వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సినిమా చూసి నిర్ణయం తీసుకోండి మోడీ బయోపిక్‌పై ఈసీకి సుప్రీం సూచన

|
Google Oneindia TeluguNews

Recommended Video

సినిమా చూసి నిర్ణయం తీసుకోండి... మోడీ బయోపిక్‌పై ఈసీకి సుప్రీం సూచన || Oneindia Telugu

మోడీ బయోపిక్ రిలీజ్‌పై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. సినిమాపై నిషేధాన్ని తొలగించాలంటూ నిర్మాతలు దాఖలు చేసిన పిటీషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. కేసుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది. నిషేధంపై నిర్ణయం తీసుకునే విషయంలో ఈసీకి సుప్రీంకోర్టు సూచనలు చేసింది.

<strong>మోదిలా మారిన లాలు యాదవ్</strong>మోదిలా మారిన లాలు యాదవ్

మోడీ బయోపిక్ నిషేధం పిటీషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ ప్రతినిధులు చిత్రాన్ని చూశారా అని ప్రశ్నించింది.ఈసీ ప్రతినిధుల కోసం పీఎం నరేంద్రమోడీ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటుచేయాలని నిర్మాతలను ఆదేశించింది. సినిమా చూసిన తర్వాత బ్యాన్ ఎత్తివేసే విషయంలో నిర్ణయానికి రావాలని ఈసీకి సూచించింది. ఎన్నికల సంఘం తన నిర్ణయాన్ని ఏప్రిల్ 22లోగా సీల్డ్ కవర్‌లో కోర్టుకు అందించాలని స్పష్టం చేసింది.

Watch modi Biopic and take a call on ban: SC to EC

బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో ప్రధాని మోడీ జీవితగాథ ఆధారంగా పీఎం నరేంద్రమోడీ చిత్రం తెరకెక్కింది. అయితే ఎన్నికల సమయంలో సినిమా రిలీజ్ చేస్తే ఓటర్లను ప్రభావితం చేసే అవకాశముందంటూ కాంగ్రెస్ గతంలో సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. అయితే ఆ పిటీషన్‌ను కొట్టివేసిన సుప్రీం ధర్మాసనం సినిమా రిలీజ్‌పై నిషేధం విధించే విషయంలో నిర్ణయాన్ని ఎన్నికల సంఘానికి వదిలేసింది. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు పూర్తయ్యే వరకు సినిమా రిలీజ్ చేయవద్దని ఆదేశించింది. ఈసీ ఉత్తర్వులపై చిత్ర నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

English summary
The Supreme Court on Monday ordered the Election Commission to watch PM Modi biopic and decide on whether the movie should be banned or not. The top court asked the poll panel to give its view to the court by April 22 in a sealed cover.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X