 'ఆర్గనైజర్ కాంగ్రెస్, జనాలపై నుంచి రైలు వెళ్తుంటే సిద్ధూ భార్య ప్రసంగం', ఆమె ఖండన

 ఆమె వచ్చాక ఊపిరి తీసుకున్న సెక్యూరిటీ సిబ్బంది

ఆమె వచ్చాక ఊపిరి తీసుకున్న సెక్యూరిటీ సిబ్బంది

సెల్ఫీ దిగిన అనంతరం ఆమె వెనక్కి వచ్చాక కానీ సెక్యూరిటీ సిబ్బంది ఊపిరి తీసుకోలేకపోయింది. ఆగ్రియాలో రెండు రెస్టారెంట్లు, ఆరు బార్లు, ఒక ఈతకొలను, డిస్కోథెక్‌, రీడింగ్‌ రూమ్‌, స్పా ఉన్నాయి. ఈ షిప్‌లో మొత్తం 104 గదులు ఉన్నాయి. మొత్తం 400 మంది ఈ నౌకలో ప్రయాణం చేయవచ్చు. 67 మంది సిబ్బంది అందుబాటులో ఉంటారు. ముంబై నుంచి గోవాకు వెళ్లేందుకు పదహారు గంటల సమయం తీసుకుంటుంది.

వైరల్‌గా మారిన వీడియో

అమృతా ఫడ్నవీస్ ఓడ కొన భాగానికి వెళ్లి సెల్ఫీ తీసుకోవడం ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఉంది. ఆదివారం నుంచి వైరల్ అవుతున్న ఆ వీడియోలో అమృతా ఫడ్నవీస్ ఓడ చివరలో కూర్చొని సెల్ఫీ తీసుకున్న చిత్రాలు, ఆమె వెనుక వైపు సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు ఉండటాన్ని కూడా చూడవచ్చు.

వారానికి నాలుగుసార్లు

వారానికి నాలుగుసార్లు

ముంబై, గోవా మధ్యన ఈ క్రూయిజ్‌షిప్ వారానికి నాలుగుసార్లు తిరుగుతుంది. ఈ క్రూయిజ్‌షిప్‌లో టిక్కెట్ ధర రూ.7,000గా, రూ.12,000గా ఉంది. దీనిని ఈ నెల 24వ తేదీ నుంచి తిప్పనున్నారు. ముంబైలోని ప్రిన్సెస్ డక్స్ పర్పుల్ గేట్ నుంచి సౌత్ గోవాలోని మర్మగోవా డక్ వరకు ప్రయాణిస్తుంది.

English summary
Amruta Fadnavis , the wife of Maharashtra's chief minister , grabbed headlines on Sunday after photographs of taking a selfie on the edge of the went viral. In a video that went viral on Sunday (October 21), Amruta Fadnavis can be seen sitting outside the cruise's safety range to click selfies, even as the security personnel on board kept issuing caution to her against it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X